Latest Updates
-
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్
నవరాత్రి ఉపవాసంలో శక్తినిచ్చే హెల్తీ డ్రింక్స్ ఇవే..ఎలా చేసుకోవాలంటే
హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి. ఈ ఏడాది దసరా పండుగను అక్టోబర్ 2న జరుకుంటారు. దసరా పండుగ మొదటి తొమ్మిది రోజులను నవరాత్రులు అంటారు. శరన్నవరాత్రులు వచ్చేశాయంటే చాలు ఇంటా బయటా పండుగ వాతావరణం వెల్లివిరుస్తుంది. అమ్మవారిని కొలుస్తూ తొమ్మిది రోజుల పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండటం మన సంప్రదాయం. ఈ దీక్ష మనసుకి ప్రశాంతతను ఇచ్చినా, రోజంతా ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం నీరసించి, అలసిపోవడం సహజం.
ప్రత్యేకించి డీహైడ్రేషన్ సమస్య వేధించవచ్చు. అటువంటి సమయంలో మీ శరీరాన్ని ఉత్తేజంగా, తాజాగా ఉంచే కొన్ని అద్భుతమైన డ్రింక్స్ ఉన్నాయి. ఇవి కేవలం దాహాన్ని తీర్చడమే కాదు, ఉపవాసానికి అవసరమైన శక్తిని అందించి మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉంచుతాయి.

కొబ్బరి నీళ్లు - తక్షణ శక్తికి
ఉపవాసంలో అమృతంలా పనిచేసేవి కొబ్బరి నీళ్లు. ఒక గ్లాసు తాజా కొబ్బరి
నీళ్లలో కొద్దిగా నిమ్మరసం, నాలుగైదు పుదీనా ఆకులు వేసి కలిపి తాగండి.
ఇది శరీరంలోని ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేసి, తక్షణ శక్తిని అందించి,
మిమ్మల్ని రోజంతా తాజాగా ఉంచుతుంది.
మారేడు పండు షర్బత్ - ఒంటికి చలువ
ఉపవాసానికి ఇది ఒక సంప్రదాయ పానీయం. మారేడు పండు గుజ్జును నీటిలో బాగా
కలిపి వడకట్టాలి. ఆ రసంలో రుచికి తగినంత తేనె లేదా బెల్లం పొడి కలిపి
చల్లగా సేవించండి. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి, జీర్ణవ్యవస్థను
ఆరోగ్యంగా ఉంచుతుంది.
పెరుగు పండ్ల స్మూతీ - కడుపు నిండుగా
ఒక కప్పు చిక్కటి పెరుగులో ముక్కలు చేసిన అరటిపండు, ఆపిల్ లేదా
బొప్పాయి వేయండి. అవసరమైతే కొద్దిగా తేనె జోడించి, మిక్సీలో నున్నగా
బ్లెండ్ చేయండి. ఈ స్మూతీ కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడమే కాకుండా,
శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లను అందిస్తుంది.
పుదీనా నిమ్మరసం నీరు - శరీరం శుభ్రం
ఒక గ్లాసు చల్లటి నీటిలో ఒక చెక్క నిమ్మరసం పిండి, కొన్ని తాజా పుదీనా
ఆకులను నలిపి వేయండి. ఐదు నిమిషాల తర్వాత తాగితే, ఇది అద్భుతమైన
రిఫ్రెష్ మెంట్ ను ఇస్తుంది. శరీరాన్ని డిటాక్స్
చేసి, ఉపవాస సమయంలో తేలికగా అనిపించేలా చేస్తుంది.
బాదం పాలు - బలహీనతకు విరుగుడు
రాత్రంతా నానబెట్టిన బాదంపప్పులను మెత్తని పేస్ట్ లా చేసి,
గోరువెచ్చని పాలలో కలపండి. చిటికెడు యాలకుల పొడి, కొద్దిగా తేనె
జోడించి తాగండి. ఇది ఉపవాసం వల్ల కలిగే బలహీనత, అలసటను దూరం చేసి,
శరీరానికి బలాన్ని, పోషణను అందిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
