Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పిల్లలను ఓవర్ ప్రొటెక్ట్ చేస్తున్నారా? అయితే మీరు ఎలిఫెంట్ పేరెంట్ కావొచ్చు
ప్రతి బిడ్డ ప్రత్యేకమే. ఒకరికి మరొకరికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు కూడా ప్రత్యేకమే. ఒకరు వ్యవహరించినట్లు మరొకరు ఉండరు. తల్లిదండ్రులకు భిన్నమైన పేరెంటింగ్ స్టైల్స్ ఉంటాయి. కొందరు చాలా తేలికగా ఉంటే, మరికొందరు చాలా కఠినంగా ఉంటారు, ఇంకొందరు ఓవర్‌గా ప్రొటెక్ట్ చేస్తుంటారు.
పిల్లలు ఎలా ఎదగాలని కోరుకుంటారో అలాగే పెంచడానికి తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారు. ఒక్కే పేరెంటింగ్ స్టైల్ లో ఒక్కో రకమైన వ్యూహాలను ఉపయోగిస్తారు. పరిస్థితుల ప్రభావం తల్లిదండ్రులను, వారి పెంపకాన్ని ప్రభావితం చేస్తుంది. పిల్లల పట్ల రక్షణాత్మకంగా ఉండే పెంపకాన్ని ఎలిఫెంట్ పేరెంటింగ్ అంటారు.

ఎలిఫెంట్ పేరెంటింగ్ అంటే ఏంటి?
ఏనుగుల పెంపకం చాలా భిన్నంగా ఉంటుంది. తల్లి ఏనుగు పిల్ల ఏనుగుకు ఎప్పుడు రక్షణగా ఉంటూనే దానికంటూ ప్రత్యేక స్థలాన్ని ఇస్తుంది. తన ప్రవర్తన ద్వారా పద్ధతులు నేర్పిస్తుంది. సన్నిహితంగా ఉంటుంది. ఆహారం అందిస్తుంది, రక్షణ కల్పిస్తుంది, అలాగే సరైన మార్గదర్శకత్వం చేస్తుంది. పిల్లలకు అడవిలో ఎలా జీవించాలో నేర్పుతుంది. అలా ఏనుగుల నుండి వచ్చిందే ఎలిఫెంట్ పేరెంటింగ్.
ఎలిఫెంట్ పేరెంటింగ్ లో తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలకు అందుబాటులో, రక్షణగా ఉంటారు. పిల్లలకు తల్లిదండ్రుల మద్దతు ఎప్పుడూ లభిస్తుంది. సహాయక వాతావరణాన్ని సృష్టిస్తారు. సరైన మార్గదర్శకత్వం చేస్తారు.
ఎలిఫెంట్ పేరెంటింగ్ ప్రయోజనాలు:
* ఎలిఫెంట్ పేరెంటింగ్ లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధం బలంగా ఉంటుంది.
* పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎప్పుడూ సానుకూలంగా ఉంటారు. అన్ని సమయాల్లో ప్రోత్సహిస్తారు.
* ప్రేమను పంచుతారు. మద్దతు ఇస్తారు.
* పిల్లల గురించి వారి సామర్థ్యాల గురించి తెలుకుంటారు.
* ఈ రకమైన పెంపకం వల్ల సామాజిక నైపుణ్యాలు పెంపొందుతాయి.
* ఎలిఫెంట్ పేరెంట్స్ తమ పిల్లల జీవితాల్లో భాగమవుతారు.
* పిల్లలతో స్నేహంగా మెలుగుతారు. బలమైన బంధాన్ని ఏర్పరచుకుంటారు.
* సవాళ్లు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో వివరించి చెబుతారు.
ఎలిఫెంట్ పేరెంటింగ్ ప్రతికూలతలు:
* ఎలిఫెంట్ పేరెంట్స్ తమ పిల్లల పట్ల ఎక్కువ రక్షణాత్మకంగా ఉంటారు. ఇలాంటి పెంపకం వల్ల ఒక్కోసారి పిల్లలు తమ సమస్యలను తమకు తాము పరిష్కరించుకునే అవకాశం ఉండదు.
* రక్షణాత్మక ధోరణి వల్ల కొత్త పనులు, రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడరు.
* మితిమీరిన ఎలిఫెంట్ పేరెంటింగ్ వల్ల పిల్లలను ఎప్పుడూ నియంత్రణలో ఉంచుతారు.
* ఎలిఫెంట్ పేరెంటింగ్ వల్ల పిల్లల సృజనాత్మకత, స్వతంత్రత అణచిపోవచ్చు.



Click it and Unblock the Notifications