For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అబార్షన్ జరగడానికి ముందు సంకేతాలు, లక్షణాలు, చికిత్స మరియు ఎలా నివారించాలి?

|

గర్భస్రావం అనేది గర్భం పొందిన మొదటి 20 వారాలలో ఆకస్మిక గర్భస్రావాన్ని సూచించడానికి ఉపయోగించే పదం. ఈ రకమైన గర్భస్రావం చాలా మంది మహిళలకు అసౌకర్యాన్ని కలిగిస్తుందని వైద్య నిపులు హెచ్చరిస్తున్నారు. కొన్ని పరిశోధల ద్వారా వెల్లడించిన రికార్డు మొత్తంలో పిండం ఉత్పత్తి అయిన 20 వారాల్లో గర్భస్రావం ఎలా జరుగుతుంది మరియు ఆ సమయంలో మహిళల శారీరక మరియు మానసిక స్థితి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకుందాం.

అమెరికన్ కాలేజ్ ఆఫ్ గైనకాలజిస్ట్స్ (ACOG) ప్రకారం, గర్భస్రావం అనేది గర్భధారణ నష్టానికి సూచిక. వైద్యపరమైన నివేధికలో 10-25% గర్భస్రావాలు సహజంగానే జరిగాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

రసాయనాలు 50-75% గర్భస్రావాలకు కారణమవుతున్నాయి. పిండం ఏర్పడిన వెంటనే రసాయనిక పదార్థాలకు గురైనప్పుడు ఇటువంటి గర్భధారణ నష్టం జరుగుతుంది. రుతుస్రావం కావడానికి కొద్దిసేపటి ముందు రక్తస్రావం సంకేతాలు కూడా కనబడుతాయి. రసాయన గర్భధారణలో ఒక స్త్రీ గర్భవతి అని తెలుసుకునే ముందు పిండం కోల్పోతుంది.

గర్భందాల్చడం ప్రతి మహిళకు చాలా సంతోషకరమైన క్షణం. కానీ ఈ రోజుల్లో పెద్ద సంఖ్యలో గర్భస్రావాలు ఎదుర్కొంటున్నారు. గర్భం దాల్చిన మొదటి 13 వారాలలో చాలా గర్భస్రావాలు జరుగుతాయి. మరియు గర్భస్రావాలతో వచ్చే దురదృష్టకర క్షణాలు గురించి , ఈ విషాద సంఘటన గురించి మరింత తెలుసుకోవడానికి ఈ వ్యాసం మీకు సహాయపడుతుంది..

గర్భస్రావం గురించి వాస్తవాలు

గర్భస్రావం గురించి వాస్తవాలు

గర్భస్రావం జరిగినప్పుడు మనస్సులో అనేక గందరగోళ క్షణాలు మరియు ఒత్తిడి ఉండవచ్చు. వాస్తవానికి గర్భస్రావాలు వివిధ రకాలుగా ఉన్నాయి, ప్రతిదానికి వేర్వేరు కారణాలు, చికిత్సలు ఉన్నాయి మరియు ప్రతి గర్భస్రావం అనుభవంను బట్టి వేర్వేరు గణాంకాలు ఉన్నాయి.

కింది సమాచారం గర్భస్రావ జరగడానికి గల ప్రధాన కారకాల గురించి తెలియజేస్తుంది. గర్భస్రావం జరిగిన పరిస్థితులు, విషాద క్షణాల నుండి మీరు బయటపడటానికి ప్రయత్నిస్తుంటే ఈ ఆర్టికల్ మీకు తప్పనిసరిగా సహాయ పడుతుంది. ఈ వ్యాసం ద్వారా మీ గర్భస్రావం జరిగిన తర్వాత మిమ్మల్ని తిరిగి మామూలు స్థితికి వచ్చేలా చేస్తుంది. వీటితో పాటు మీరు గర్భధారణ, గర్భస్రావ సమస్యలను గురించి మరింత తెలుసుకోవడానికి మీ డాక్టర్ ను తప్పనిసరిగా సంప్రదిస్తే మంచిది.

గర్భస్రావం ఎందుకు జరుగుతుంది?

గర్భస్రావం ఎందుకు జరుగుతుంది?

గర్భస్రావం కావడానికి చాలా కారణాలు ఉన్నాయి, అయితే వీటికి ప్రధాన కారణమంటూ తరచుగా తెలియదు. కానీ గర్భం పొందిన మొదటి త్రైమాసికంలో గర్భస్రావం జరగడానికి అత్యంత సాధారణ కారణం శిశువు క్రోమోజోమ్ వంటి అసాధారణతలు. గర్భాశయంలో అండాలు దెబ్బతినడం లేదా స్పెర్మ్ నాణ్యత, స్పెర్మ్ కౌంట్, మోటిలిటీ వంటి కారకాలు ముఖ్య కారణం అవ్వొచ్చు లేదా ఫలదీకరణ జరగే ప్రక్రియలో సమస్య ఏర్పడవచ్చు.

మరికొన్ని కారణాలు

మహిళల్లో హార్మోన్ సమస్యలు, తల్లి ఆరోగ్యం లేదా ఇన్ఫెక్షన్స్ ప్రభావం కావచ్చు.

. బయోలాజికల్ మోడ్ (అనగా, ధూమపానం, మాదకద్రవ్యాలు వాడకం, పోషకాహార లోపం, కెఫిన్ అధికంగా తీసుకోవడం, రేడియేషన్ లేదా శరీరంలో టాక్సిన్స్)

. గర్భాశయం సరిగ్గా లేనప్పుడు

. తల్లి వయస్సు

. తల్లికి గాయం

గర్భస్రావానికి నిరూపితమైన కారణాలు సెక్స్, ఇంటి వెలుపల పని (హానికరమైన వాతావరణంలో పనిచేయడం) లేదా ఎక్కువ వ్యాయామం.

గర్భధారణ వయస్సు

గర్భధారణ వయస్సు

ముఖ్యం గర్భధారణ వయస్సు సరిగ్గా ఉంటే వారిలో 10-25% గర్భధారణ జరగవచ్చు. గర్భధారణ వయస్సు దాటితే అలాంటి వారిలో15-20% గర్భం పొందే అవకాశం ఉంటుంది.

. తల్లి వయసు పెరిగే కొద్దీ గర్భస్రావం జరిగే ప్రమాదం పెరుగుతుంది.

. 35 ఏళ్లలోపు మహిళలు మాతృత్వానికి చేరుకున్నప్పుడు గర్భస్రావం అయ్యే అవకాశం 15% ఉంటుంది.

. 35-45 సంవత్సరాల వయస్సు గల మహిళలకు గర్భస్రావం జరిగే అవకాశం 20-35% ఉంటుంది.

. 45 ఏళ్లు పైబడిన మహిళలను పరిగణించినప్పుడు, గర్భస్రావం అయ్యే అవకాశం 50% ఉంటుంది.

. గర్భస్రావం జరిగిన స్త్రీకి తదుపరిసారి గర్భస్రావం అయ్యే అవకాశం 25% ఉంది.

గర్భస్రావం హెచ్చరిక సంకేతాలు

గర్భస్రావం హెచ్చరిక సంకేతాలు

మీరు ఈ క్రింది సంకేతాలు లేదా లక్షణాలను గుర్తిస్తే వెంటనే మీ వైద్యుడి వద్దకు వెళ్లి చెక్ చేయించుకోవడం మంచిది.

. తీవ్రమైన వెన్నునొప్పి. (సాధారణంగా పీరియడ్స్ లో వచ్చే వెన్నునొప్పి కంటే మరింత అధ్వాన్నంగా ఉంటుంది)

. బరువు తగ్గడం

. తెలుపు - గులాబీ రంగులో గల్ల రావడం

. నొప్పితో లేదా లేకుండా బ్రౌన్ లేదా ఎర్రటి రక్త స్రావం (గర్భం పొందిన మహిళలందరూ 20-30% గర్భం ప్రారంభ రోజులలో రక్తస్రావం అనుభవించవచ్చు, సుమారు 50% మంది సాధారణ గర్భం అనుభవిస్తున్నారు)

. కణజాలం జననేంద్రియాల ద్వారా స్తంభింపజేస్తుంది

. గర్భం యొక్క సంకేతాలు బాగా తగ్గుతాయి

గర్భస్రావం వివిధ రకాలు

గర్భస్రావం వివిధ రకాలు

గర్భస్రావానికి కారణం ఒకటి కాదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మరియు గర్భస్రావం రకాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన పిల్లల అభివృద్ధి గురించి తెలుసుకోవడానికి చాలా సమాచారం ఉంది. ఇది తెలుసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో మీకు ఏమి జరుగుతుందో బాగా అర్థం చేసుకోవచ్చు.పొట్టలో పిండం ప్రారంభ అభివృద్ధిని మరియు మొదటి త్రైమాసికంలో పిండం అభివృద్ధిని అర్థం చేసుకోవడం ద్వారా, మీ వైద్య నిపుణులు గర్భస్రావం అయ్యే అవకాశాన్ని చెప్పడానికి గల కారణాలను మీరు స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. గర్భస్రావాన్ని వివిధ రకాలుగా పిలుస్తారు. అయితే వైద్యులు వాటిని ఈ క్రింది విధంగా తెలుపుతారు..

గర్భస్రావం రకాలు

. భయపెట్టే గర్భస్రావం

అకాల గర్భంలో రక్తస్రావం మరియు తక్కువ వెన్నునొప్పి. గర్భాశయం కప్పబడి ఉంటుంది. పిండం విచ్ఛిన్నం అవ్వడం వల్ల రక్తస్రావం జరుగుతుంది.

. అవాంచిత లేదా అసంపూర్ణ గర్భస్రావం:

కడుపు లేదా వెన్నునొప్పితో గర్భాశయ తెరుచుకోవడం. గర్భాశయం సాగదీసినప్పుడు లేదా దాని పొరలు విరిగినప్పుడు గర్భస్రావం జరుగుతుంది. గర్భస్రావం అసంపూర్ణంగా ఉన్నప్పుడు కడుపు తిమ్మెర్లు మరియు నొప్పి ఉటుంది

. గర్భస్రావం జరిగిందని గుర్తించలేరు

. గర్భస్రావం జరిగిందని గుర్తించలేరు

గర్భం పొందిన తర్వాత కొంత మంది స్త్రీలు గర్భస్రావం జరిగిందని గ్రహించలేరు. విఫలమైన గర్భస్రావం పిండం రూపంలో బయటకు రావడానికి కారణమవుతుంది. ఇది ఎప్పుడు సంభవించిందో తెలియదు. గర్భధారణ లక్షణాలు కనబడకపోయినప్పుడు లేదా అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా పిండం స్థితిగతులను తెలుసుకునేటప్పుడుడు మాత్రమే దీన్ని కనుక్కోవచ్చు.

. పునరావృత గర్భస్రావం

ఇందులో 3 లేదా అంతకంటే ఎక్కువ మొదటి త్రైమాసిక గర్భస్రావాలు జరిగి ఉంటాయి. గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్న 1% జంటలను ఇది ప్రభావితం చేస్తుంది.

. అనెంబ్రియోనిక్ గర్భం

పిండం గర్భాశయంలోకి ప్రవేశించినప్పటికీ అభివృద్ధి చెందడం ప్రారంభించని స్థానం ఇది. పిండం పెరుగుదల లేకపోవడం.

. అవకలన సంతానోత్పత్తి

ఫలదీకరణ చెందిన అండం అండాశయ కుహరంలోకి ప్రవేశించినప్పుడు, ముఖ్యంగా అండం మరెక్కడైనా అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ లో చేరినప్పడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. పిండం అభివృద్ధి చెందకుండా వెంటనే చికిత్స చేయాలి. లేదంటే తల్లికి ప్రమాదం జరగవచ్చు.

. త్రైమాసిక గర్భస్రావాలు

ఇందులో 3 లేదా అంతకంటే ఎక్కువ మొదటి త్రైమాసిక గర్భస్రావాలు ఉన్నాయి. గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్న 1% జంటలను ఇది ప్రభావితం చేస్తుంది.

. జన్యులోపంతో

జన్యు లోపం ఫలితంగా ఫలదీకరణ ప్రక్రియలో పిండ అండాశయంలో ఉత్పత్తి జరగడం చాలా అరుదు, ఇది అసాధారణ కణజాల పెరుగుదలకు దారితీస్తుంది. కానీ గర్భధారణకు సాధారణ లక్షణాలు ఉన్నాయి, రుతుస్రావం జరగడం మరియు విపరీతమైన వికారం.

గర్భస్రావం జరగకుండా చికిత్స

గర్భస్రావం జరగకుండా చికిత్స

గర్భస్రావం సమయంలో లేదా తరువాత చికిత్స ప్రధాన లక్ష్యం. ఇది రక్తస్రావాన్ని నివారించడం మరియు సంక్రమణను నివారించడానికి సహాయపడుతుంది. గర్భస్రావం జరిగిన తర్వాత కాలం, మీ శరీరం పిండ కణజాలాన్ని స్వయంచాలకంగా బహిష్కరిస్తుంది, దీనికి ఎటువంటి వైద్య విధానం అవసరం లేదు. మీ శరీరం ఆ కణజాలాలను బహిష్కరించకపోతే రక్తస్రావం ఆపడానికి చాలా సాధారణ మార్గం ఉంది ఈ రకమైన శస్త్రచికిత్స జరిగిన తర్వాత రక్తస్రావం జరగకుండా ఆపడానికి మందులు సూచించబడతాయి. ఇంట్లో విశ్రాంతి తీసుకునేటప్పుడు రక్తస్రావం స్థితిని గమనించాలి. పెరిగిన రక్తస్రావం లేదా జలుబు మరియు ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

గర్భస్రావం ఎలా నివారించాలి

గర్భస్రావం ఎలా నివారించాలి

చాలా గర్భస్రావాలు క్రోమోజోమ్ ప్రభావం వల్ల సంభవిస్తాయి మరియు వాటిని నివారించడానికి మార్గం ఉండదు. సంతానోత్పత్తి ప్రభావవంతంగా ఉన్నంత వరకు ఫలదీకరణం జరగడానికి ముందు శరీరాన్ని ఆరోగ్యంగా, గర్భాధారణకు ప్రతికూలంగా మార్చుకోవాలి. ఇది అనుకూలమైన ఆరోగ్య వాతావరణాన్ని కల్పిస్తుంది. గర్భస్రావం కూడా నివారించబడుతుంది. అందుకు మీరు..

. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి

. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి

. ఒత్తిడి లేకుండా జీవించాలి

. ఆరోగ్య పరిమితుల్లో శరీర బరువును నిర్వహించాలి

. రోజూ ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి

. ధూమపానం చేయకపోవడం మంచిది

జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు

జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు

మీ గర్భం పొందారని నిర్థారించుకున్న తర్వాత, మీ లక్ష్యం మళ్లీ ఆరోగ్యంగా ఉండటమే. మీ బిడ్డ ఎదగడానికి సరైన వాతావరణాన్ని సృష్టించండి.

. మీ పొట్టను సురక్షితంగా ఉంచండి.

. ధూమపానం మానేయండి. అలాగే మీరు ధూమపానం చేసే ప్రదేశాలలో ఉండకపోవడం మంచిది.

. మద్యం తాగవద్దు.

. ఎక్కువ మందులు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

. కెఫిన్ తీసుకోవడం మానేయండి లేదా మీ మోతాదును తగ్గించండి.

. రేడియేషన్, ఇన్ఫెక్షన్ మరియు ఎక్స్-రే కిరణాల నుండి దూరంగా ఉండండి.

. క్రీడలు మరియు గాయాలు ఏర్పడుటకు అవకాశం ఉన్న కార్యకలాపాలకు దూరంగా ఉండండి.

గర్భస్రావం యొక్క భావోద్వేగ చికిత్స

గర్భస్రావం యొక్క భావోద్వేగ చికిత్స

దురదృష్టవశాత్తు, గర్భస్రావం ఎవరినైనా ప్రభావితం చేస్తుంది. గర్భస్రావం వల్ల మానసిక సమతుల్యత ఏర్పడుతుంది. తిరిగి గర్భం దాల్చిన తర్వాత స్త్రీ తన ఆరోగ్యం గురించి చాలా ప్రశ్నలు అడగవచ్చు. అమ్మాయి తన కుటుంబం, స్నేహితులు మరియు వైద్యులతో ఓపెన్ గా మాట్లాడాలి. అప్పుడే ఈ పరిస్థితి నుండి సులభంగా బయటపడవచ్చు.

English summary

Miscarriage: Signs, Symptoms, Treatment, And Prevention

Miscarriage is a term used for a pregnancy that ends on its own, within the first 20 weeks of gestation. The medical terms used to identify this potential complication or loss gives most women an uncomfortable feeling, so throughout this article, we will refer to this type of threatened complication or pregnancy loss under 20 weeks as a miscarriage.
Story first published: Thursday, November 7, 2019, 17:54 [IST]
Desktop Bottom Promotion