Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
10 నిమిషాల్లో చట్నీ పులావ్ ..రుచి అస్సలు మర్చిపోలేరు..ఎలా చేసుకోవాలంటే
రోజూ చేసుకునే పులావ్‌తో విసుగొచ్చిందా? ఏదైనా కొత్తగా, ఘుమఘుమలాడే వంటకం రుచి చూడాలనుకుంటున్నారా? అయితే చట్నీ పులావ్ ఓ సారి ట్రై చేసి తీరాల్సిందే. ఇంట్లో ఉండే అతి తక్కువ పదార్థాలతో, ఎంతో సులభంగా తయారు చేసుకోగల ఈ వంటకం మీ కుటుంబ సభ్యులందరినీ ఆశ్చర్యపరచడం ఖాయం. పచ్చని చట్నీతో కలిసిపోయే బాస్మతి బియ్యం రుచి, సుగంధ ద్రవ్యాల సువాసన మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. చట్నీ పులావ్ తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
నూనె/నెయ్యి - 5 టేబుల్ స్పూన్లు
నల్ల యాలకలు - 3
జీలకర్ర - 1 స్పూన్
తరిగిన వెల్లుల్లి - 2 టేబుల్ స్పూన్లు
బిర్యానీ ఆకు - 1
తరిగిన ఉల్లిపాయలు - 1 కప్పు
నీరు - 2 కప్పులు
బాస్మతి బియ్యం - 1 కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర ఆకులు - 3 కప్పులు
పుదీనా ఆకులు - 1 కప్పు
పచ్చిమిర్చి - మీ కారానికి తగినన్ని
తరిగిన అల్లం - 2 టేబుల్ స్పూన్లు
నల్ల ఉప్పు - 1 స్పూన్
నిమ్మరసం - 4 టేబుల్ స్పూన్లు
టమోటా - 1
చిన్న ఉల్లిపాయ - 1
జీలకర్ర పొడి - 2 స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - 6
ఉప్పు - రుచికి సరిపడా
వెన్న - 1 టేబుల్ స్పూన్
ఇంగువ - చిటికెడు

తయారీ విధానం
-ముందుగా అడుగు మందంగా ఉన్న పాన్ లో నూనె లేదా నెయ్యి వేసి
వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత అందులో నల్ల ఏలకులు, జీలకర్ర,
బిర్యానీ ఆకు వేసి మంచి సువాసన వచ్చేవరకు వేయించండి. ఇప్పుడు తరిగిన
ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేసి బంగారు రంగులోకి మారేంత వరకు
వేగించాలి.
-తర్వాత అందులో కొద్దిగా నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి.
-నీళ్లు మరగడం ప్రారంభించాక అందులో ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి మెల్లగా కలపండి. మంటను బాగా తగ్గించి పాన్ పై మూతపెట్టి సుమారు 15-20 నిమిషాల పాటు అన్నం పొడిపొడిగా ఉడికే వరకు ఉంచండి.
-అన్నం ఉడికేలోపు, చట్నీని రెడీ చేసుకోండి. ఇందుకోసం ఒక మిక్సీ జార్ లో కొత్తిమీర, పుదీనా ఆకులు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, టమోటా, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, సాధారణ ఉప్పు, నిమ్మరసం వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ మరీ గట్టిగా అనిపిస్తే, కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు.
-ఇప్పుడు ఒక చిన్న పాన్ లో వెన్న వేసి కరిగించి, చిటికెడు ఇంగువ వేయండి. ఇంగువ సువాసన రాగానే సిద్ధం చేసుకున్న పచ్చని చట్నీని వేసి ఒక్క నిమిషం పాటు ఉడికించండి.
-అదే పాన్ లో మనం ఉడికించుకున్న పులావ్ ను వేసి చట్నీ అన్నం మెతుకులన్నింటికీ బాగా పట్టేలా, అన్నం విరగకుండా మెల్లగా కలపండి. చట్నీలోని తేమ ఇగిరిపోయే వరకు చిన్న మంట మీద ఉంచండి. అంతే ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే చట్నీ పులావ్ రెడీ. దీనిపై సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొత్తిమీరతో అలంకరించి, వేడివేడిగా రైతాతో వడ్డిస్తే, ఆహా ఏమి రుచి అనాల్సిందే
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications