Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Republic Day 2025: రిపబ్లిక్ డే రోజు మీ పిల్లల చేత ఈ స్పీచ్ చెప్పించండి.. కచ్చితంగా వారే విన్నర్!
మరికొన్ని గంటల్లో గణతంత్ర దినోత్సవం వచ్చేస్తుంది. ఈ గణతంత్ర దినోత్సవం నాడు చాలా స్కూళ్లలో పిల్లలకు స్పీచ్ కాంపిటీషన్స్ నిర్వహిస్తుంటారు. ఇందులో పాల్గొనాలంటే చాలా మందికి భయం ఉంటుంది. కానీ పాల్గొనే వారు సరైన స్పీచ్ ఇవ్వలేకపోతారు. అందుకే మీ పిల్లలకు ఈ గణతంత్ర దినోత్సవం నాడు ఈ స్పీచ్ చెప్పమని చెప్పండి. కచ్చితంగా వారికే మొదటి బహుమతి లభిస్తుంది. బహుమతి లేకపోయినా స్కూల్‌లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆ స్పీచ్ ఏంటంటే?
స్కూల్ పిల్లల కోసం గణతంత్ర దినోత్సవం స్పీచ్
అందరికీ శుభోదయం!. ఈ రోజు మనం జరుపుకుంటున్న గణతంత్ర దినోత్సవం అందరికీ ఎంతో ప్రత్యేకమైన రోజు. ఈ రోజు మన దేశానికి స్వయంగా రాజ్యాంగం వచ్చిన రోజు. మన దేశానికి రాజ్యాంగం వచ్చిన సందర్భంగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

మన దేశంలో ఎన్నో రకాల భాషలు, సంస్కృతులు, ఆహారాలు ఉన్నాయి. అయినా మనందరం ఒకే కుటుంబం లాగా కలిసి ఉంటాం. మన దేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉన్నాయి.
మన దేశానికి స్వాతంత్యం కోసం ఎంతో పోరాడిన మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి మన గొప్ప స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకుందాం. వారి త్యాగాల వల్లే మనం ఈ స్వేచ్ఛాయుత జీవితం గడుపుతున్నాం.
అంతటి పవిత్రమైన దేశంలో జన్మించిన మనం ఏం చేయాలి?
మన దేశాన్ని ప్రేమించాలి, మన దేశం గురించి గర్వంగా ఉండాలి. చదువుకుని మన దేశాన్ని అభివృద్ధి చేయాలి. మన చుట్టూ ఉన్న వారికి సహాయం చేయాలి. అందరం కలిసి మెలిసి ఉంటేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు.. రేపటి దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందనడానికి అదే నిదర్శనం. మనం ఎంత కష్టపడితే మన దేశం అంత అభివృద్ధి చెందుతుంది. మనం చిన్నవారమే అనుకుంటున్నారా? లేదు, మనం చేసే ప్రతి చిన్న పని కూడా మన దేశానికి ఉపయోగపడుతుంది.
జై హింద్!
ఈ ప్రసంగాన్ని మీ పిల్లల చేత చెప్పించడం వల్ల ఆయనకున్న తెలివితేటలు బయటపడడంతో పాటు.. పాఠశాలలో వారికి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అలాగే వారికొచ్చే ప్రశంసల కారణంగా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారు ఏదైనా సాధించగలమనే నమ్మకం కలుగుతుంది. ఈసారి మీ పిల్లలు ఎవరైనా రిపబ్లిక్ డే స్పీచ్ ఇవ్వాలనుకుంటే ఓసారి ఈ స్పీచ్ ట్రై చూపించండి.



Click it and Unblock the Notifications