Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లలతో ఎంత కఠినంగా ఉంటే అంత నష్టం, మీరెలా ఉంటున్నారో తెలుసుకోండి
తల్లిదండ్రులందరూ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని కోరుకుంటారు. వారు బాధ్యాతాయుతంగా మంచి ప్రవర్తనతో జీవితాంతం ఉన్నతమైన శిఖరాల్లో ఉండాలని ప్రతీ ఒక్కరూ కలలు గంటారు. అయితే పిల్లలతో తల్లిదండ్రులు బాధ్యతగా ఉండడం, కఠినంగా ఉండడానికి మధ్య ఓ సన్నని గీత ఉంటుంది.
దీన్ని దాటి ప్రవర్తిస్తే అప్పటి నుంచే పిల్లలు మన చెప్పే మాటను వినడం మానేస్తారు. పిల్లలతో కఠినంగా ఉండడం వల్ల వారిలో ఆందోళన, తిరుగుబాటు ప్రవర్తన పెరగడం, ఆత్మగౌరవం తగ్గడం జరుగుతుంది. అయితే మీరు మీ పిల్లలతో సహజంగానే ఉన్నారా లేదా కఠినంగా వ్యవహరిస్తున్నారా తెలుసుకోండిలా.

1. విపరీతమైన అంచనాలు ఉన్నాయా?
మీ పిల్లలపై మీరు విపరీతమైన అంచనాలను పెట్టుకుంటే.. వారు వాటిని అందుకోలేనప్పుడు మీకు విపరీతమైన కోపం, చిరాకు వస్తుంటుంది. మీరు ఇలాగే ప్రవర్తిస్తుంటే మీరు మీ పిలల్లపై చాలా కఠినంగా వ్యవహరిస్తున్నట్లు అర్థం. మంచి పనులు చేయమని ప్రోత్సహించడం అవసరమే అయినప్పటికీ.. మీ అంచనాలను అందుకోమని ఒత్తిడి చేయడం మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది.
2. నియమ, నిబంధనలు ఎక్కువ..!
ఇంట్లో పిల్లలకు నియమ, నిబంధనలు పెడుతుంటారు చాలా మంది. వాటిని రోజూ అమలయ్యేలా చూస్తుంటారు. వాటిని పిల్లలు పాటించకపోతే పనిష్మెంట్ వంటివి ఇవ్వడం చేస్తున్నారంటే మీరు పిల్లలతో కఠినంగా ఉన్నట్లే లెక్క. పిల్లల్లో క్రమశిక్షణ పెరగాలంటే నియమ, నిబంధనలు అవసరమే అయినప్పటికీ.. అవి పిల్లల స్వేచ్ఛను హరించేవిగా ఉండకూడదు.
3. ఏం తినాలి, ఏం వేసుకోవాలో కూడా చెప్తున్నారా?
పిల్లల జీవితంలో జరిగే ప్రతీ చిన్న విషయాన్ని సూక్ష్మంగా చూస్తుంటే చాలా కష్టం. వారు మీకు నచ్చిందే తినాలి, మీకు నచ్చిందే వేసుకోవాలని అనుకుంటే అనేక సమస్యలు వస్తాయి. వారికి నచ్చినవి తిననివ్వడం, నచ్చిన బట్టలు వేసుకోనివ్వడం వంటివి చేయనివ్వాలి. వారిని గైడ్ చేయాలే తప్ప మీ భావాలను వారిపై అస్సలే రుద్దకూడదు.
4. పిల్లల తప్పులపై సహనం లేకపోవడం:
పిల్లలు ఏవైనా చిన్న చిన్న తప్పులు చేస్తుంటే క్షమించకుండా శిక్షించడం మంచిది కాదు. అనవసరపు చిన్న తప్పులకు కూడా పిల్లలను శిక్షిస్తూ పోతే.. మీరు వారి పట్ల చాలా కఠినంగా ఉన్నట్లు లెక్క. వారి చేసిన తప్పులకు మీరే జవాబుదారీ తనం వహించాలి. ఇలా చేయకుండా శిక్షిస్తే.. పిల్లల్లో ఆత్మన్యూనతా భావం, ఆందోళన, ఆగ్రహం ఎక్కువవుతాయి.
5. ఎమోషనల్ గా దూరంగా ఉండడం..!
మీ పిల్లలు ఏవైనా తప్పులు చేసినప్పుడు మానసికంగా మీరు దూరం పెడితే పిల్లలు తట్టుకోలేరు. వాళ్లు బాధలో ఉన్నా, ఏదైనా దెబ్బ తగిలినా మీ కౌగిలింతను, ఓదార్పును కోరుకుంటారు. మీకు ఒక్కసారి హగ్ చేసుకుంటే వారికి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లుగా ఫీలవుతుంటారు. అలా కాకుండా వాళ్లేదో తప్పు చేశారని మీరు దూరం పెడితే ఆత్మన్యూనతా భావానికి లోనువుతారు. క్రమశిక్షణ ఎంత ముఖ్యమో వారు భావోద్వేగ అవసరాలను తీర్చడం కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. వారి బాగోగులు చూసుకుంటున్నారంటే.. కేవలం భౌతికమైనవి మాత్రమే కాదు, మానసికమైనవీ చూసుకోవాలి.



Click it and Unblock the Notifications