Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
తల్లిదండ్రులు చేసే ఈ తప్పులే పిల్లల నాశనానికి కారణం అవుతున్నాయి.. అవి ఏవంటే?
ప్రస్తుతమున్న కాలంలో పిల్లలను పెంచడం అనేది అత్యంత కష్టమైన పని. వారి అల్లరిని భరిస్తూ వారిని మంచి మార్గంలో పెంచాలంటే తల్లిదండ్రుల ప్రాణాలు అరచేతుల్లోకి వచ్చేస్తున్నాయి. దానికి తోడు సోషల్ మీడియా, మొబైల్స్ వంటివి పిల్లలను ఇంకా ఎక్కువగా పాడు చేస్తున్నాయి. వారిలో మార్పులను తీసుకొస్తున్నాయి. వారి ప్రవర్తన పూర్తిగా చెడిపోవడానికి కారణమవుతున్నాయి. ఇవి వారిపై కొంత మార్పులను తీసుకొస్తున్నప్పటికీ.. తల్లిదండ్రులు వారి ముందు ప్రవర్తించే విధానం కూడా పిల్లల్లో తెలియకుండా సమూలమైన మార్పులకు కారణమవుతున్నాయి. అయితే తల్లిదండ్రులు చేసే ఎలాంటి పనులు పిల్లల్లో మార్పులకు కారణం అవుతున్నాయి? తల్లిదండ్రుల వలన పిల్లలు ఎందుకు చెడిపోతున్నారు అనేది ఈ కథనంలో తెలుసుకోండి.
1. అతిగా కాపాడటం
పిల్లలను ప్రతీ చిన్న ఇబ్బంది నుంచి రక్షించడం వలన వారిని మనం పరోక్షంగా పాడు చేస్తున్నట్లు అవుతుంది. ఎందుకంటే ఇలా చేయడం వలన వారు స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలను ఎదుర్కోవడం వంటి అవకాశాలను కోల్పోతున్నారు. ఇది వారికి ధైర్యాన్ని, నైపుణ్యాన్ని, బాధ్యతను నేర్పే బదులు ఎప్పటికీ ఇతరులపై ఆధారపడేలా చేస్తుంది. వారు ఎదుగుతుంటే భయాల్ని అధిగమించే అవకాశం ఇవ్వండి. అప్పుడే వారు నిజంగా స్వతంత్రంగా ఎదుగుతారు.

2. ఇతరులతో పోల్చడం
పిల్లలను "ఇతను అలా చదువుతున్నాడు, ఆ అమ్మాయి ఇలా పుస్తకాలు చదువుతుంది" అంటూ పోల్చడం వల్ల, పిల్లల్లో అసమర్థత భావం పెరిగిపోతుంది. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడమే కాదు, వారిలో అసంతృప్తిని కలిగిస్తుంది. ప్రతి పిల్లాడిలో ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి. ఇది వారిలో ప్రత్యేకమైన తెలివిని రేకెత్తిస్తాయి. అందుకే తల్లిదండ్రులు పిల్లలను తమ బలాల మీద దృష్టి పెట్టేలా ప్రోత్సహించాలి, పోలికలతో నిరుత్సాహపరచకూడదు.
3. క్రమశిక్షణ పేరుతో కఠినత్వం
క్రమశిక్షణ మంచిదే కానీ అది గట్టి ఆంక్షలుగా మారితే పిల్లలు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. పిల్లలను శాసించడం కన్నా వారికి అవగాహన కలిగించడం ముఖ్యమైంది. ఎందుకు ఏ నియమం పాటించాలి, దాని వెనక ఉద్దేశం ఏంటో అర్థమయ్యేలా చెప్పండి. పిల్లలు ఒకరినొకరు గౌరవించడం, సమాజంలో మెలగడం నేర్చుకుంటే వారు మంచి పౌరులు అవుతారు.
4. ఆప్యాయత లోపించడం
ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితుల్లో, పిల్లలకు అవసరమైన ప్రేమ, అనురాగం అందించలేకపోతున్నారు. ఇది వారి మనోభావాలపై ప్రభావం చూపుతుంది. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల అనుబంధం తగ్గితే, పిల్లల్లో ఒంటరితనం పెరుగుతుంది. వాళ్లతో గడిపే సమయం విలువైనది. అందుకే వారికి ఎప్పుడూ ప్రేమను పంచుతూనే ఉండండి. వారికి దూరం అవ్వకండి.
5. డిజిటల్ మాధ్యమాల్లో ముంచేయడం
చిన్నప్పటి నుంచే ఫోన్లు, టీవీలు, వీడియో గేమ్స్ మొదలైనవి అందించడం వల్ల పిల్లలు బహుళ విషయాలు నేర్చుకునే అవకాశాలను కోల్పోతున్నారు. అది బహుశా తాత్కాలికంగా సంతోషాన్ని ఇవ్వొచ్చు కానీ దీర్ఘకాలంలో దాని ప్రతికూలతలు ఎక్కువ. పిల్లలను సాంకేతికత నుండి పూర్తిగా దూరం పెట్టమని కాదు, కానీ దానిని సమయపాలనతో, బద్రతతో వాడేలా చూసుకోవాలి.
ముగింపు
తల్లిదండ్రులుగా పిల్లల కోసం చేసే ప్రతి పని వారిపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. మన ప్రేమను వారు స్వేచ్ఛగా అనుభవించాలంటే, మనం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వారిని పెంచడం అంటే కేవలం రక్షణ కాదు, నిజంగా వారి జీవితాన్ని వారే ఎదుర్కొనగలవారిగా తీర్చిదిద్దడమే.



Click it and Unblock the Notifications