Latest Updates
-
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా..
చలికి వణుకుతున్నారా? వేడి వేడి అన్నంలోకి ఈ మైసూర్ రసం తింటే స్వర్గమే
బయట వాతావరణం చల్లగా ఉంటే, మనసు మాత్రం వేడివేడిగా ఏదైనా తినాలని కోరుకుంటుంది. ఇలాంటి సమయంలో వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, ఘాటైన రసం వేసుకుని తింటే ఆ ఆనందమే వేరు. ఇది కేవలం నాలుకకు రుచిని ఇవ్వడమే కాదు, జలుబు, దగ్గు వంటి వాటికి మంచి ఉపశమనాన్ని కూడా ఇస్తుంది.
రెగ్యులర్ గా చేసుకునే చింతపండు చారు లేదా టమాటా రసం తిని తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి రొటీన్ కి భిన్నంగా మైసూర్ రసం ట్రై చేయండి. సాధారణ రసంతో పోలిస్తే దీని రుచి, వాసన పూర్తిగా వేరుగా ఉంటాయి. మైసూర్ రసం తయారీ విధానాన్ని ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
కందిపప్పు- పావు కప్పు
టమోటాలు - 2
చింతపండు - పెద్ద ఉసిరికాయ సైజు
పచ్చి కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు
వేరుశనగలు (పల్లీలు) - 2 టేబుల్ స్పూన్లు
మిరియాలు - 2 టేబుల్ స్పూన్లు
ఎండు మిరపకాయలు - 5
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
అల్లం ముక్క - చిన్నది
ఉప్పు - రుచికి సరిపడా
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
మెంతులు - చిటికెడు
కొత్తిమీర - గుప్పెడు
బెల్లం - చిన్న ముక్క
కరివేపాకు - 2 రెమ్మలు
పసుపు - చిటికెడు
తయారీ విధానం
-ముందుగా కందిపప్పును శుభ్రంగా కడగాలి.
-ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో కందిపప్పు, చిటికెడు పసుపు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించిన పప్పును బాగా మెదిపి పక్కన పెట్టుకోండి.
-టమోటాలను, చింతపండును విడివిడిగా లేదా కలిపి నీటిలో ఉడకబెట్టండి. అవి మెత్తబడ్డాక వాటి నుండి రసాన్ని పిండి, సుమారు 3 కప్పుల నీటిని సిద్ధం చేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి అల్లం ముక్కలు, మిరియాలు, వేరుశెనగలు, ఎండు మిరపకాయలు, ధనియాలు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి పచ్చి కొబ్బరి తురుము,జీలకర్ర కూడా వేసి బరకగా పొడి చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక లోతైన గిన్నె పెట్టి అందులో చింతపండు-టమాటా రసం పోసి, అందులో రుచికి సరిపడా ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడి వేసి మీడియం మంటపై మరిగించాలి. పచ్చి వాసన పోయే వరకు మరిగించాక, మెదిపి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని ఇందులో కలపాలి.
-రసం మరుగుతున్నప్పుడు చిన్న బెల్లం ముక్క వేయండి. ఇది పులుపు, కారాలను బ్యాలెన్స్ చేసి కమ్మని రుచిని ఇస్తుంది. మీకు ఇంకాస్త కారం కావాలంటే ఒక పచ్చిమిర్చిని చీల్చి వేసుకోవచ్చు. రసం నురగలు కక్కుతూ పైకి వస్తున్నప్పుడు స్టవ్ ఆపేయండి.
-చివరగా చిన్న పాన్ లో నెయ్యి వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి రసంలో కలపాలి. పైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లితే గుమగుమలాడే మైసూర్ రసం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications