Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
5 నిమిషాల్లో టేస్టీ బ్రేక్ ఫాస్ట్..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం వేళ ఆరోగ్యకరమైన వంట చేసుకోవడానికి సమయం దొరకడమే కష్టంగా మారింది. ముఖ్యంగా గంటల తరబడి కూర్చుని పనిచేసే డెస్క్ జాబ్ ఉద్యోగులకు, శారీరక శ్రమ తక్కువగా ఉండే వారికి తీసుకునే ఆహారం చాలా తేలికగానూ, పోషకరితంగానూ ఉండాలి. మరి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే అల్పాహారం ఏదైనా ఉందా అంటే.. అదే ఓట్స్ పోహా.
సాధారణంగా మనం బియ్యం అటుకులతో పోహా చేసుకుంటాం. అందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ఓట్స్‌లో ఫైబర్, బీటా గ్లూకాన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే ఓట్స్ పోహా బరువు తగ్గాలనుకునే వారికి ఒక వరం లాంటిది. ఓట్స్ పోహా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
ఓట్స్ - ఒకటిన్నర కప్పు
కూరగాయలు - ఒకటిన్నర కప్పు ( క్యారెట్, బఠానీలు, బీన్స్,
ఉల్లిపాయ)
పచ్చిమిర్చి - 3
కరివేపాకు - 2 రెమ్మలు
ఆవాలు - అర టీస్పూన్
ఇంగువ - చిటికెడు
నూనె - 1 టేబుల్ స్పూన్
పసుపు - చిటికెడు
నిమ్మరసం - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - గార్నిష్ కోసం
తయారీ విధానం
-ముందుగా ఓట్స్ ను ఒక జల్లెడలో వేసి నీటితో ఒక్కసారి కడిగి వెంటనే నీరంతా వార్చేయాలి. ఓట్స్ మరీ మెత్తగా కాకుండా పొడిపొడిగా ఉండేలా చూసుకోవాలి. నీటిలో ఎక్కువసేపు నానబెట్టకూడదు.
-నీరు వార్చిన ఓట్స్ లో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా నిమ్మరసం వేసి చేతితో మెల్లగా కలపాలి. దీనివల్ల ఓట్స్ కు మసాలా బాగా పడుతుంది.
-స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, చిటికెడు ఇంగువ వేసి చిటపటలాడించాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కూరగాయ ముక్కలు,ఉల్లిపాయ, క్యారెట్, బఠానీలు వేసి వేయించాలి. కూరగాయలు త్వరగా ఉడకడానికి కొద్దిగా నీళ్లు చల్లి, మూతపెట్టి 2 నిమిషాలు సన్నని మంటపై మగ్గనివ్వాలి.
-కూరగాయలు మెత్తబడిన తర్వాత పక్కన పెట్టుకున్న మసాలా ఓట్స్ మిశ్రమాన్ని పాన్ లో వేయాలి. మంటను సిమ్ లో ఉంచి, కూరగాయల మిశ్రమంతో ఓట్స్ కలిసేలా మెల్లగా కలపాలి.
-ఓట్స్ వేడెక్కి, మెత్తబడే వరకు మరో 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి, వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. కావాలంటే తినేటప్పుడు మరికొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు.
-అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఓట్స్ పోహా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications