Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
చికెన్ మటన్ ను మరిపించే రుచి.. ఒక్కసారి తింటే వదలరు..హోటల్ స్టైల్ పల్లీ కుర్మా
చపాతీ, దోస వంటివి వాటిలోకి ఎప్పుడూ ఒకే రకమైన పప్పు, బంగాళదుంప కూర, చట్నీ లేదా పచ్చడి తిని తిని విసుగొచ్చిందా? చపాతీలోకి కాస్త కొత్తగా, ప్రత్యేకంగా ఏదైనా ప్రయత్నించాలనిపిస్తోందా? చికెన్ లేదా మటన్ కుర్మాను సైతం మరిపించేంత రుచికరమైన పల్లీ కుర్మాను ట్రై చేయండి. మీ ఇంట్లో కేవలం ఒక కప్పు వేరుశనగపప్పు, కాస్త కొబ్బరి ఉంటే చాలు.. ఎవరూ ఊహించని అద్భుతమైన రుచితో, చిక్కటి గ్రేవీతో హోటల్ స్టైల్ వేరుశనగ కుర్మాను క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు. ఇది తయారు చేయడం చాలా సులభం. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ దీని రుచికి దాసోహం అనాల్సిందే. రుచికరమైన వేరుశనగ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
వేరుశనగపప్పు (పచ్చివి)- 1 కప్పు
ఉల్లిపాయలు- అర కప్పు
పచ్చిమిర్చి - 2
పచ్చి కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు
అల్లం తరుగు - 1 టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 4-5 (సన్నగా తరిగినవి)
లవంగాలు - 2
దాల్చిన చెక్క - చిన్న ముక్క
యాలకులు - 1
జీలకర్ర - 1 టీస్పూన్
నూనె - 2 టేబుల్ స్పూన్లు
పసుపు - పావు టీస్పూన్
కారం - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - అవసరమైనంత

తయారుచేయు విధానం
-ముందుగా వేరుశనగపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్ లో వేసి కొద్దిగా ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి 3-4 విజిల్స్ వచ్చేవరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి దోరగా వేయించాలి. ఆ మసాలా సువాసన వంటగది అంతా గుమగుమలాడుతుండగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేపుకోవాలి.
-ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో అల్లం, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయేవరకు ఒకటి రెండు నిమిషాలు వేయించాలి.
-ఆ తర్వాత పసుపు, కారం పొడి వేసి తక్కువ మంట మీద బాగా కలపాలి. మసాలాలు మాడిపోకుండా చూసుకోండి.
-ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న వేరుశనగపప్పును నీళ్లతో సహా ఈ మసాలా మిశ్రమంలో వేయాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి అంతా ఒకసారి బాగా కలపండి.
-కడాయిపై మూత పెట్టి మీడియం మంట మీద సుమారు 10 నిమిషాల పాటు ఉడికించాలి. గ్రేవీ చిక్కబడి నూనె పైకి తేలే వరకు ఉడికిస్తే కుర్మాకు అద్భుతమైన రుచి వస్తుంది.
-చివరగా స్టవ్ ఆఫ్ చేసే ముందు పైన తాజా కొబ్బరి తురుము చల్లితే ఆ రుచే వేరు. అంతే వేడివేడిగా, ఘుమఘుమలాడే వేరుశనగ కుర్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
