For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలూ పన్నీర్ కోఫ్తా రిసిపి : వీడియో..

Posted By: Lekhaka
|

ఉత్తరభారత సంప్రదాయ స్నాక్ ఆలూ పన్నీర్ కోఫ్తాను బంగాళదుంపలు మరియు పన్నీర్ తో తయారుచేస్తారు. దీన్ని పండగలు, పార్టీలు, ఉత్సవాలప్పుడు తయారుచేస్తారు. దీన్ని టీతో పాటు ఆనందంగా తింటారు.

కానీ, ముఖ్యమైన విషయం ఏంటంటే పండగలప్పుడు చేసేటప్పుడు ఉల్లి, వెల్లుల్లిని వాడరు. మిగతాసమయాలలో వాటిని కూడా వాడతారు.

ఆలూ పనీర్ కోఫ్తాను ఉడికించిన పనీర్, ఆలూను, రకరకాల దినుసులతో కలిపి ఓవల్ ఆకారపు ముద్దల్లో వేయించి చేస్తారు. దీన్ని టమాటా సాస్ లేదా ఏదన్నా చట్నీతో కలిపి తింటారు. పుదీనా చట్నీ దీంతో కలిపి తింటే చాలా రుచికరంగా ఉంటుంది.

స్టెప్ బై స్టెప్ విధానంతో కూడిన వీడియో రెసిపిని చూసి నేర్చుకోండి.

ఆలూ పన్నీర్ కోఫ్తా తయారీ విధానం । పన్నీర్ కోఫ్తా రెసిపి (ఉల్లి వెల్లుల్లి లేకుండా) । బంగాళదుంపలు కూరిన పన్నీర్ కోఫ్తా। పనీర్ కోఫ్తా గ్రేవీ లేకుండా
ఆలూ పన్నీర్ కోఫ్తా తయారీ విధానం । పన్నీర్ కోఫ్తా రెసిపి (ఉల్లి వెల్లుల్లి లేకుండా) । బంగాళదుంపలు కూరిన పన్నీర్ కోఫ్తా। పనీర్ కోఫ్తా గ్రేవీ లేకుండా
Prep Time
15 Mins
Cook Time
20M
Total Time
35 Mins

Recipe By: మీనా బంఢారి

Recipe Type: చిరుతిళ్ళు

Serves: 6 ముక్కలు

Ingredients
  • ఉడికించిన బంగాళదుంపలు (చెక్కుతీసినవి) - 2

    పన్నీర్ - 100గ్రాములు

    రాళ్ళ ఉప్పు - 2చెంచాలు

    పాలపొడి -1చెంచా

    పొడిచేసిన నల్ల మిరియాలు - 2చెంచాలు

    ఎర్ర కారం - 1చెంచా

    పచ్చిమిర్చి (బాగా తరిగినది) - 1చెంచా

    కొత్తిమీర (సన్నగా తరిగినది) - 1చెంచా

    మొక్కజొన్న పిండి -2చెంచాలు + కోటింగ్ కి

    డ్రైఫ్రూట్ల మిశ్రమం (తరిగినవి) -1/4వ కప్పు

    నూనె - వేయించటానికి

How to Prepare
  • 1. ఉడికించిన బంగాళదుంపలను ఒక కలిపే గిన్నెలో వేయండి.

    2. పన్నీర్ ను వేసి బాగా ఉండలుకట్టకుండా కలపండి.

    3. రాళ్ళ ఉప్పు, పాలపొడిని జతచేయండి.

    4. పొడిచేసిన నల్ల మిరియాలు, ఎండుకారాన్ని వేయండి.

    5. ఇంకా, పచ్చిమిర్చి, కొత్తిమీరను వేయండి.

    6. రెండు చెంచాల మొక్కజొన్న పొడిని వేసి బాగా కలపండి.

    7. ఈ మిశ్రమాన్ని రెండుగా విభజించి చేతులతో ముద్దలుగా చేయండి.

    8. మధ్యలో మీ వేలితో గుంటను చేయండి.

    9. డ్రై ఫ్రూట్ల మిశ్రమాన్ని ఒక చెంచాడు అందులో వేయండి.

    10. దాన్ని మూసేసి ఓవల్ ఆకారంలో ముద్దగా వత్తండి.

    11. ఒక పళ్ళెంలో మొక్కజొన్న పిండిని కోటింగ్ లా రాయండి.

    12. కోఫ్తాపై కూడా ఈ పిండిని రాయండి.

    13. తర్వాత కోఫ్తాలను ఫ్రిజ్ లో అరగంట ఉండనివ్వండి.

    14. నూనెను వేయించడానికి బాండీలో వేడిచేయండి.

    15. ఈ కోఫ్తాలను ఒకదాని తర్వాత మరొకటి వేయించండి.

    16. రెండు వైపులా బాగా వేగనివ్వండి.

    17. గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి బయటకి తీయండి.

    18. వేడిగా వడ్డించండి.

Instructions
  • 1.పాల పొడి బదులు ఎండుకొబ్బరి వేసి కోఫ్తాను మరింత రుచికరం చేయవచ్చు.
  • 2. నచ్చిన డ్రైఫ్రూట్ ను వాడవచ్చు.
  • 3.మామూలు రోజుల్లో వండేటట్లయితే ఉల్లి, వెల్లుల్లి వాడవచ్చు.
Nutritional Information
  • వడ్డించే పరిమాణం - ఒకటి
  • క్యాలరీలు - 208 క్యాలరీలు
  • కొవ్వు - 20గ్రాములు
  • ప్రొటీన్ - 10 గ్రాములు
  • కార్బొహైడ్రేట్లు - 40గ్రాములు
  • ఫైబర్ - 3గ్రాములు

స్టెప్ బై స్టెప్ - ఆలూ పన్నీర్ కోఫ్తా ఎలా చేయాలి

1. ఉడికించిన బంగాళదుంపలను ఒక కలిపే గిన్నెలో వేయండి.

2. పన్నీర్ ను వేసి బాగా ఉండలుకట్టకుండా కలపండి.

3. రాళ్ళ ఉప్పు, పాలపొడిని జతచేయండి.

4. పొడిచేసిన నల్ల మిరియాలు, ఎండుకారాన్ని వేయండి.

5. ఇంకా, పచ్చిమిర్చి, కొత్తిమీరను వేయండి.

6. రెండు చెంచాల మొక్కజొన్న పొడిని వేసి బాగా కలపండి.

7. ఈ మిశ్రమాన్ని రెండుగా విభజించి చేతులతో ముద్దలుగా చేయండి.

8. మధ్యలో మీ వేలితో గుంటను చేయండి.

9. డ్రై ఫ్రూట్ల మిశ్రమాన్ని ఒక చెంచాడు అందులో వేయండి.

10. దాన్ని మూసేసి ఓవల్ ఆకారంలో ముద్దగా వత్తండి.

11. ఒక పళ్ళెంలో మొక్కజొన్న పిండిని కోటింగ్ లా రాయండి.

12. కోఫ్తాపై కూడా ఈ పిండిని రాయండి.

13. తర్వాత కోఫ్తాలను ఫ్రిజ్ లో అరగంట ఉండనివ్వండి.

14. నూనెను వేయించడానికి బాండీలో వేడిచేయండి.

15. ఈ కోఫ్తాలను ఒకదాని తర్వాత మరొకటి వేయించండి.

16. రెండు వైపులా బాగా వేగనివ్వండి.

17. గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి బయటకి తీయండి.

18. వేడిగా వడ్డించండి.

[ 4 of 5 - 84 Users]
English summary

Aloo Paneer Kofta Recipe | Paneer Kofta Recipe (No Onions No Garlic) | Stuffed Aloo Paneer Kofta | Paneer Kofta (Without Gravy)

Aloo paneer kofta is a traditional North Indian snack that is prepared during festivals and regular parties and celebrations. Watch the video
Desktop Bottom Promotion