రసం, సాంబార్‌ రుచిని మరిపించే కేరళ స్టైల్‌ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!

కేరళ స్టైల్‌ వంటకాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. వారు చేసే ప్రతి వంటకంలోనూ కొబ్బరి నూనె వాడతారని తెలిసిందే. అందుకే మన తెలుగు వంటకాలకు, కేరళ వంటకాలకు రుచిలో చాలా తేడా ఉంటుంది. అయితే ఆ వంటకాలు రుచి చూడాలంటే కేరళ వెళ్లాల్సిందేనా.. అవసరం లేదు.. మన కిచెన్‌లోనే ఆ రాష్ట్ర వంటకాల ఘుమఘుమలను ఆస్వాదించవచ్చు. అలాంటి అద్భుతమైన ఒక రెసిపీ ఉల్లిపాయ పులుసు. కేరళ పద్ధతిలో ఇలా చేసి చూడండి… వేడివేడి అన్నంలోకి లొట్టలేసుకుంటూ తినేస్తారు..

An amazing Kerala-style onion curry that pairs perfectly with rice

కేరళ స్టైల్‌ ఉల్లిపాయ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు

ఉల్లిపాయ పులుసు స్టఫింగ్‌ కోసం

కొబ్బరి నూనె- టేబుల్‌ స్పూన్‌
పచ్చికొబ్బరి తురుము- ఒకటిన్నర కప్పులు
కరివేపాకు- రెండు రెబ్బలు
కశ్మీరీ కారం- రెండు టీస్పూన్లు
ధనియాల పొడి- రెండు టీస్పూన్లు

ఉల్లిపాయ పులుసు తయారీకి

కొబ్బరి నూనె- అర కప్పు
ఆవాలు- టీస్పూన్‌
పచ్చిమిర్చి- నాలుగు
ఎండు మిర్చి- రెండు
చిన్న ఉల్లిపాయలు- 300 గ్రాములు
కరివేపాకు- రెండు రెబ్బలు
పసుపు- పావు టీస్పూన్‌
ఉప్పు- టీస్పూన్‌
చింతపండు నీళ్లు- కప్పు

కేరళ స్టైల్‌ ఉల్లిపాయ పులుసు తయారీ విధానం

గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్‌.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్‌.!

ఉల్లిపాయ పులుసు కోసం ముందుగా చిన్న ఉల్లిపాయలను తీసుకుని పొట్టు తీసి కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజు చింతపండును తీసుకుని కడిగి నీళ్లలో వేసి నానబెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌పైన వెడల్పాటి పాన్‌ పెట్టుకుని టేబుల్‌ స్పూన్‌ నూనె వేసి వేడయ్యాక పచ్చికొబ్బరి తురుము వేసి బాగా రోస్ట్‌ చేయాలి. పచ్చివాసన పోయి రంగు మారుతూ మంచి సువాసన వస్తుంది.

An amazing Kerala-style onion curry that pairs perfectly with rice

తర్వాత అందులో కరివేపాకు, కశ్మీరీ కారం, ధనియాల పొడి వేసి కాసేపు వేయించిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి కొన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌పైన అదే పాన్‌లో కొబ్బరి నూనె వేసి వేడయ్యాక ఆవాలు, సన్నగా పొడుగ్గా కట్‌ చేసిన పచ్చిమిర్చి, ఎండు మిర్చి వేసి వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయలను వేసి వేయించాలి.

ఉల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కప్పు చింతపండు రసాన్ని వేసి కలపాలి.

ఉల్లి, వెల్లుల్లి లేకుండా పూరీ, బగారాకి పర్ఫెక్ట్‌ కాంబినేషన్‌ ఆలూ టమాటర్‌ గ్రేవీ.. ఈ తాలింపుతోనే అసలు మజా.!

చింతపండు రసంలో ఉల్లిపాయలు ఉడుకుతున్పప్పుడు సిద్ధం చేసి పెట్టుకున్న పేస్ట్‌ వేసి ఉండలు లేకుండా కలపాలి. మూత పెట్టి మీడియం మంటపైన 15 నిమిషాల పాటు ఉడికించాలి.

పులుసు బాగా ఉడికి నూనె పైకి తేలుతూ ఉన్నప్పుడు స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని చివరిగా కొత్తిమీర చల్లి దించుకోవడమే.

రుచికరమైన కేరళ స్టైల్‌ ఉల్లిపాయల పులుసు రెడీ. వేడివేడిగా అన్నంలోకి సాంబార్‌, పప్పును మించిన రుచితో అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Saturday, September 5, 2026, 15:12 [IST]
Desktop Bottom Promotion