Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఇలా చేస్తే ప్రెగ్నెన్సీ త్వరగా వస్తుంది..? క్వాలిటీ ముఖ్యం..!
పెళ్లైన తరువాత ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా గర్భం రావట్లేదు. గర్భం రాకపోయేసరికి మానసిక ఒత్తిడికి గురౌతారు. కుటుంబ సభ్యుల ఒత్తిడి కూడా వీళ్లపై ఎక్కువగా వుంటుంది. మహిళల్లో ఎగ్ సైజ్, ఎగ్ క్వాలిటీ బాగా వుండటానికి రకరకాల మందులను వాడుతారు. సహజంగా మంచి క్వాలిటీ ఎగ్స్ రావాలంటే సరైన డైట్ పాటించాలి. డైట్ ఒక్కటి మార్చుకుంటే తక్కువ సమయంలో మంచి క్వాలిటీ ఎగ్స్ వస్తాయ్.

ఎగ్స్ క్వాంటిటీ, క్వాలిటీ బాగా పెరగాలంటే వాటి ముందు జరిగే ప్రక్రియ కూడా క్వాలిటీగా వుండాలి. వ్యవసాయంలో మంచి పంట రావడానికి విత్తనాలపైనా, మట్టిపైనా, నీళ్లపైనా, పురుగులో పోవడానికి ఇలా ఎంత శ్రద్ధ పెడతారో ఎగ్స్ రావడానికి కూడా ఆరోగ్యంపైనా, డైట్ పైనా అంతే శ్రద్ధ పెట్టాలి. మంచి వ్యాయామం చేశారా, మంచి ఆహారం తీసుకున్నారా, విషపదార్ధాలు శరీరంలో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారా, ఫ్రీ రాడికల్స్ లేని డైట్ ను తిన్నారా ? ఇవి గనక చేస్తే కచ్ఛితంగా క్వాలిటీ ఎగ్స్ తయారౌతాయ్.
ఉదయం, సాయంకాలం మంచి ఆహారాన్ని తీసుకుంటే 2 నుంచి 3 నెలల్లో క్వాలిటీ ఎగ్స్ బయటకు వస్తాయ్. ఉడికబెట్టిన దేనినైనా ఉదయం సాయంత్రం తినవద్దు. కేవలం మధ్యాహ్నం మాత్రమే ఉడికిన ఆహారాన్ని తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం ప్రకృతి ప్రసాదించిన డైట్‌ను మాత్రమే తీసుకోవాలి. ఉదయంపూట యాంటీ ఆక్సిడెంట్లను అందించాలి. ఉదయం వెజిటేబుల్ జ్యూస్‌ను తీసుకోవాలి. జ్యూస్ తాగిన 45 నిమిషాల తరువాత మొలకెత్తిన విత్తనాలు తినాలి. పెసర్లు, బొబ్బర్లు, శెనగలు లాంటివి తినాలి. మొలకలన్నింటినీ ఒక బౌల్‌లో వేసుకొని తేనె కలుపుకొని తింటే రుచికి రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం, ఎగ్స్ క్వాలిటీగా వస్తాయ్. వారానికి ఏడు రోజులు ఇలాగే తినాలి.

సాయంత్రం బత్తాయి రసం, చెరుకు రసం, పైనాపిల్ జ్యూస్, ఏదైనా ఒక ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఈ జ్యూస్ తాగడం వల్ల 1 గంటలో ఆకలి తీవ్రంగా వేస్తుంది. ఈ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయ్. ప్రొటీన్లు ఎక్కువగా వున్న పుచ్చగింజల పప్పులను ఉదయాన్నే నానబెట్టుకోవాలి. వీటితో పాటు పొద్దతిరుగుడు పప్పు, బాదాం పప్పు, పిస్తా పప్పులను తీసుకోవాలి. తరువాత సీజనల్ పండ్లైన జామకాయ, మామిడి, బొప్పాయ్ లాంటివి తినాలి.
రాత్రి డిన్నర్‌లో డ్రై ఫ్రూట్స్, అంజీర పళ్లను తినాలి. ఉదయం, సాయంత్రం న్యాచురల్ డైట్‌ను తీసుకోవడం వల్ల క్వాలిటీ ఎగ్స్ రిలీజ్ అవుతాయ్. ఇలాంటి మంచి క్వాలిటీ డైట్‌ను తినాలి. మీరు అనుకున్నట్టు క్వాలిటీ ఎగ్స్ రిలీజ్ అయి గర్భధారణకు మంచి అవకాశాన్ని కలిగించినట్టు అవుతుంది.
ఆడవాళ్లల్లో పీరియడ్ సైకిల్ 30 రోజులకు వుంటుంది కాబట్టి పీరియడ్ స్టార్ట్ అయిన 10 రోజుల తరువాత నుంచి శృంగారంలో కలిస్తే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు ఎక్కువగా వుంటాయ్. మానసిక ఒత్తిడి ఎక్కువగా తీసుకోకుండా రిలాక్స్‌గా వుంటే ప్రెగ్నెన్సీ త్వరగా రావడానికి అవకాశాలు పెరుగుతాయ్. రోజూ యోగా, మెడిటేషన్ చేయడం వల్ల ఎక్కువ లాభం వుంటుంది. ప్రతీ రోజూ కొంత వ్యాయామం చేయడం కూడా చాలా మంచిది. బరువు ఎక్కువగా వుంటే తగ్గించే ప్రయత్నం చేయాలి, బరువు తక్కువగా వుంటే పెంచుకునే ప్రయత్నం చేయాలి. పొగతాగడాన్ని పూర్తిగా ఆపివేయాలి, మద్యం తాగడాన్ని కూడా పూర్తిగా ఆపివేయాలి.



Click it and Unblock the Notifications