Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
ఇడ్లీ, దోశల కంటే ముందే మన పూర్వీకులు తిన్న బెస్ట్ టిఫిన్ ఇదే..ఇనుములాంటి బలం..ఎలా చేసుకోవాలంటే..
తెలుగు వారి ఇళ్లల్లో టిఫిన్ అంటే వెంటనే గుర్తొచ్చేవి ఇడ్లీ, దోశ. కానీ వీటికంటే ముందు, వీటికంటే ఆరోగ్యకరమైన ఒక వంటకం మన పూర్వీకుల కాలంలో రాజ్యమేలేది. అదే ఆవిరి కుడుము. పేరులోనే ఉన్నట్లుగా ఆవిరి మీద ఉడికించే కుడుము ఇది. నూనె చుక్క కూడా వాడకుండా, కేవలం ఆవిరితోనే తయారయ్యే ఈ ఆహారం ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.
పూర్వం ఎవరికైనా జ్వరం వచ్చినా, కడుపులో ఇబ్బందిగా ఉన్నా అమ్మమ్మలు, నానమ్మలు చేసిపెట్టే మొదటి ఆహారం ఇదే. ఇది సులభంగా జీర్ణమవ్వడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఆవిరి కుడుము చూడటానికి ఇడ్లీలాగే అనిపించినా దీని తయారీలోనూ, రుచిలోనూ చిన్నపాటి తేడాలు ఉంటాయి. ఇది ఇడ్లీ కంటే పరిమాణంలో పెద్దదిగా, మెత్తగా ఉంటుంది. ఆవిరి కుడుము ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-మినపగుళ్లు
-బియ్యం
-నీళ్లు
-ఉప్పు
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు మినపగుళ్లు, సగం కప్పు కంటే కొంచెం తక్కువగా బియ్యం వేసి ఇందులో నీళ్లు పోసి రెండుసార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత అందులో నీళ్లు పోసి 6 గంటలు లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి.
-తర్వాత నానిన మినపప్పు,బియ్యంని మిక్సీ గిన్నెలో వేసి ఇందులోనే కొంచెం ఉప్పు వేసి తగినన్ని నీళ్లు కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని కొంచెం బరకగా, గారెల పిండి కంటే కొంచెం పల్చగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి.
-ఈ పిండి పులవాల్సిన అవసరం లేదు, ఇడ్లీ పిండి లాగా ముందే రుబ్బుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోకూడదు, రుబ్బుకున్న వెంటనే ఆవిరి కుడుము చేసుకోవాలి.
-ఆవిరి కుడుములు చేసుకోడానికి ఒక సపరేట్ పాత్ర ఉంటుంది. అది లేనివాళ్లు ఒక గిన్నెలో అర లీటరు నీళ్లు పోసుకొని గిన్నె మీద తడి కాటన్ క్లాత్ వేసుకొని కదలకుండా క్లాత్ ని తాడుతో కట్టుకోండి. క్తాత్ మధ్యలో కొంచెం వత్తుకొని అందులో 3 గరిటెల పిండిని వేసుకోవాలి. చుట్టూ ఎక్స్ ట్రా ఉన్న క్లాత్ ని కుడుముపై కప్పేయాలి.దీనిమీద మూత లేదా సరిపోయే గిన్నె బోర్లించాలి.
-15 నిమిషాలు తక్కువ, మీడియం మంట మీద ఉడికించాలి. తర్వాత క్లాత్ ని తీసి చాకుతో లేదా టూత్ పిక్ తో గుచ్చి చూస్తే అంటుకోకుండా వస్తే ఉడికినట్లే. అంతే హెల్దీ ఆవిరి కుడుము రెడీ.
-దీనిని కారప్పొడి,నెయ్యితో కలిపి తింటే చాలా బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications