For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భణీలు రెగ్యులర్ గా నెయ్యి తింటే ఈ ప్రయోజనాలు పొందుతారు

గర్భధారణ సమయంలో నెయ్యి తినడం వల్ల పొందే ప్రయోజనాలు..

|

గర్భధారణ పొందండం మహిళకు ఒక వరం. కాబట్టి, ఈ గర్భాధారణ కాలంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. కొన్ని తినాల్సినవి, తినకూడని ఆహారాల పట్ల అవాగాహన కలిగి ఉండాలి. గర్బిణీలు తినాల్సినటువంటి ఆహారాల్లో నెయ్యి ఒకటి. దీన్ని తీసుకోవచ్చ లేదా అన్న సందేహం చాలా మంది గర్భిణీ స్త్రీలలో ఉంటుంది. అయితే నెయ్యి తినడం తల్లి బిడ్డకు సురక్షితం మని మన ఇంట్లో పెద్దలతో పాటు, పోషకాహార నిపుణులు కూడా సూచిస్తున్నారు. గర్భధారణ సమయంలో అనేక ఆరోగ్య సమస్యలను నివారించడానికి మరియు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంలో భాగంగా నెయ్యి సహాయపడుతుంది.

నెయ్యి ఆరోగ్యపరంగా సాధారణ వ్యక్తులలనోనే కాదు గర్భిణీ స్త్రీలకు కూడా చాలా సహాయపడుతుంది. కానీ గర్భధారణ సమయంలో స్త్రీ ఏ మోతాదులో తినాలన్న విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది తరచుగా ఆరోగ్య సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలను ఎలా అందిస్తుందో తెలుసుకోవాలి. ఇది తల్లి,బిడ్డకు ఎలా పనిచేస్తుందో మరియు ఆరోగ్య సంరక్షణ విషయంలో ఎటుంటి దుష్ప్రభావాలను కలిగిస్తుందో తెలుసుకోవాలి. ఆరోగ్య సంరక్షణ కోసం నెయ్యిని ఎలా ఉపయోగించాలి. గర్భధారణలో నెయ్యి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.

గర్భిణీలకు నెయ్యి సురక్షితమేనా?

గర్భిణీలకు నెయ్యి సురక్షితమేనా?

గర్భధారణ సమయంలో నెయ్యి తినవచ్చా అని చాలా మంది ఆనుమానిస్తుంటారు. ఇలాంటి సందేహాల వల్ల చాలా మంది నెయ్యి తినడం మానేస్తారు. కానీ తగినంత నెయ్యి తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు శరీరంలో జీవక్రియను పెంచుతుంది. కానీ మితంగా తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు. అంతేకాక, ఇది గర్బిణి ప్రసవం సులభతరం చేయడానికి సహాయపడుతుంది.ఇతర డైరీప్రొడక్ట్స్ కంటే నెయ్యి త్వరగా జీర్ణం అవుతుంది. మెటబాలిజం రేటు చురుకుగా ఉంటుంది.

ఎంత మోతాదులో నెయ్యి తినవచ్చు?

ఎంత మోతాదులో నెయ్యి తినవచ్చు?

గర్భిణీ స్త్రీలు నెయ్యి ఎంత వినియోగిస్తారనే దానిపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. రోజూ ఒకటి రెండు చెంచాల నెయ్యి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది క. ఇందులో మంచి కొవ్వులు ఉంటాయి. గర్భధారణ సమయంలో ఊబకాయం వల్ల తరచుగా ఆరోగ్యానికి ముప్పు ఉంటుంది. కానీ దాన్ని పరిష్కరించడానికి నెయ్యి తినవచ్చు. నూనె మరియు బట్టర్ తినడం కంటే నెయ్యి ఉత్తమం. క్రమబద్దమైన బరువును కలిగి ఉంటారు. మరి గర్భిణీకి నెయ్యి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందో పరిశీలిద్దాం.

జీర్ణ సమస్యలు

జీర్ణ సమస్యలు

గర్భధారణ సమయంలో మహిళలను బాధించే సమస్యలలో జీర్ణ సమస్యలు ఒకటి. జీర్ణ సమస్యల నివారణకు నెయ్యి వాడవచ్చు. పేగుల ఆరోగ్యంగా ఉండటానికి మరియు మంచి జీర్ణక్రియ కోసం నెయ్యి తినవచ్చు. ఏదైనా పెద్ద జీర్ణ సమస్యలను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. కాబట్టి మీరు గర్భధారణ సమయంలో నెయ్యిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు.

శిశువు పెరుగుదల కోసం

శిశువు పెరుగుదల కోసం

నెయ్యి శిశువు పెరుగుదలకు ప్రయోజనకరమైనది అనడంలో సందేహం లేదు. శిశువు యొక్క పెరుగుదల మరియు మెదడు ఆరోగ్యంగా ఉంచడానికి ఇది చాలా మంచిది. ప్రతిరోజూ అన్నంలో ఒక చెంచా నెయ్యి కలిపి తినడం వల్ల శిశువు పెరగడానికి సహాయపడుతుంది. మెదుడు ఆరోగ్య సంరక్షణకు నెయ్యి కూడా ఒక మంచి ఎంపిక.

ఒత్తిడిని తగ్గిస్తుంది

ఒత్తిడిని తగ్గిస్తుంది

గర్భధారణలో తరచుగా వచ్చే ఆటంకాలలో డిప్రెషన్ ఒకటి. హార్మోన్ల మార్పులు గర్భిణీలో మానసిక ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులను నయం చేయడానికి నెయ్యి తినవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు నిరాశ వంటి పరిస్థితుల నుండి మిమ్మల్ని ఉపశమనం చేస్తుంది.

సహజంగా ప్రసవం జరిగేట్లు చేస్తుంది

సహజంగా ప్రసవం జరిగేట్లు చేస్తుంది

దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ నెయ్యి సహజ ప్రసవంలో జరిగే ప్రమాదాలను నివారిస్తుంది. ఇది ప్రసవంలో నొప్పులని తగ్గిస్తుందని అంటారు. అందువల్ల, గర్భధారణ సమయంలో నెయ్యిని స్వీకరించవచ్చు.

దుష్ప్రభావాలు

దుష్ప్రభావాలు

దుష్ప్రభావాలు ఏమిటి? కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా తెలుసుకోవాలి. నెయ్యికి కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. కానీ ఈ విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. దుష్ప్రభావాలు ఏమిటో చూద్దాం.

ఊబకాయంతో బిడ్డ పుడుతుంది

ఊబకాయంతో బిడ్డ పుడుతుంది

మీరు ఇప్పటికే అధిక బరువును కలిగి ఉంటే, దానికి జంక్ ఫుడ్ మరియు నెయ్యి వంటివి తినడం గర్భిణికి ప్రమాధకరం. అలాంటి వారు కొంచెం శ్రద్ద తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది తరచుగా శిశువులో ఊబకాయ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇంకా ఇది ప్రసవంను కష్టతరం చేస్తుంది. అందువల్ల, ఈ సమస్యను తొలగించడానికి మీరు తీసుకునే నెయ్యి పరిమాణంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. శిశువు యొక్క పరిమాణం పెరిగితే, అది తరచుగా డెలివరీని కష్టతరం చేస్తుంది.

బరువు తగ్గడంలో సమస్య

బరువు తగ్గడంలో సమస్య

బరువు తగ్గడానికి చాలా మంది ప్రసవ తర్వాత కష్టపడతారు. కానీ దాని ప్రధాన కారణం తరచుగా మీరు గర్భధారణ సమయంలో తినే ఆహారాలలో ఒకటి. నెయ్యి తినేవారు తరచుగా ప్రసవ తర్వాత నెయ్యిని తినడం మానేయడం మంచిది. కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. నెయ్యి యొక్క ముఖ్యమైన దుష్ప్రభావాలలో ఇది ఒకటి.

English summary

Is it safe to eat Ghee during pregnancy

we have listed some of the health benefits and side effects of ghee during pregnancy. Read on.
Story first published:Saturday, September 14, 2019, 17:03 [IST]
Desktop Bottom Promotion