Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తల్లిదండ్రులు చేసే ఈ పనులే పిల్లలకు శాపంగా మారుతున్నాయి.. అవి ఏవంటే?
తల్లిదండ్రులు ఎవరైనా తమ పిల్లలను ఉన్నతంగా పెంచాలని అనుకుంటూ ఉంటారు. తమ పిల్లలను భవిష్యత్తులో ఉన్న స్థానంలో చూసుకోవాలని భావిస్తుంటారు. అందుకోసం వారికోసం కావాల్సింది చేస్తుంటారు. మంచి స్కూళ్లలో చదివిస్తుంటారు. అయితే ఉద్యోగం, వ్యాపారం అంటూ ఈ మధ్య కాలంలో పేరెంట్స్ పిల్లలను పట్టించుకోవడం మానేస్తున్నారు. వారి బాగోగులు మాత్రమే చూస్తున్నారు తప్ప వారి భావోద్వేగాలు, వారి ఆలోచనలు, అలవాట్లను మాత్రం పట్టించుకోవడం లేదు. ఇది పిల్లలకు శాపంగా మారుతోంది.
అలాగే సమాజంలో వారొక చెడ్డ వ్యక్తిగా ఎదగడానికి ప్రేరేపిస్తున్నాయి. అయితే తల్లిదండ్రులు ఎలాంటి తప్పులు చేయడం వల్ల పిల్లలు ఇలా మారుతున్నారు? తల్లిదండ్రుల బాధ్యత ఏమిటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

భావోద్వేగాలను వివరించడం..
పిల్లలు భావోద్వేగాలను సొంతంగా అర్ధం చేసుకోలేరు. అసలు వారి సొంత భావోద్వేగాలను విని, వాటికి అనుగుణంగా నడుచుకోవడమే వారికి చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లోనే వారికి అసలు భావోద్వేగాలు అంటే ఏమిటో వివరించాలి. వారిలో కలుగుతున్న భావోద్వేగాలు, వారిలో మదిలో మెదులుతున్న ఆలోచనలను ఎవరితో మాట్లాడాలి? జీవితంలో ఎలాంటి వ్యక్తులను ఉంచుకోవాలి? ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయాలి, మంచి ఏంటి చెడు ఏంటి అనే అన్ని విషయాలను వారితో పంచుకోవాలి. ఇలాంటప్పుడే వారు సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎదగలరు.
ఒత్తిడిని దూరం చేయాలి..
చదువు విషయంలో అయినా, ఆటల విషయంలోనైనా మరే ఇతర విషయాల్లో అయినా సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలపై ఎక్కువగా ఒత్తిడి పెంచుతూ ఉంటారు. ఆ పిల్లవాడు తన సొంత ఆలోచనల మీద ఆధారపడి, తన సొంత జీవితం గడపడం కంటే తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల జీవించడమే ఎక్కువ అవుతుంది. ఈ క్రమంలో ఆ పిల్లవాడు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే పిలపై వీలైనంత తక్కువ ఒత్తిడి ఉండే విధంగా చూసుకోవాలి. కొన్ని అనుకూలమైన సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రేరేపించాలి. కీలకమైన సమయాల్లో ఒత్తిడికి గురికాకుండా ఎలా ఉండాలో వివరించాలి.
ప్రేమను పంచాలి..
కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను అత్యంత ప్రేమతో పెంచుతారు. ప్రతి చిన్న విషయానికి గారాబం చేస్తుంటారు. చిన్న చిన్న తప్పులు చేస్తున్నప్పుడు వారిని ప్రోత్సహించడం, వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం పిల్లపై చెడు ప్రభావాన్ని పెంచుతుంది. ఇలా పెరిగిన పిల్లలు చాలా రూడ్‌గా ఉంటారు. ఇతరుల నుంచి ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. అది జరగనప్పుడు బాధపడుతూ కుంగిపోతారు. డిప్రెషన్‌లో ఏం చేస్తున్నారో వారికే తెలియకుండా అయిపోతుంటారు.
బాధ్యతగా ఉండండి..
అందుకే పిల్లలను పెంచే విషయంలో తల్లిదండ్రులు కాస్త బాధ్యతగా వ్యవహరించాలి. పిల్లలు ఎలాంటి మార్గంలో పెరుగుతున్నారు? ఎలాంటి అలవాట్లు చేసుకుంటున్నారు? ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నారు అనే విషయాలపై ద్రుష్టి పెట్టాలి. పిల్లలను ప్రేమగా పెంచడం మాత్రమే కాదు.. కఠిన సమయాల్లో ఎలా ఉంటారో కూడా చూపించాలి. జీవితంలో ఉండే ఎత్తు పల్లాలను వారికి వివరించాలి. మరీ ముఖ్యంగా వారిపై ఎలాంటి హద్దులు లేకుండా ఒత్తిడిని మాత్రం పెంచకూడదు.



Click it and Unblock the Notifications