Latest Updates
-
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్!
ఉసిరి-బీట్‌రూట్ జ్యూస్..మీ ఆరోగ్యాన్ని మార్చేసే మ్యాజిక్ డ్రింక్..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్!
మారుతున్న జీవనశైలి, వాతావరణ కాలుష్యం, ఉరుకులు పరుగుల జీవితంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. ఇలాంటి తరుణంలో కృత్రిమ పానీయాల కంటే.. ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధమైన ఆహారమే శ్రీరామరక్ష. అటువంటి అద్భుతమైన ప్రకృతి వరాలలో ఉసిరి,బీట్ రూట్ ముందు వరుసలో ఉంటాయి. వీటిలో దాగి ఉన్న అపారమైన ఔషధ గుణాల వల్లే డాక్టర్లు, డైటీషియన్లు వీటిని క్రమం తప్పకుండా తీసుకోమని సూచిస్తుంటారు.
ఉసిరి,బీట్ రూట్ కలయికతో తయారు చేసే జ్యూస్ మన శరీరానికి ఒక మ్యాజిక్ డ్రింక్ లాగా పనిచేస్తుంది. ఈ జ్యూస్ తయారు చేయడం చాలా తేలిక. ఐదు నిమిషాల్లోనే దీన్ని సిద్ధం చేసుకోవచ్చు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఉసిరి,బీట్ రూట్ జ్యూస్ ను ఇంట్లోనే అత్యంత సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
తరిగిన బీట్ రూట్ ముక్కలు - ఒక కప్పు
తరిగిన ఉసిరి ముక్కలు - ఒక కప్పు
తరిగిన అల్లం - అర అంగుళం ముక్క
తాజా పుదీనా ఆకులు - 6
వేయించిన జీలకర్ర పొడి - అర టీస్పూన్
నల్ల ఉప్పు- అర టీస్పూన్
నిమ్మరసం - కొద్దిగా
తేనె - రుచికి తగినంత
నీళ్లు - ఒక కప్పు
తయారీ విధానం
-ముందుగా మిక్సీ జార్ లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు, ఉసిరికాయ ముక్కలు, అల్లం ముక్కలు, తాజా పుదీనా ఆకులను కూడా అందులో వేసి ఈ మిశ్రమాన్ని మెత్తగా బ్లెండ్ చేయండి. అన్నీ కొద్దిగా నలిగిన తర్వాత, అందులో ఒక కప్పు నీరు పోసి మళ్లీ మిక్సీ పట్టండి.
-ఈ జ్యూస్ రుచిని, పోషక విలువలను మరింత పెంచడానికి మిక్సీ గిన్నెలో ఉన్న మిశ్రమానికి వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా తేనె కలిపి అన్ని పదార్థాలు ఒకదానితో ఒకటి బాగా కలిసేలా గ్రైండ్ చేయండి.
-తయారైన జ్యూస్ ను ఒక గ్లాసులోకి వడకట్టండి. అంతే బీట్ రూట్-ఉసిరి జ్యూస్ రెడీ.
ఆరోగ్య ప్రయోజనాలు
రోజూ ఒక గ్లాసు ఈ జ్యూస్ తాగడం వల్ల మీ శరీరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి.
రోగనిరోధక శక్తి: ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడి, మీ రోగనిరోధక వ్యవస్థను ఉక్కులా మారుస్తుంది.
రక్తహీనతకు చెక్: బీట్‌రూట్‌లో ఐరన్ శాతం అధికం. రక్తహీనత (ఎనీమియా)తో బాధపడేవారు ఈ జ్యూస్‌ను వారి రోజువారీ డైట్‌లో చేర్చుకుంటే వేగంగా రక్త వృద్ధి కలుగుతుంది.
గుండె, జీర్ణకోశ ఆరోగ్యం: ఈ రసం గుండెను పదిలంగా ఉంచడమే కాకుండా, కడుపులోని వ్యర్థాలను తొలగించి జీర్ణక్రియను అద్భుతంగా మెరుగుపరుస్తుంది.
బరువు తగ్గింపు: అధిక బరువుతో బాధపడేవారికి ఇది గొప్ప వరం. బరువు తగ్గే ప్రయాణంలో ఈ జ్యూస్ శరీరంలోని మలినాలను (టాక్సిన్స్) బయటకు పంపి, కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
Disclaimer: ఈ కథనంలోని చిట్కాలు సాధారణ సమాచారం ప్రయోజనాల కోసం మాత్రమే. మీ ఆహార అలవాట్లలో ఏవైనా మార్పులు చేసే ముందు మీ డాక్టర్ ని సంప్రదించడం ఉత్తమం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









