Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పుట్టిన బిడ్డ బరువు ఎంత ఉండాలో తెలుసా? తక్కువ ఉంటే ఏం చేయాలంటే?
పుట్టిన బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉండాలని అందరికీ ఉంటుంది. అయితే శిశువు ఎంత బరువుతో పుట్టారనే దానిపై అతని ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కానీ శిశువు ఎంత బరువు అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. తక్కువ బరువుతో శిశువు జన్మిస్తే అతనికి అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని, శిశువు బరువు తక్కువగా ఉంటే.. భవిష్యత్తులో బలంగా అవ్వలేరని కొందరు చెబుతుంటారు. అందుకే అసలు శిశువు బరువు ఎంత ఉండాలి?, ఎన్ని నెలలో జన్మిస్తే ఎంత బరువుతో జన్మిస్తారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
శిశువు బరువు ఎంత ఉండాలంటే?
సాధారణంగా శిశువు బరువు అతను తల్లి కడుపులో ఎన్ని నెలలు ఉన్నాడనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ శిశువు తల్లి కడుపులో ఆరోగ్యంగా పూర్తికాలం(అంటే 9 నెలలు నిండిన తరువాత) ఉంటే.. అతని బరువు 2.5 కిలోల కంటే ఎక్కువగా ఉండాలని వైద్యులు చెబుతుంటారు. అదే శిశువు 10వ నెలలో జన్మించినట్లైతే అతని బరువు 3 కిలోల నుంచి 4 కిలోల వరకు ఉండాలని పేర్కొంటున్నారు. ఒకవేళ శిశువు ఏడవ లేదా ఎనిమిదవ నెలలో జన్మించినట్లైతే.. వారి బరువు సాధారణంగానే తక్కువగా ఉంటుంది కాబట్టి 2.5కిలోల కంటే తక్కువగా ఉంటుందట. అదే కవలలు పుడితే శిశువును 2.5 నుంచి 3 కిలోలు ఉన్న శిశువుగా చెబుతారు. అసలు 1.5 కిలోల కంటే తక్కువ బరువుతో పుడితే వారిని తక్కువ బరువుతో పుట్టిన శిశువుగా చెబుతారు.

అసలు శిశువు బరువు తక్కువగా ఉండడానికి కారణాలు ఏంటి?
9 నెలలు నిండకుండానే పుట్టడం వల్ల బిడ్డ బరువు తక్కువగా ఉండే అవకాశాలు ఉంది. దీంతో పాటు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా దానికి కారణం కావచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు, గర్భంలో పోషకాల లోపం వల్ల కూడా శిశువు సాధారణ బరువు కన్నా తక్కువగా జన్మించే అవకాశం ఉంటుంది. కవలలు పుట్టినా కూడా పిల్లలు బరువు తక్కువగా ఉంటారు.
శిశువు బరువు తక్కువగా ఉంటే ఏం చేయాలి?
బిడ్డ చెకప్‌కు వెళ్ళినప్పుడు శిశువు బరువు తక్కువుగా ఉన్నట్లు గుర్తిస్తే వైద్యులకు చెప్పాలి. డాక్టర్ మీ బిడ్డ బరువు తక్కువగా ఉండడానికి గల కారణాలను గుర్తించి, దానికి తగిన చికిత్సను సిఫారసు చేస్తారు. అలాగే తల్లి పాలు బిడ్డకు అత్యంత సమగ్రమైన పోషకాహారం. కాబట్టి తల్లి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల శిశువుకు మంచి పోషకాలు ఉన్న పాలు దొరుకుతుంది. అలాగే వారిలో పాల ఉత్పత్తి పెరగడం వల్ల శిశువు కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ శిశువు బరువు పెరగడానికి కొంత సమయం తీసుకుంటారు. ఒక్కొక్కరి శరీరాకృతి ప్రకారం వారి బరువు పెరుగుతుంటుంది. అలా అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంత సమయం తరువాత శిశువు కచ్చితంగా బరువు పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి. అనవసరమైన తిండి పెట్టి శిశువుల ఆరోగ్యాన్ని ఖరాబు చేసుకోకూడదు.



Click it and Unblock the Notifications