Latest Updates
-
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు!
రెగ్యులర్ ఇడ్లీ బోర్ కొట్టిందా? కర్ణాటక స్పెషల్ స్పైసీ గుమ్మడికాయ ఇడ్లీ ట్రై చేయండి!
దక్షిణ భారత వంటకాలు అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఇడ్లీ, దోశ. ప్రపంచవ్యాప్తంగా వీటికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే మీరు ఎప్పుడూ తినే రెగ్యులర్ ఇడ్లీ కాకుండా, కొంచెం కొత్తగా, ఇంకాస్త స్పైసీగా ఏదైనా ప్రయత్నించాలనుకుంటున్నారా? అయితే కర్ణాటక స్పెషల్ స్పైసీ గుమ్మడికాయ ఇడ్లీ ట్రై చేయండి.
దీనిని కర్ణాటకలో ఇడ్లీకి ఒక ప్రత్యేకమైన వెర్షన్ గా చెప్పుకోవచ్చు. గుమ్మడికాయలోని సహజమైన తీపి, పచ్చిమిర్చి ఘాటు, కొబ్బరి నూనె సువాసనల కలయిక ఈ ఇడ్లీని అద్భుతంగా మారుస్తుంది. గుమ్మడికాయ ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు
తురిమిన గుమ్మడికాయ - 2 కప్పులు
బొంబాయి రవ్వ- 1 కప్పు
పెరుగు - అర కప్పు
పచ్చిమిర్చి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
అల్లం పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
పసుపు - పావు టేబుల్ స్పూన్
ఆవాలు - అర టేబుల్ స్పూన్
కరివేపాకు - 6 నుండి 8 రెమ్మలు
కొబ్బరి నూనె - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
బేకింగ్ సోడా -అర టేబుల్ స్పూన్
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని కొబ్బరి నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలాడనీయండి. ఇప్పుడు తురిమిన గుమ్మడికాయను వేసి 2-3 నిమిషాల పాటు వేయించాలి. ఇలా చేయడం వల్ల గుమ్మడికాయలోని పచ్చి వాసన పోయి, కమ్మటి వాసన వస్తుంది.
-ఒక పెద్ద గిన్నెలో రవ్వ, పెరుగు, పసుపు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.
-ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న గుమ్మడికాయ మిశ్రమాన్ని ఈ రవ్వ పిండిలో వేసి బాగా కలపండి. రవ్వ నీటిని పీల్చుకుని మెత్తబడటానికి ఈ పిండిని సుమారు 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి.
-ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి వేడి చేయండి. ఇడ్లీ ప్లేట్లకు నూనె లేదా నెయ్యి రాసి సిద్ధం చేసుకోండి. పిండిని ఇడ్లీ ప్లేట్లలో వేసే ముందు మాత్రమే ఈనో లేదా వంట సోడా వేసి మెల్లగా కలపండి. వెంటనే పిండిని ఇడ్లీ ప్లేట్లలో వేసి ఆవిరి మీద 12 నుండి 15 నిమిషాల పాటు ఉడికించండి.
-ఇడ్లీలు ఉడికిన తర్వాత స్టవ్ ఆపి ప్లేట్లను బయటకు తీసి కాసేపు చల్లారనివ్వండి. వేడి మీద తీస్తే ఇడ్లీలు విరిగిపోయే అవకాశం ఉంది. అంతే గుమ్మడికాయ ఇడ్లీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
