Latest Updates
-
ఆరోగ్యానికి మహా బలం అందించే నువ్వుల బాదం లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే -
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Chanakya Niti: మహిళలు ఈ 5 విషయాలను రహస్యంగా ఉంచితేనే జీవితంలో తిరుగుండదు! -
ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు..ఇది కాకరకాయ ఫ్రైస్..ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు.. -
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి!
మ్యాగీ మసాలా సీక్రెట్ ఇదే.. ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
మ్యాగీ..ఈ పేరు వింటేనే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నోట్లో నీళ్లు ఊరుతాయి. మ్యాగీకి ఆ అద్భుతమైన రుచి ఎక్కడి నుంచి వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? అందులో ఉండే ఆ మసాలా ప్యాకెట్ వల్లే. ఆ ప్యాకెట్ చింపి వేస్తుంటే వచ్చే వాసనే మన ఆకలిని రెట్టింపు చేస్తుంది. మరి అంతటి రుచికరమైన మ్యాగీ మసాలాను ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా, ఆరోగ్యకరమైన పద్ధతిలో మన ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. బయట దొరికే మ్యాగీకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే హోమ్ మేడ్ మ్యాగీ మసాలా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

మ్యాగీ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు
ధనియాలు - అర కప్పు
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
సోంపు - 1 టీస్పూన్
మెంతులు - అర టీస్పూన్
మిరియాలు - 40 గింజలు
శొంఠి ముక్క - అర అంగుళం
లవంగాలు - 5
నల్ల యాలకులు (పెద్ద యాలకులు) - 1
పచ్చ యాలకులు - 3
పల్లీలు- 10
దాల్చిన చెక్క - 2 అంగుళాల ముక్క
బిర్యానీ ఆకులు - 3
కాశ్మీరీ ఎర్ర కారం - 1 టేబుల్ స్పూన్
పసుపు - 1 టేబుల్ స్పూన్
ఆమ్ చూర్ పౌడర్ (మామిడికాయ పొడి) - 1 టీస్పూన్
వెల్లుల్లి పొడి - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ పొడి (ఆనియన్ పౌడర్)- ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు
గోధుమ పిండి - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
చక్కెర - 1 టీస్పూన్
ఉప్పు - 2 టీస్పూన్లు
ఎంఎస్‌జి (అజినోమోటో) - 1 టేబుల్ స్పూన్
డ్రై పార్స్లీ - 1 టేబుల్ స్పూన్
మ్యాగీ మసాలా తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ పెట్టుకోండి. మంటను పూర్తిగా తక్కువలో ఉంచి పాన్ లో ధనియాలు, జీలకర్ర, సోంపు, మెంతులు, మిరియాలు, శొంఠి ముక్క, లవంగాలు, పెద్ద యాలకులు, పచ్చ యాలకులు, పల్లీలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి దోరగా వేయించండి. సన్నని మంటపై ఓపికగా వేయించడం వల్లే మసాలాలలోని అసలైన సువాసనలు బయటకు వస్తాయి.
-మసాలాలు వేగి, కమ్మటి వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆపేయండి. ఆ తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి.
-పూర్తిగా చల్లారిన మసాలా దినుసులను మిక్సీ జార్ లో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పొడికి కాశ్మీరీ కారం, పసుపు, ఆమ్ చూర్ పౌడర్, ఉల్లి-వెల్లుల్లి పొడులు, గోధుమ పిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, చక్కెర తదితర పొడి పదార్థాలన్నింటినీ జత చేయండి. ఇవన్నీ ఒకదానికొకటి బాగా కలవడానికి వీలుగా, మిక్సీని కేవలం 4 నుండి 5 సెకన్ల పాటు ఒక్కసారి బ్లెండ్ చేయండి.
-అంతే అద్భుతమైన రుచితో, ఇల్లంతా సువాసనలు వెదజల్లే హోమ్ మేడ్ మ్యాగీ మసాలా రెడీ.
-ఈ మసాలాను ఒక గాలి చొరబడని గాజు సీసాలో (ఎయిర్ టైట్ కంటైనర్) నిల్వ చేసుకుంటే చాలా రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటుంది. దీన్ని కేవలం నూడుల్స్ కే కాకుండా..ఫ్రైడ్ రైస్, ఆలూ ఫ్రై, వెజిటేబుల్ కూరల్లో వాడితే మీ వంటల రుచి అమాంతం పెరిగిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications