Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Saliva Pregnancy Test: లాలాజలంతో ప్రెగ్నెన్సీ టెస్ట్, ఉమ్మితో అమ్మతనం తెలుసుకోవచ్చు
ఇప్పటి వరకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాలంటే మెడికల్ షాపుల్లో అందుబాటులో ఉండే ప్రెగ్నెన్సీ కిట్లతో యూరిన్ డ్రాప్ వేసి తెలుసుకునే సౌకర్యం ఉండేది. దాంతో పాటు రక్త పరీక్ష ద్వారా కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవచ్చు. తాజాగా శాస్త్రవేత్తలు నోటి లాలాజలంతో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేలా వైద్యరంగంలో విప్లవాత్మకమైన కిట్ ను ఆవిష్కరించారు. ఈ కింట్ తాజాగా యూకేలో, ఐర్లాండ్ లో అందుబాటులోకి వచ్చింది.

మరింత తేలికగా పరీక్ష చేసుకునే వీలు:
ఇలా లాలాజలంతో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునే కిట్ రావడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. ఇప్పటి వరకు మూత్రం లేదా రక్తంతోనే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో నిర్ధారించేవారు. ఈ కొత్త కిట్ అందుబాటులోకి రావడంతో మరింత తేలికగా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునే అవకాశం వచ్చింది. ఇది సాంప్రదాయ పరీక్షలకు ప్రత్యామ్నాయంగా మారబోతోందని సదరు సంస్థ చెబుతోంది.
జెరూసలేంకు చెందిన స్టార్టప్ కంపెనీ తయారీ:
ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ను జెరూసలేంకు చెందిన సాలిగ్నోస్టిక్స్ అనే స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది. ఇది కరోనా టెస్టింగ్ కిట్ లను తయారు చేయడానికి ఉపయోగించే సాంకేతికతపై ఆధారపడి తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ ప్రత్యేకమైన కిట్ ను ఎప్పుడైనా, ఎక్కడైనా సులభంగా వాడే వీలు ఉంటుంది. ఈ కిట్ ను తయారు చేసిన సంస్థ దాదాపు 300 మందిపై క్లినికల్ ట్రయల్స్ చేసినట్లు వెల్లడించింది. 5 నుంచి 15 నిమిషాల్లోనే ఈ కిట్ ఫలితం చూపిస్తుందని తయారీ సంస్థ వెల్లడించింది. ఈయూలో మార్కెట్ కోసం ఇప్పటికే అనుమతి లభించగా.. ఎఫ్‌డీఏ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది.
థర్మామీటర్‌లా నోట్లో పెట్టుకుంటే చాలు:
ఈ ప్రెగ్నెన్సీ కిట్ ను థర్మామీటర్ లా నోట్లు పెట్టుకోవాలి. కింట్ లో వచ్చే స్టిక్ ను నోట్లో పెట్టుకుని కాసేపు ఉంచితే అది లాలాజలాన్ని సేకరిస్తుంది. ఆ తర్వాత దానిని ప్లాస్టిక్ ట్యూబ్ కు బదిలీ చేస్తుంది. అక్కడ బయోకెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అనంతరం ఫలితాన్ని వెల్లడిస్తుంది. పిండం అభివృద్ధి చెందడానికి గర్భశయాన్ని సిద్ధం చేయడంలో సహాయపడే ప్రత్యేకమైన హార్మోన్ అయిన hCG(హ్యూమన్ కోరియోనిక్ గోనాడోట్రోపిన్)ని గుర్తించే సాంకేతికతపై ఈ పరీక్ష ఆధారపడి ఉంటుందని సాలిగ్నోస్టిక్స్ కంపెనీ వెల్లడించింది.
కచ్చితత్వం ఎంతంటే..:
లాలాజలంతో ప్రెగ్నెన్సీ నిర్ధారించే ఈ కిట్ 95 - 97 శాతం కచ్చితత్వంతో ఫలితాన్ని చూపిస్తుందని తయారీ కంపెనీ పేర్కొంది. సాధారణ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లు 99 శాతం కచ్చితత్వంతో ఫలితాన్ని చూపిస్తుంది. అయితే ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ల కచ్చితత్వం.. ఏ సమయంలో టెస్ట్ చేసుకుంటున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.



Click it and Unblock the Notifications