Latest Updates
-
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా? -
ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.! -
గుంటూరు స్పెషల్ టిఫిన్స్ అల్లం పచ్చడి..ఒక్కసారి చేసుకుంటే నెల రోజులు నిల్వ! -
పులియబెట్టాల్సిన పనిలేదు.. దోశ పిండి లేకపోతే ఇన్స్టంట్గా ఈజీగా చేసుకునేలా.! -
గణేష్ పూజ తర్వాత అరుదైన లక్ష్మీ నారాయణ యోగం..వాళ్లకి స్వర్ణ యుగమే!
రుచి, ఆరోగ్యం పంచే ఓట్స్ ఉప్మా..బొంబాయి రవ్వ ఉప్మా కంటే 10 రెట్లు రుచి!
సాధారణంగా దక్షిణ భారతదేశంలో ఉప్మా అనేది చాలా ఫేమస్ బ్రేక్ ఫాస్ట్. రొటీన్ బొంబాయి రవ్వ ఉప్మా తినాలంటే ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండదు. మరి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే సులభమైన ప్రత్యామ్నాయం ఓట్స్ ఉప్మా. ఈ ఉప్మాను ఒక్కసారి మీ ఇంట్లో వారికి చేసి పెట్టండి. ఉప్మా వద్దు అనే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా ప్లేట్ ఖాళీ చేసేస్తారు. వారంలో రెండు మూడు రోజులు ఈ ఆరోగ్యకరమైన ఓట్స్ ఉప్మాను మీ డైట్ లో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి.

ఓట్స్ ఉప్మా తయారీకి కావలసిన పదార్థాలు
ఓట్స్ - 1 కప్పు
సన్నగా తరిగిన ఉల్లిపాయ - 1
కూరగాయల ముక్కలు (క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు) - అర కప్పు
పచ్చిమిర్చి - 2
సన్నగా తరిగిన అల్లం - చిన్న ముక్క
నూనె లేదా నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు- అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
శనగపప్పు - ఒక టేబుల్ స్పూన్
మినపపప్పు - ఒక టేబుల్ స్పూన్
కరివేపాకు - రెండు రెమ్మలు
కొత్తిమీర తరుగు - కొద్దిగా
పసుపు - పావు టీస్పూన్
నిమ్మరసం - ఒక టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు -ఒకటిన్నర కప్పు
కరీనా కపూర్ ఫేవరెట్ సూప్ ఇదే..బెలెడు ప్రయోజనాలు..ఎలా చేసుకోవాలంటే..
ఓట్స్ ఉప్మా తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి బాండీ పెట్టుకోండి. అందులో ఓట్స్ వేసి, మంటను సిమ్ లో ఉంచి 2-3 నిమిషాల పాటు దోరగా వేయించండి. ఓట్స్ కొద్దిగా రంగు మారి, కమ్మని వాసన రాగానే వాటిని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఉప్మా ముద్దగా కాకుండా పొడిపొడిగా వస్తుంది.
-ఇప్పుడు అదే బాండీలో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయండి. అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపపప్పు వేసి దోరగా వేయించండి. పప్పులు ఎర్రగా వేగి చిటపటలాడుతుండగా కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి వేసి బాగా కలపండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఉడికించండి.
-ఉల్లిపాయ కాస్త మెత్తబడ్డాక అందులో క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు, కొద్దిగా పసుపు వేసి కలుపుతూ రెండు నిమిషాలు మగ్గనివ్వండి. కూరగాయలు కాస్త వేగాక అందులో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టి నీటిని బాగా మరగనివ్వండి.
-నీళ్లు బాగా తెర్లుతున్నప్పుడు మంటను తగ్గించి, ముందుగా వేయించి పెట్టుకున్న ఓట్స్ ను కొద్దికొద్దిగా పోస్తూ, ఉండలు కట్టకుండా గరిటెతో నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మూత పెట్టి మరో 2 నుండి 3 నిమిషాలు ఉడికించండి. ఓట్స్ నీటినంతటినీ పీల్చుకుని మృదువుగా ఉడుకుతాయి.
-ఉప్మా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా కలపండి.
-అంతే ఎంతో గుమగుమలాడే, వేడివేడి ఓట్స్ ఉప్మా రెడీ
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
