Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
పొట్టలో గ్యాస్‌తో గుక్క పెట్టి ఏడుస్తున్న బుజ్జాయిలకు ఇలా ఉపశమనం కలిగించవచ్చు
నవజాత శిశువుల్లో గ్యాస్ ఏర్పడటం చాలా సాధారణ సమస్య. బుజ్జాయి తల్లి పాలు తాగుతున్నాడా, లేదా డబ్బా పాలు తాగుతున్నాడా అనే దాంతో సంబంధం లేదు. పలు కారణాల వల్ల చిన్న పిల్లల్లో గ్యాస్ ఏర్పడుతుంది. దీని వల్ల శిశువులు చాలా అసౌకర్యంగా ఉంటారు.
కడుపు నొప్పి, ఉబ్బరంతో బాధపడుతుంటారు. పదే పదే ఏడుస్తుంటారు. మీ బుజ్జాయి కూడా పొట్టలో గ్యాస్ తో ఇబ్బంది పడుతుంటే కొన్ని చిట్కాలతో ఉపశమనం కలిగించవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

శిశువుల్లో గ్యాస్ ఎలా ఏర్పడుతుంది
1. గాలి మింగడం:
తల్లిపాలు తాగేటప్పుడు లేదా సీసాలో పాలు తాగేటప్పుడు బుజ్జాయిలు గాలిని మింగుతుంటారు. అలా లోపలికి వెళ్లిన గాలి వల్ల పొట్టలో గ్యాస్ ఏర్పడుతుంది.
2. ఏడుపు:
ఏడుపు వల్ల కూడా గాలి లోపలికి వెళ్లవచ్చు. శిశువు ఎక్కువగా ఏడుస్తుంటే అది గ్యాస ఏర్పడటానికి సంకేతం కావొచ్చు. తరచూ ఏడవడం వల్ల గాలి నోటి ద్వారా లోపలికి వెళ్లి గ్యాస్ ఏర్పడుతుంది.
3. సరిగ్గా జీర్ణం కాకపోతే:
నవజాత శిశువుల ప్రేగులు పూర్తిగా అభివృద్ధి చెందవు. పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకపోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
4. కొన్ని రకాల ఆహారాల వల్ల:
గింజలు, కాఫీ, బీన్స్, జున్ను, వెన్న, నెయ్యి వంటి వాటిని తల్లి తినడం ద్వారా బిడ్డల్లో గ్యాస్ ఏర్పడవచ్చు.
శిశువుల్లో గ్యాస్ సమస్యకు ఇంటి చిట్కాలు
1. సరైన స్థితిలో పాలు పట్టడం:
బిడ్డకు పాలు పడుతున్నప్పుడు సరైన స్థితిలో పాలు పట్టాలి. సరైన పొజిషన్.. తల్లికి, బిడ్డకు సౌకర్యంగా ఉండే స్థితిని గుర్తించి అదే స్థితిలో పాలు ఇవ్వాలి. దీని వల్ల గాలి పొట్టలోకి వెళ్లకుండా ఉంటుంది.
2. ఫీడ్ అండ్ బర్ప్:
బిడ్డకు పాలు ఇస్తున్నప్పుడు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకోవాలి. ఆ సమయంలో బిడ్డ వీపుపై సున్నితంగా నొక్కాలి. ఇలా చేయండ వల్ల బిడ్డ కడుపులో పాల స్థిరపడతాయి.
3. డిస్ట్రాక్షన్ టెక్నిక్:
బిడ్డ ఏడుస్తున్నప్పుడు గాలిని మింగే అవకాశం ఉంటుంది. అందుకే బుజ్జాయి ఏడుపు లంఖించుకోగానే.. ఆపడానికి ప్రయత్నించాలి. అలా ఏడుపు ఆపేస్తే గాలి నోట్లోకి వెళ్లడం ఆగిపోతుంది.
4. పొట్టను మసాజ్ చేయాలి:
శిశువుల్లో గ్యాస్ తగ్గించడానికి మసాజ్ మంచి మార్గం. శిశువును వీపుపై పడుకుబెట్టి, సవ్యదిశలో బొడ్డును సున్నితంగా రుద్దాలి. ఆపై బిడ్డ పొత్తికడుపు వంపులో చేతితో మర్దనా చేయాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications