For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రసవం తర్వాత ఆడవారు స్లిమ్ గా మారాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి, లావు కావడానికి కారణం అదే

మీ డైట్ ఈ విధంగా ఉండేలా ప్లాన్ చేసుకోండి. రోజూ పొద్దున్నే రాగి జావా తీసుకుంటే మంచిది. అలాగే కొన్ని పాలు తాగాలి. ఏదైనా ఒక పండును తీసుకోవాలి. ఉదయం టిఫిన్ లో భాగంగా ఇడ్లీ తీసుకుంటే మంచిది. ఇక లంచ్ లో

|

ప్రసవం తర్వాత చాలా మంది ఆడవారు లావు పెరిగిపోతుంటారు. అందుకు చాలా కారణాలుంటాయి. కొందరు గర్భధారణ జరిగాక పౌష్టికాహారం బాగా తీసుకుంటారు. దీంతో బరువు పెరిగే అవకాశం ఉంది.
డెలివరీ అయిన తర్వాత సరైన జాగ్రత్తలు పాటించకపోతే ఎంత స్లిమ్ గా ఉన్న అమ్మాయైనా సరే లావైపోవడం ఖాయం.

చాలా మంది ఆడవారు ప్రెగ్నెన్సీ తర్వాత ఆటోమేటిక్ గా వెయిట్ పెరిగిపోతారు. ఇక కాన్పు తర్వాత మరింత బరువు పెరుగుతారు.

డైట్ స్టార్ట్ చేయొద్దు

డైట్ స్టార్ట్ చేయొద్దు

అయితే బరువు పెరిగిపోయామని వెంటనే డైట్ స్టార్ట్ చేయకూడదు. పాపాయికి తల్లి తన పాలను ఇస్తున్న కాలంలో బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేయకూడదు. అలా చేస్తే బేబీకి పాలు తక్కువవుతాయి. అందువల్ల బిడ్డ కాస్త తినడం ప్రారంభించాక బరువు తగ్గేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాలి.

ఇలా ప్లాన్ చేసుకోండి

ఇలా ప్లాన్ చేసుకోండి

మీ డైట్ ఈ విధంగా ఉండేలా ప్లాన్ చేసుకోండి. రోజూ పొద్దున్నే రాగి జావా తీసుకుంటే మంచిది. అలాగే కొన్ని పాలు తాగాలి. ఏదైనా ఒక పండును తీసుకోవాలి. ఉదయం టిఫిన్ లో భాగంగా ఇడ్లీ తీసుకుంటే మంచిది.

ఇక లంచ్ లో వెజ్‌ సలాడ్‌తో పాటు కాస్త అన్నం తీసుకుంటే మంచిది.రాత్రి పుల్కాలు తింటే మంచిది. అలాగే తరుచూ మజ్జిగ తాగుతూ ఉండాలి.

నిమ్మరసం

నిమ్మరసం

బరువును తగ్గించడంలో నిమ్మ చాలా మేలు చేస్తుంది. నిమ్మరసంలో కాసింత తేనే కలుపుకుని తాగుతుంటే బరువు తగ్గే అవకాశం ఉంది. ఈ డైట్ ప్రసవం అయిపోయిన వెంటనే స్టార్ట్ చేయొచ్చు. రోజూ పొద్దున్నే తేనె కలిపిన నిమ్మరసం తీసుకుంటే చాలా మంచిది.

Most Read :కాలేయంలో కొవ్వు పెరిగిపోతే ఎలా, ఫ్యాటీ లివర్ తో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి, మద్యపానంతోనే ఎక్కువMost Read :కాలేయంలో కొవ్వు పెరిగిపోతే ఎలా, ఫ్యాటీ లివర్ తో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి, మద్యపానంతోనే ఎక్కువ

హాట్ వాటర్

హాట్ వాటర్

ప్రసవం తర్వాత ఆడవారు రోజూ హాట్ వాటర్ తాగుతుంటే బరువు తగ్గే అవకాశం ఉంది. అలాగని ఎక్కువ మోతాదులో తాగకూడదు. రోజుకు మూడు గ్లాస్ ల కంటే ఎక్కువ తాగడం మంచిది కాదు. వీలైతే కాస్త నిమ్మరసం కూడా అందులో కలుపుకోండి.

లవంగాలు

లవంగాలు

లవంగాలకు కూడా బరువును తగ్గించే గుణం ఉంది. కొంత నీటిలో లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేడి చేసుకోండి. ఆ నీటిని కాస్త చల్లారాక వడగట్టుకుని తాగుతూ ఉండండి. ఇలా నెల రోజుల పాటు చేస్తే ప్రసవం తర్వాత కడుపు దగ్గర పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది.

ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్

ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్

అలాగే ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలన్ని తక్కువగా తీసుకుంటే మంచిది. పాలు దాని సంబంధిత పదార్థాలతో పాటు గుడ్లు, మాంసాహారాన్ని చాలా తక్కువగా తీసుకోవాలి.

<strong>Most Read పరగడుపునే బీట్ రూట్ జ్యూస్ తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు</strong>Most Read పరగడుపునే బీట్ రూట్ జ్యూస్ తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు

English summary

quickest way to lose weight after having a baby

quickest way to lose weight after having a baby
Desktop Bottom Promotion