Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
చలికాలంలో పిల్లలకు స్నానం చేయించేటప్పుడు తప్పకుండా ఈ 5 విషయాలు గుర్తుంచుకోవాలి.. లేకపోతే రోగాలు ఖాయం!
చలికాలం వచ్చేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ చలికాలంలో పిల్లల ఆరోగ్యం, చర్మ సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. వారికి తినిపించే ఆహారం నుంచి, వారికి ధరింపజేసి దుస్తుల వరకు అన్నింటినీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా చలికాలంలో నవజాత శిశువులకు స్నానం చేయించేటప్పుడు కొన్ని విషయాల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేడి నీటిపై శ్రద్ధ తీసుకోవాలి..
చలికాలంలో పిల్లలకు స్నానం చేయించేటప్పుడు.. వారికి స్నానం చేయించే నీటి ఉష్ణోగ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకు స్నానం చేయించే నీళ్లు ఎప్పుడూ గోరువెచ్చగానే ఉండాలి. మరీ చల్లగా, మరీ వేడిగా ఉన్న నీళ్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.

వెచ్చగా ఉంచాలి..
చలికాలంలో పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ వెచ్చగా ఉంచేందుకు ప్రయత్నించాలి. లేకపోతే కచ్చితంగా జలుబు చేసే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా స్నానం చేసిన తరువాత వెచ్చగా ఉంచాలి. వెచ్చటి దుస్తులను వారికి కప్పాలి. అలాగే వెచ్చటి ప్రదేశంలో ఉంచి, ఫ్యాన్స్, ACలను బంద్ చేయాలి. లేకపోతే జలుబు, జ్వరం వచ్చే అవకాశం ఉంది. అలాగే స్నానం చేయించిన తరువాత ఉంచడం కూడా మంచిది. అలా అని విపరీతమైన ఎండలో అస్సలు ఉంచకూడదు. ఉదయాన్నే 6 నుంచి 7 గంటల్లో వచ్చే ఎండలో మాత్రమే వారిని ఉండనివ్వాలి.
నూనె వినియోగించాలి..
చలికాలంలో స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారడం, చర్మంపై దద్దుర్లు రావడం వంటివి జరుగుతుంటాయి. సాధారణంగా ఇలాంటి సమస్యలు పెద్దలకు వస్తుంటాయి. అయితే చలికాలంలో పిల్లలకు ఈ విధమైన సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇలాంటి పరిస్థితులను నివారించడానికి, అలాగే మళ్ళీ రాకుండా ఉండడానికి పిల్లలకు స్నానం చేయించే నీటిలో రెండు లేదా మూడు చుక్కల కొబ్బరి లేదా ఆవాల నూనెను వేయాలి. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు, చర్మం పొడిబారడం, దద్దుర్లు రావడం వంటి సమస్యలను నిర్వారిస్తుంది.
చల్లని వాతావరణంలో స్నానం చేయించకూడదు..
చలికాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. కాబట్టి చల్లని వాతావరణంలో పిల్లలకు అస్సలు స్నానం చేయించకూడదు. గోరువెచ్చని నీటిలో నూనె వేసి మసాజ్ చేయాలి. ఇది పిల్లలకు, వారి శరీరానికి కావాల్సిన వెచ్చదనాన్ని అందిస్తుంది. అలాగే ఉదయాన్ని లేత సూర్య కిరణాలు పడుతున్నప్పుడు మసాజ్ చేయడం వల్ల విటమిన్ డీతో పాటు శరీరానికి కావాల్సిన ఉష్ణోగ్రతలు పిల్లలకు సమపాళ్లలో లభిస్తాయి.
ప్రతిరోజూ స్నానం అవసరం లేదు..
చలికాలంలో పిల్లలకు ప్రతిరోజూ స్నానం చేయించాల్సిన అవసరం లేదు. వారంలో రెండు లేదా మూడు సార్లు స్నానం చేయిస్తే సరిపోతుంది. ఒకవేళ పిల్లలు మురికిగా ఉన్నారు, పిల్లలు ఆడుతూ వాసన వస్తున్నారు అని అనిపిస్తే తడి గుడ్డతో వారిని తుడిచేస్తే సరిపోతుంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.



Click it and Unblock the Notifications