డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.!

మన శరీరానికి కావాల్సిన విటమిన్లు రెండు రకాలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. వాటిలో కొవ్వులో కరిగే విటమిన్లు ఒకటి, ఇంకోటి నీటిలో కరిగే విటమిన్లు. కొవ్వులో కరిగే విటమిన్లు ఏ, డీ, ఈ, కే.. ఇవి మన శరీరంలో కొవ్వు రూపంలో ఆరు నెలల పాటు నిల్వ ఉంటాయి. ఇక నీటిలో కరిగే విటమిన్స్‌ బి, సి. వీటిని మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఉంటే మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతాయి. ఇక, ఈ విటమిన్స్‌ శరీరంలోని ప్రతి భాగానికి, అవయవ పనితీరుకు చాలా అవసరం. మరి వీటిని విడివిడిగా తీసుకోవడం కంటే అన్నీ ఒకే కప్పులో లభించేలా తీసుకుంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని డా. మంతెన సత్యనారాయణ సూచిస్తున్నారు.

A multivitamin nut salad that provides a full range of vitamins for everyone

చాలా మందిలో విటమిన్‌ లోపం కారణంగా పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అందుకే డాక్టర్స్‌ ఇవన్నీ ఒకేసారి లభించేలా మల్టీ విటమిన్‌ క్యాప్సూల్స్‌ ఇస్తుంటారు. కానీ వీటిని ట్యాబ్లెట్స్‌ రూపంలో తీసుకునే కంటే మన ప్రకృతి అందించిన సహజ సిద్ధమైన ఆహార పదార్థాల రూపంలో తీసుకుంటే శరీరానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు అందిస్తుందని డా. మంతెన చెబుతున్నారు. ఒక్కో పదార్థంలో ఒక్కో విటమిన్‌ ఉంటుంది. ఈ పదార్థాలన్నిటిని కలిపి తీసుకుంటే శరీరానికి కావాల్సిన విటమిన్స్‌ అన్నీ ఒకేసారి అందుతాయి.

రాత్రి అన్నం మిగిలితే ఇలా ఊతప్పం చేయండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తింటారు!

పిల్లల్లో మెదడు అభివృద్ధి, ఎత్తు పెరుగుదలకు, మహిళల్లో బలానికి, పురుషుల్లో ఎనర్జీ లెవెల్స్‌కి, స్పోర్ట్స్‌ పర్సన్స్‌కి దృఢత్వం కోసం, వృద్ధుల్లో డయాబెటిస్‌, బీపీ ఇలా అన్ని రకాల వయసు వారికి సమపాళ్లలో అందించే ప్రకృతి సహజసిద్ధ వరం మల్టీ విటమిన్‌ నట్‌ సలాడ్‌. ఈ మల్టీవిటమిన్‌ సలాడ్‌ను తరచూ తీసుకున్నట్లయితే మందుల అవసరం ఉండదు. రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు దోహదపడుతుంది. ఈ మల్టీ విటమిన్‌ నట్‌ సలాడ్‌ను ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..

మల్టీ విటమిన్‌ సలాడ్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు

మొలకెత్తిన పెసర్లు- అర కప్పు
మొలకెత్తిన అలసందలు- అర కప్పు
నానబెట్టిన వేరుశనగలు- అర కప్పు
నానబెట్టిన బాదం పప్పులు- పావు కప్పు
నానబెట్టిన జీడిపప్పులు- పావు కప్పు
నానబెట్టిన పిస్తా పప్పులు- పావు కప్పు
నానబెట్టిన కర్జూర ముక్కలు- కప్పు
డ్రై కిస్‌మిస్‌- పావు కప్పు
యాపిల్‌ ముక్కలు- కప్పు
బొప్పాయి ముక్కలు- కప్పు
కర్బూజ ముక్కలు- కప్పు
దానిమ్మ గింజలు- కప్పు

మల్టీ విటమిన్‌ సలాడ్‌ తయారీ విధానం

A multivitamin nut salad that provides a full range of vitamins for everyone

మల్టీ విటమిన్‌ సలాడ్‌ కోసం ముందుగా పెసర్లు, అలసందలను ముందురోజు ఉదయం విడివిడిగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని అదే రోజు రాత్రి వేరువేరుగా తడి క్లాత్‌లో మొలకలు వచ్చే విధంగా కట్టి పెట్టుకోవాలి. అదే రోజు రాత్రి వాటిని వేరుశనగ, బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా పప్పులు, ఎండు ఖర్జూర, విడివిడిగా బౌల్స్‌లో రాత్రంతా నానెబెట్టుకోవాలి.

రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు!

మరుసటి రోజు ఉదయానికి పెసర్లు, అలసందలు మంచిగా మొలకలు వచ్చి సిద్ధంగా ఉంటాయి. వేరశనగ, బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా పప్పులు, ఎండు ఖర్జూర మంచిగా ఉబ్బుతూ వస్తాయి. బాదం పప్పులను పొట్టు తీసి పెట్టుకోవాలి.

A multivitamin nut salad that provides a full range of vitamins for everyone

నానిన జీడిపప్పులు, పిస్తాపప్పులు, ఎండు ఖర్జూరను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి. యాపిల్‌, బొప్పాయి, కర్బూజ పండ్లను చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. దానిమ్మ గింజలను తీసి పెట్టుకోవాలి.

వీటన్నిటినీ వెడల్పాటి బౌల్‌ తీసుకుని ఒక్కొక్కటిగా పైన చెప్పిన కొలతల్లో వేసుకుని స్పూన్‌తో కలుపుకోవడమే. మల్టీ విటమిన్‌ నట్‌ సలాడ్‌ రెసిపీ రెడీ.

[ of 5 - Users]
Desktop Bottom Promotion