Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
ఇడ్లీ,దోస కన్నా 100 రెట్లు బలం..అమెరికాలో రేటెక్కువ,మనం ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చు
ఇప్పుడంటే మనం పొద్దున్నే లేవగానే బ్రేక్ ఫాస్ట్ లోకి ఇడ్లీ,దసె లేదా వడలు వంటివి తింటున్నాం కానీ మన పూర్వీకులు పొద్దున్నే లేవగానే చద్దన్నమే తినేవాళ్లు. దీనినే చల్ది అని కూడా అంటారు. ఇడ్లీ,దోశల కన్నా 100 రెట్లు బెటర్ ఇది. ఈ మధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీలు కూడా చద్దన్నం ప్రాముఖ్యత గురించి చెబుతూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. డయాబెటిస్, బీపీ, ఎసిడిటీ సమస్యతో బాధపడేవారికి ఈ చద్దన్నం చాలా మేలు చేస్తుంది.
అమెరికా సహా అనేక దేశాల్లో ఈ చద్దన్నం ఎక్కువ రేటుకి అమ్ముతుంటారు. మనం మాత్రం ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. వేసవిలో తప్పక తినాల్సిన..మనం మర్చిపోయిన ప్రాచీన విధానంలో చల్ది అన్నం ఎలా రెడీ చేసుకోవాలో ఇక్కడ చూడండి.

చల్ది అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు
-మెత్తగా ఉడికించిన తెల్ల అన్నం లేదా మిల్లెట్స్
-మజ్జిగ
-గోరు వెచ్చని పాలు
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-వేడి నీళ్లు
-ఉప్పు
చల్ది అన్నం తయారీ విధానం
-ముందుగా వైట్ రైస్ లేదా మిల్లెట్స్ మెత్తగా ఉడికించాలి.
-తర్వాత ఓ మట్టి పాత్రలో మెత్తగా ఉడికించిన అన్నం లేదా మిల్లెట్స్ 1.5 కప్పు వేసి ఇందులో 1 కప్పు వేడినీళ్లు, 1 కప్పు గోరు వెచ్చని పాలు పోయండి.
-2-3 నిమిషాల తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ల మజ్జిగ, నాలుగు పెద్ద ముక్కల ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి వేసి రాత్రంతా మూతపెట్టి ఉంచండి.
-తెల్లవారిన తర్వాత మూత తీసి అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి. అంతే చల్ది అన్నం లేదా చద్దన్నం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications