For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Anushka Sharma Shirshasana : ప్రెగ్నెన్సీలో ఉండే వారికి ‘శీర్షాసనం’వల్ల ఎలాంటి ప్రయోజనాలంటే...

ప్రెగ్నెన్సీ సమయంలో యోగాలో ఆ భంగిమను ప్రయత్నించొచ్చా...

|

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ భార్య అనుష్కశర్మ ఇప్పుడు నిండుగర్భిణిగా ఉన్నారు. అయితే ఇలా గర్భంతో ఉండే సమయంలో అందరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అయితే అనుష్కశర్మ మాత్రం తాను ప్రెగ్నెన్సీ టైములో కూడా ఎంతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Shirshasana during pregnancy? benefits of the headstand yoga pose

అంతేకాదు తను ప్రెగ్నెన్సీకి ముందు ఎలాంటి ఆసనాలు అయితే వేసేదో.. ఇప్పడు గర్భంతో ఉన్నప్పటికీ అలాంటి ఆసనాలను అవలీలగా వేసేస్తోంది. ఇలాంటి క్లిష్టమైన ఆసనాలను వేస్తూ గర్భిణులందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

Shirshasana during pregnancy? benefits of the headstand yoga pose

మన సమాజంలో ఎవరైనా గర్భం దాల్చితే.. అసలు బరువులు మోయద్దు.. ఆ పని చేయొద్దు.. ఈ పని చేయొద్దు.. అసలు కాలు కూడా కింద పెట్టొద్దు.. మీకేమీ కావాలన్నా అన్ని మేమే చేస్తామంటుంటారు. కొన్ని నెలల పాటు బెడ్ రెస్ట్ ఇస్తుంటారు. కానీ అనుష్కశర్మ మాత్రం నిండు గర్భిణిగా ఉన్నప్పటికీ కఠినమైన ఆసనాలను వేసి చూపించి.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Shirshasana during pregnancy? benefits of the headstand yoga pose

అనుష్క వేసిన 'శీర్షాసనం' ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాదు దీనికి కోహ్లీ కూడా సహాయం చేస్తున్నాడు. ఈ సందర్భంగా గర్భంతో ఉన్న మహిళలు ఇలాంటి ఆసనాలు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి.. అసలు ఈ సమయంలో అలాంటి ఆసనాలు వేయొచ్చా లేదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

గర్భిణుల ‘శీర్షాసనం’..

గర్భిణుల ‘శీర్షాసనం’..

గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో హార్మోన్ల మార్పులు చాలా వేగంగా జరుగుతాయి. ఇది వారి మానసిక స్థితిని మళ్లీ మళ్లీ స్వింగ్ చేస్తుంది. కొన్నిసార్లు వారు విచారంగా ఉంటారు. మరి కొన్నిసార్లు అసౌకర్యంగా ఉంటూ బాధపడతారు. అందుకే హార్మోన్లలో హెచ్చుతగ్గులను బ్యాలెన్స్ చేసేందుకు మూడ్ స్వింగ్లను ‘శీర్షాసనం' ద్వారా నియంత్రించొచ్చు.

శీర్షాసనం యొక్క ప్రయోజనాలు..

శీర్షాసనం యొక్క ప్రయోజనాలు..

* అనాఫిలాక్సిస్ రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుంది.

* పిట్యూటరీ మరియు పీనియల్ గ్రంథుల స్రావాన్ని నియంత్రిస్తుంది. జ్ణాపకశక్తి, ఏకాగ్రత, ఉత్సాహం, నిర్భయత, విశ్వాసం మరియు సహనాన్ని పెంచుతుంది.

* చాలా కాలం పాటు యవ్వనంగా ఉంటారు. అంతేకాదు, ఈ ఆసనం వేయడం ద్వారా చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది. ముఖంలో ముడతలు అనేవే లేకుండా మాయమవుతాయి.

ఇలా శీర్షాసనం వేయండి..

ఇలా శీర్షాసనం వేయండి..

శీర్షాసనం భంగిమ చేయడానికి ముందుగా ఖాళీ కడుపు, దుప్పటి లేదా కార్పెట్ ఒక ప్లాట్ స్పాట్ మీద వేయండి. వజ్రాసనంలో కూర్చున్నప్పుడు, చేతుల వేళ్లను కలిపి పట్టుకోండి. మీ చేతులను తలపై ఉంచండి. ఆ తర్వాత ముందుకు బెండ్ అయి, నుదిటిని నేలపై ఉంచండి. రెండు చేతుల మోచేతులను నేలపై ఉంచండి. చేతుల వేళ్లను కలిపి ఉంచండి. శ్వాస వేగాన్ని సాధారణంగా ఉంచండి. చేతులకు ప్రాధాన్యత ఇవ్వడం, శరీర బరువును తలపైకి తీసుకురావడం చేయాలి. అనంతరం పిరుదులను పైకి ఎత్తాలి. అప్పుడు నెమ్మదిగా కాళ్లను పైకి చేయాలి. అప్పుడు శరీరం యొక్క బరువు మొత్తం తలపై పడుతుంది. శరీరాన్ని పైకి నిఠారుగా చేయాలి. ఇక్కడ కాళ్లు, నడుము మరియు తల బ్యాలెన్స్ గా ఉండాలి. ప్రారంభంలో గోడ యొక్క సహాయంతో లేదా మరొకరి సహాయంతో దీనిని ప్రాక్టీస్ చేయండి.

English summary

'Shirshasana' during pregnancy? benefits of the headstand yoga pose

Shirshasana (headstand) increases blood supply to the head, therefore is beneficial for brain function and all sensory organs in the head.
Desktop Bottom Promotion