Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
మీ పిల్లలకు బొటనవేలు చప్పరించే అలవాటు ఉందా? వెంటనే మాన్పించండి ఎందుకంటే?
పిల్లలు చాలా మందికి నోట్లో బొటనవేలు పెట్టుకొని చప్పరించే అలవాటు ఉంటుంది. ఇది వారికి చాలా సౌకర్యవంతంగా అలాగే ఓదార్పుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే వారి నోట్లో నుంచి బొటనవేలు తీయగానే ఏడవడం మొదలుపెట్టేస్తారు. ఇది మొదట్లో బాగానే ఉన్నప్పటికీ.. పిల్లల్లో అత్యంత ప్రమాదకరమైన వ్యాధులకు కారణమయ్యే అవకాశాలు ఉంటాయి. పిల్లలు బొటనవేలు చప్పరించడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయి? అసలు వారెందుకు బొటనవేలును చప్పరిస్తారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పిల్లలు బొటన వేలును ఎందుకు చప్పరిస్తారంటే?
సాధారణంగా పిల్లలకు ఆకలిగా ఉన్నప్పుడు బొటనవేలు చప్పరించడం ప్రారంభిస్తారు. ఎప్పుడైతే తల్లి పాలు ఇవ్వడం ప్రారంభిస్తుందో వారు దానిని ఆపేస్తారు. అయితే తల్లి పాలు ఇవ్వడం ఆలస్యమైనా, అలాగే వారికి ఆకలి ఎక్కువగా వేస్తున్నా వారు బొటన వేలును చప్పరిస్తూనే ఉంటారు. అది క్రమంగా వారికి అలవాటుగా మారిపోతుంది. ఇది కొన్ని అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.

పిల్లలు బొటనవేలు చప్పరించడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయంటే?
దంతాల సమస్య
పిల్లలు బొటనవేలును అలానే చప్పరిస్తూ ఉంటే వారిలో దంతాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలా చప్పరిస్తూ ఉండడం వలన.. వారి దంతాల అమరిక సరిగ్గా జరగదు. ఒక దంతం ముందుకు, ఇంకో దంతం వెనక్కి వస్తుంది. దీని కారణంగా వారు ఎదుగుతున్న కొద్దీ అందహీనంగా కనిపించే అవకాశం ఉంది.
పెదవులు మందంగా..
బొటనవేలును చప్పరించడం వలన దంతాల సమస్యలు మాత్రమే కాదు.. పెదాలు కూడా చాలా మందంగా తయారవుతాయట. అలానే చప్పరిస్తూ ఉండడం వలన ఆ ప్రభావం పెదాలపై పడుతుందని, క్రమంగా అవి మందంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.
జీర్ణ సమస్యలు
పిల్లలు అదే పనిగా బొటనవేలును చప్పరించడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అలా బొటన వేలును చప్పరించడం వలన కడుపులో వేలుపై ఉండే క్రీములన్నీ వెళ్లిపోతాయి. దీని కారణంగా వారికి కొన్ని పొట్ట సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తిన్న ఆహరం జీర్ణం కాకపోవడం, కడుపునొప్పి వంటి ఇతర సమస్యలు వస్తాయి.
తిండిపై అనాసక్తి..
పిల్లలు బొటనవేలును చప్పరించడం వలన వారికి తిండిపై అనాసక్తి ఏర్పడుతుంది. తిండి తినడం, నీళ్లు తాగడం వంటి వాటిపై ఇష్టం చూపరు. కేవలం బొటన వేలును చప్పరించడానికే ఇష్టపడుతుంటారు. ఇది క్రమంగా వారిలో అన్నం తినాలనే ఆసక్తి లేకుండా చేస్తుంది. దీంతో వారు బలహీనంగా మారుతారు. అందుకే ఆ అలవాటును మానిపించేయాలి.
ముఖ ఆకారంపై ప్రభావం..
పిల్లలకు బొటన వేలు చప్పరిస్తే వారి ముఖ ఆకారంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. వారి ముఖం ముందు ఉబ్బిపోవచ్చు. పెదాలు, దంతాలు కూడా ముందుకు ఉబ్బినట్లు కనిపించొచ్చు. వీటితో ముఖ ఆకారం కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే వారికి ఈ బొటనవేలు చప్పరించే అలవాటు ఉంటే వెంటనే వాటిని మాన్పిచ్చేయండి.



Click it and Unblock the Notifications











