Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
రెండవ త్రైమాసికంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!
గర్భీణీలు 9 నెలలు బిడ్డను కడుపులో మోస్తారు. ఈ తొమ్మిిది నెలలను మెడికల్ పరిభాషలో మూడు త్రైమాసికాలుగా విభజించారు. ప్రతీ మూడు నెలలను ఓ త్రైమాసికంలా తీసుకున్నారు. 1 నుంచి 12 వారాల వరకు మొదటి త్రైమాసికం, 13 నుంచి 28 వారాల వరకు రెండవ త్రైమాసికం ఇక 29 నుంచి 40వ వారాల వరకు మూడవ త్రైమాసికం. ప్రతీ త్రైమాసికానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేరుగా ఉంటాయ్. వారాలు పెరిగి డెలివరీ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

రెండవ త్రైమాసికంలో గర్భిణీలకు ఉండే లక్షణాలు
పొత్తికడుపు, రొమ్ములు క్రమంగా పెరుగుతాయ్. కడుపులో శిశువుకు అవయవాలు కూడా ఎదగడం పూర్తిగా ప్రారంభమైన కారణంగా ఈ ఎదుగుదల కనిపిస్తుంది.
హార్మోన్లలో మార్పుల వల్ల మీ చర్మం రంగు కూడా మారుతుంది. ముఖం, కడుపు పై మచ్చలు ఏర్పడతాయ్. డెలివరీ తరువాత ఈ మచ్చలన్నీ వాటంతట అవే మాయమైపోతాయ్. ఎండలో ఉంటే చర్మ సమస్యలు మరింత పెరుగుతాయ్
మొదటి త్రైమాసికంలో ఉండే మార్నింగ్ సిక్‌నెస్ రెండవ త్రైమాసికంలో తగ్గిపోతుంది.
బిడ్డ పెరిగే కొద్దీ తల్లి బరువు కూడా పెరుగుతూ పోతుంది.
మొదటి త్రైమాసికంలో ఉన్నట్లు ఇక్కడ కూడా అలసగా ఫీల్ అవుతారు. ఎక్కువసేపు నిల్చోవడం కూడా సాధ్యం కాదు. స్పీడ్‌గా నడవకుండా నెమ్మదిగా నడవండి.
ఈ రెండవ త్రైమాసికంలో బేబీబంప్ రావడాన్ని గమనించవచ్చు. మొదటి త్రైమాసికంలో ఈ బేబీబంప్ అంతగా కనిపించదు. రెండవ త్రైమాసిక ప్రారంభ దశ నుంచే గుర్తించేట్లుుగా కనబడుతుంది.
పళ్ల చిగుళ్లు మరింత సున్నితంగా మారుతాయ్. చిగుళ్ల నుంచి కొంచెం రక్తం కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రెండవ త్రైమాసికంలో వాంతులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.కాళ్లు, కాళ్ల పిక్కలు నొప్పులుగా ఉంటాయ్. చేతులు కాళ్లకు తిమ్మిర్లు వస్తుంటాయ్.
వెన్నునొప్పి ఉంటుంది. కుర్చీలపైన కూడా ఎక్కువ సేపు కూర్చున్నా మీ వీపుపై ఒత్తిడిపడి వెన్నునొప్పి వస్తుంది. పక్కకు తిరిగి పడుకోవడం లేదా మోకాళ్ల కింద ఓ దిండును పెట్టి పడుకోవడం వల్ల గర్శధారణ సమయంలో వెన్ను నొప్పి తగ్గుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వైద్యులు సూచించిన మందుల వాడకాన్ని కొనసాగించాలి. ప్రతీరోజు కొన్ని ప్రీనాటల్ వ్యాయామాల చేసుకోవచ్చు.
కొవ్వు తక్కువగా ఉన్న ప్రొటీన్లు, పళ్లు, కూరగాయలు, ఫైబర ఉన్న ఆహారాన్ని తప్పుకుంటా ఎక్కువ మోతాదులో తీసుకోండి.
నీళ్లు కూడా తప్పనిసరిగా తాగాలి.
రోజుకు 300ల క్యాలరీలను ఖచ్ఛితంగా తినాలి.
చేయకూడని పనులు
విపరీతమైన శారీరక శ్రమకు, వ్యాయామానికి దూరంగా ఉండండి
మద్యాన్ని సేవించవద్దు
రోజుకు ఒక కప్పు కాఫీ, టీ కన్నా ఎక్కువ తీసుకోకూడదు
పొగత్రాగవద్దు, డ్రగ్స్ దగ్గరకు కూడా వెళ్లవద్దు



Click it and Unblock the Notifications