For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు గర్భం దాల్చినట్లు తెలిపే కొన్ని విచిత్ర లక్షణాలు..

|

ఈ సృష్టిలో ఒక జీవి నుండి మరో జీవికి ఊపిరి పోయడం ఒక అద్భుతం. ఈ ప్రపంచంలో అందరికీ ఇలాంటి అదృష్టం దక్కదు. కేవలం కొంతమందిని మాత్రమే ఆ అదృష్టం వరిస్తుంది. మహిళలు మాత్రమే గర్భం దాల్చి ఓ నిండు ప్రాణాన్ని భూ ప్రపంచంలోకి తీసుకొస్తారు. అయితే కొందరు మహిళలకు ఈ అదృష్టం దక్కకపోవచ్చు. కొన్ని అనివార్య కారణాల వల్ల వారు గర్భం దాల్చలేరు. ఆరోగ్య సమస్యలు లేదా సరైన అవగాహన లేకపోవడం మరే ఇతర కారణాల వల్ల వారికి అటువంటి అవకాశం రాకుండా పోతుంది.

pregnancy symptoms

ఇక విషయానికొస్తే చాలా మంది స్త్రీలకు వారు గర్భం దాల్చిన విషయం కొన్ని వారాలు గడిస్తే కానీ వారికి తెలియకపోవడం. మరో ట్విస్ట్ ఏంటంటే నెలలు నిండే వరకు గర్భం దాల్చిన విషయానికి సంబంధించి సూచనలు స్పష్టంగా లేకపోవడం వంటి కారణాలు మనకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి వారి కోసం ఈ స్టోరీలో మాకు తెలిసిన కొన్ని చిట్కాలను మీకు తెలియజేస్తున్నాం. వాటిని గమనిస్తే మీరు గర్భం దాల్చారో లేదో ఇట్టే అర్థమవుతుంది. సో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమున్న వారు ఈ అంశాలను అస్సలు మిస్సవ్వొద్దు.

విపరీతంగా ఆహారం తీసుకోవాలనిపించటం లేదా ఆహారంపై విముఖత..

విపరీతంగా ఆహారం తీసుకోవాలనిపించటం లేదా ఆహారంపై విముఖత..

ఇంతవరకు మీకు నచ్చని ఆహారంపై అకస్మాత్తుగా అమాంతం ఇష్టం పెరిగిపోతుంది. ఇంకోవైపు మీరు ఎప్పుడూ ఇష్టపడే ఆహారంపై అంతే విముఖత ఏర్పడుతుంది. ఇవన్నీ గర్భం దాల్చే వారి లక్షణాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇది కేవలం ఒక్క రుచులకు పరిమితం కాదని మీరు గమనించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు గర్భం వచ్చిన మహిళలు కొన్ని రకాల వాసనలపై కూడా తీవ్ర విముఖత చూపుతారు. ఇంకొన్ని రకాల ఆహార వాసనలు వారిని బాగా ఆకర్షిస్తాయి.

వికారంగా ఉండటం..

వికారంగా ఉండటం..

ఈ వికారం లక్షణాలు ఒక్కో మహిళలకు ఒక్కొక్క విధంగా ఉండే అవకాశాలున్నాయి. ఈ వికారమనేది సమయంతో సంబంధం లేకుండా మిమ్మల్ని ఎప్పుడైనా తీవ్ర అసౌకర్యానికి గురి చేయవచ్చు. గర్భం దాల్చినపుడు ఉదయాన్నే జ్వరంగా ఉంటే ఇలా వికారంగా అనిపిస్తుంది. మీకు ఎలాంటి స్టమక్ ఇన్ఫెక్షన్ లేకపోయినా వికారంతో బాధపడుతున్నట్టయితే, మీరు దాల్చి ఉంటే అటువంటి సమయంలో ఇలాంటి అనుభవం ఎదురై ఉండొచ్చు.

శ్వాస సరిగా అందకపోవటం..

శ్వాస సరిగా అందకపోవటం..

మీరు గర్భం దాల్చిన సమయంలో ఉన్నట్టుండి శ్వాస సరిగా అందనట్టు అనిపిస్తే గర్భం దాల్చడం వల్లేనని ఇలా జరిగి ఉండొచ్చు. సరిగ్గా అదే సమయంలోనే మీలో పెరుగుతున్న మరో బిడ్డకు కూడా ఆక్సీజన్ అవసరం పడుతుంది. అందువలన మీకు శ్వాస అనేది సరిగ్గా అందకపోవచ్చు. ఇంకా కొన్ని సమయాల్లో కూడా ఇలా అనిపిస్తుంది. మెట్లు ఎక్కుతున్నప్పుడు, బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, హడావుడిగా ఏవైనా పనులు చేస్తున్నప్పుడు కూడా మీకు ఇలా అనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

స్టామినా తగ్గిపోవడం..

స్టామినా తగ్గిపోవడం..

తరచూ అలసిపోయి స్టామినా తగ్గినట్టు మీకు అనిపించి, దాంతో పాటు ఏ పని చేయలేని నిస్సహాయ స్థితిలో మీరు ఉన్న కూడా ఇవన్నీ గర్భం దాల్చిన లక్షణాల కిందకే వస్తాయి. మీరు ఇప్పటివరకు ఎంతో ఇష్టం చేసిన పనులు కూడా చేసేందుకు మీ శక్తి సరిపోకపోవటం ఈ లక్షణం కిందకే వస్తుంది. మీ అలవాట్లను కూడా మీరు ఎంజాయ్ చేయలేకపోతే వెంటనే హోమ్ ప్రెగ్నెన్సీ టెస్టును చేయించుకోవాలి. ఇవన్నీ గర్భం దాల్చిన లక్షణాలే కింద వస్తాయి.

రొమ్ముల్లో నొప్పులతో ఇబ్బంది..

రొమ్ముల్లో నొప్పులతో ఇబ్బంది..

మీరు గర్భం దాల్చిన సమయంలో మీ రొమ్ముల్లో నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు సాధారణ బ్రా లను పక్కన పెట్టి సపోర్టివ్ బ్రాలను ఎంచుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మీ బ్రెస్ట్ లో హెవీనెస్ ని ఫీల్ అయి మీ బ్రాలు సడెన్ టైట్ గా మారిపోవడం.. కొన్నొసార్లు బ్రా ని తీసేయాలన్నంత నొప్పి..నిపిల్స్ కూడా పెద్దవిగా మారి వారి ఆకారంలో కూడా మార్పులు, తేడాలు రావడం వంటివి కూడా గర్భం దాల్చిన లక్షణాలే.

పిరియడ్స్ మిస్ అవ్వడం..

పిరియడ్స్ మిస్ అవ్వడం..

మీరు గర్భం దాల్చడం వల్ల కూడా నెల తప్పే అవకాశాలున్నాయి. కొన్నిసార్లు పిరియడ్స్ మిస్ అవటం చాలా సాధారణ విషయం. అయితే ఇది ప్రెగ్నెన్సీ వల్ల కూడా జరగవచ్చు. కానీ, ఇలాంటి విషయాలను లైట్ గా తీసుకోకండి. ప్రెగ్నెన్సీకి సంబంధించిన ముఖ్య లక్షణాల్లో నెల తప్పడం వంటిదే ప్రధానం కాబట్టి.. ఒకవేళ నెలసరి తప్పినట్టయితే వెంటనే ప్రెగ్నెన్సీ టెస్టును చేయించుకోండి.

తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం..

తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం..

గర్భం దాల్చినప్పుడు మహిళల శరీరం అనేక రకాల ద్రవాలను ఉత్పత్తి చేస్తుంది. అది బ్లాడర్ అనేది ఓవర్ టైమ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అందువలన తరచూ మీరు మూత్రం కోసం రెస్ట్ రూమ్ వైపు పరుగులు పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి లక్షణాలను ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకండి. ఇది కూడా గర్భం దాల్చడానికి సంబంధించిన ముఖ్య లక్షణం. గర్భిణులలో ఈ లక్షణాన్ని ఎక్కువగా గుర్తించవచ్చు. ఇలాంటి వాటిని మీరు ముఖ్య సూచనగా గమనించే ముందు మీరు ఎక్కువగా నీళ్లు తీసుకోవడం వలన తరచూ మూత్రానికి వెళ్లవలసి రావటం లేదన్న విషయాన్ని కూడా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.

నెలసరిని మించిన నొప్పులు..

నెలసరిని మించిన నొప్పులు..

రీ ప్రొడక్టివ్ వయసులో ఉన్న చాలా మంది మహిళలకు నెలసరి నొప్పుల గురించి బాగా పరిచయం ఉంటుంది. అయితే, క్రామ్పింగ్ అనేది దీర్ఘకాలం వస్తూ ఉంటే మీరు కచ్చితంగా ఈ లక్షణంపై దృష్టి సారించాలి. గర్భిణులలో ఈ లక్షణం చాలా సహజం. సో అలాంటి సమయంలో మీరు గర్భం దాల్చారో లేదో టెస్టు చేయించుకుని తెలుసుకోవడం ఉత్తమం.

ఉన్నట్టుండి మూడీగా మారిపోవడం..

ఉన్నట్టుండి మూడీగా మారిపోవడం..

మీ బంధువులు, మీ స్నేహితులు లేదా ఇతరులు ఎవరైనా మీరు అనవసరంగా కోపతాపాలను ప్రదర్శిస్తుంటే అది కూడా ప్రెగ్నెంట్ అవ్వడం వల్లే అని భావించవచ్చు. మీరు ఇంతకుముందు కంటే మూడీగా మారిపోవడానికి ప్రెగ్నెన్సీ వల్ల హార్మోన్లలో మార్పులు సంభవించడమే కారణం. మీకు అనవసర విషయాలపై కూడా చికాకు ఏర్పడుతుంది. అయితే, ఈ విషయం గురించి చింతించాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కువ ఒత్తిడిని తీసుకోకుండా ప్రశాంతంగా ఉంటే చాలు.

English summary

Top different pregnancy symptoms

If you feel that you are not breathing properly as you were during your pregnancy, you may not be able to conceive. At the same time, another child growing inside of you also needs oxygen. Therefore, you may not be able to breathe properly. And sometimes it feels like that too. You are more likely to feel this way when climbing the stairs, traveling on the bus, or doing any rush.
Story first published: Saturday, August 17, 2019, 14:33 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more