Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఆంధ్రా స్పెషల్ పెసరట్టు..కొత్తగా ఇలా ట్రై చేయండి, ఎగబడి తింటారు
ఆంధ్రుల ఆస్తి పెసరట్టు. పెసరట్టు అంటే ఇష్టపడనివాళ్లు ఎవరుంటారు చెప్పండి. కొంతమందికి అయితే రోజుకో పెసరట్టు తినకపోతే ఆ రోజు పిచ్చిపట్టినట్లుగా ఉంటుంది. మద్యం,సిగరెట్లకు ఎలా బానిసలవుతారో పెసరట్టుకి అలా బానిసైపోయేవాళ్లు చాలామంది ఉంటారు. అయితే తెలిసిన తీరులోనే పెసరట్టు చేస్తే కొత్త టేస్ట్ ఏముంటది చెప్పండి. కొత్త పద్దతిలో పెసరట్టు చేస్తే ఎన్ని తింటున్నా అలా పోతూనే ఉంటాయి. ఆంధ్రా స్పెషల్ పెసరట్టుని కొత్త పద్దతిలో ఎలా చేసుకోవాలి,దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూడండి.
పెసరట్టు తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఎండుమిర్చి
-జీలకర్ర
-రాత్రంతా నానబెట్టిన పెసలు
-నానబెట్టిన బియ్యం
-ఉల్లిపాయ
-శెనగపిండి
-ఉప్పు
-అల్లం
-ఆయిల్ లేదా నెయ్యి

పెసరట్టు తయారీ విధానం
-ముందుగా మిక్సీ గిన్నెలో 6 ఎండుమిర్చి, అర టీస్పూన్ జీలకర్ర, 2 టీస్పూన్ల నానబెట్టిన బియ్యం, 2 టీస్పూన్ల శెనగపిండి, రాత్రంతా నానబెట్టుకున్న 1 కప్పు పెసలు, ఉప్పు, ఒకటిన్నర అంగుళం అల్లం, నీళ్లు కొన్ని పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
-గ్రైండ్ చేశాక పిండి మరీ చిక్కగా ఉంటే కొంచెం నీళ్లు పోసి కలుపుకోండి.
-తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిమీద పెనం పెట్టి బాగా వేడి చేయండి. పెనం వేడెక్కిన తర్వాత పెద్ద గరిటతో పిండి తీసుకొని పెనం మీద కాస్త మందంగానే పరచాలి. అంచుల వెంట,మధ్యలో కొంచెం ఆయిల్ లేదా నెయ్యి పోసి నిదానంగా కాల్చండి.
-పెసరట్టు కాలుతున్న సమయంలో దానిమీద చిటికెడు జీలకర్ర, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు కొంచెం వేసి కాలనివ్వండి. రెండు వైపులా నిదానంగా బాగా కాలిన తర్వాత స్వవ్ ఆఫ్ చేసి పెసరట్టుని ప్లేట్ లోకి తీసుకుంటే తినడానికి రెడీ. అల్లం చట్నీ లేదా కొబ్బరి చట్నీతో ఈ పెసరట్టు తింటుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications