Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
కడుపులో బిడ్డకు తెలివితేటలు పెరగాలంటే..ఈ ఆహారం తినాల్సిందే..
గర్భిణీలు గర్భం దాల్చిన దగ్గరి నుంచి డెలివరీ అయ్యేంత వరకు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. కడుపులో ఉండే శిశువు ఆరోగ్యంగా పెరగాలంటే తల్లి తప్పకుండా బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రస్తతుం జీవినశైలిలో చాలా మార్పులు జరిగాయ్. బయటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. అలాంటి అన్ని జంక్ ఫుడ్‌లకు గర్భిణీలు దూరంగా ఉండాలి. బిడ్డను మోసే 9 నెలలు గర్భిణీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయాలను మీకు అందిస్తున్నాం.

తల్లికి ఉండే రక్తం బిడ్డ ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. గర్భిణీలకు శరీరంలో రక్తం ఎక్కువ ఉంటేనే బిడ్డకు తల్లికి సరిపడుతుంది. లేదంటే హెమోగ్లోబిన్ లోపం వల్ల తల్లిబిడ్డ అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయ్. హెమోగ్లోబిన్ పెరగాలంటే ఆహారంలో ఐరన్ తప్పకుండా ఉండాలి. అందువల్ల ఐరన్‌ను పెంపొందించే ఆహారాన్ని భూజించాలి.
గర్భిణీలకు ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. శిశువు ఎదుగుదలకు ఇది చాాలా ఉపయోగపడుతుంది. బిడ్డ మెదడు, వెన్నుపాము ఎదగాలంటే ఫోలిక్ యాసిడ్ ఆహారంలో ఉండే విధంగా చూసుకోవాలి. వైద్యులు దీనికోసం ప్రత్యేకంగా మందులను కూడా సూచిస్తారు.
బిడ్డ యముకలు బలంగా ఎదగాలంటే క్యాల్షియం చాలా అవసరం. తల్లి ఎముకల నుంచి బిడ్డ ఆక్సీజన్‌ను తీసుకుంటుంది. కాబట్టి తల్లికి కూడా కాల్షియం చాలా అవసరం. పాలు, పెరుగు, ఆకుకూరలు బాగా తీసుకుంటే శరీరానికి సరపడ కాల్షియం అందుతుంది.
థైరాయిడ్ సమస్యలు రావద్దంటే అయోడిన్ తప్పనిసరిగా తీసుకోవాలి. శరీరంలో అయోడిన్ లేకపోతే కడపులో శిశువు ఎదుగుదలకు అడ్డంకి ఏర్పడుతుంది.
డ్రైఫుట్స్‌లో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్, కాల్షియం, పోషకాలు మెండుగా ఉంటాయ్. వీటితోపాటు ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయ్. రోజుకు డ్రైఫ్రూట్స్ నానబెట్టుకొని తినడం వల్ల తల్లితో పాటు కడపులో పెరిగే బిడ్డకు చాలా ఆరోగ్యకరం.
ఆరెంజ్ జ్యూస్‌లో వైటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. పుట్టబోయే బిడ్డకు ఎటువంటి జన్యు సమస్యలు రాకుండా వైటమిన్ సి అడ్డుకుంటుంది.
పప్పులు
కందిపప్పు, సోయాబీన్స్, బఠానీలు, బీన్స్ వంటి పప్పుల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయ్. ఇందులో ఫైబర్, ప్రొటీన్, ఫోలేట్, కాల్షియం, ఐరన్ కూడా ఉంటుంది. ఈ పోషకాలన్నీ గర్భిణీలుకు చాలా ఉపయోగపడతాయ్.



Click it and Unblock the Notifications