Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Molahora: మన పూర్వీకులకు కొండలను పిండి చేసే శక్తినిచ్చిన ఫుడ్ ఇదే..ఎలా చేసుకోవాలో చూడండి
మనందరికీ పులిహోర గురించి తెలిసి ఉంటది కానీ మెలహోర గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటది. మొలహోర చాలా పాలకాలం నాటి వంట. వందల ఏళ్లుగా పండుగలు, ప్రత్యేక సందర్భాలలో దీనిని చేసుకొని తినేవాళ్లు. మన పూర్వీకులు ఆరోగ్యంగా ఉండేందుకు కారణమైన వంటల్లో ఈ మొలహోర కూడా ఒకటి. కొంచెం స్పైసీగా,కొంచెం కమ్మగా ఎంత తిన్నా ఇంకా తినాలనిపించే ఈ అద్భుతమైన పాతకాలం నాటి వంటను మీరు మీ ఇంట్లో ట్రై చేయాలనుకుంటే దీని తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
మొలహోర తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-పచ్చికొబ్బరి
-ఉప్పు
-జీడిపప్పు
-మిరియాలు
-నెయ్యి
-ఇంగువ

మొలహోర తయారీ విధానం
-ముందుగా అన్నం వండుకోడానికి వాడే 1 కప్పు రైస్ ని అరగంట సేపు
నానబెట్టండి.
-తర్వాత ఒక కొబ్బరి చిప్పను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసి ఇందులోనే బియ్యం కొలిచిన కప్ తో 3 కప్పుల వేడి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి వడకట్టి తీసుకోండి. వడకట్టగా వచ్చిన కొబ్బరిపిప్పిని మళ్లీ మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసి తర్వాత దాన్ని కూడా వడకట్టుకోవాలి,
-ఇప్పుడు అన్నం వండుకోడానికి గిన్నెతీసుకొని అందులో నానబెట్టిన బియ్యం, వడకట్టగా వచ్చిన కొబ్బరిపాలను 5 కప్పులను పోయాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి మీడియం మంట మీద ఉడకనివ్వాలి.
-కొద్దిసేపు ఉడికి దగ్గరపడిన తర్వాత మూతపెట్టి మంటను సిమ్ లో ఉంచండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించండి.
-అన్నం కొంచెం జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి.
-ఇప్పుడు 2 స్పూన్ల మిరియాలను కచ్చాపచ్చాగా దంచి పక్కనపెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి 3 స్పూన్ల నెయ్యి వేసి ఇందులోనే జీడిపప్పులు వేయించుకోండి.
-జీడిపప్పులు కొద్దిగా వేగిన తర్వాత అందులో కరివేపాకు, దంచి పెట్టుకున్న మిరియాల పొడి, పావు స్పూన్ ఇంగువ వేసి కలుపుకోండి.
-ఈ తాలింపుని వండిన కొబ్బరిపాల అన్నంలో వేసి మెత్తం కలిసేలా కలుపుకోండి. అంతే మొలహోర రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications