Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Gutti vankaya fry: ఆంధ్రా స్పెషల్ గుత్తి వంకాయ ఫ్రై..ఇలా చేస్తే పిచ్చెక్కిపోయే టేస్ట్
వంకాయల్లో చాలా రకాలు ఉంటాయి. తెల్ల వంకాయలు, ఎర్ర వంకాయలు, చిన్న వంకాయలు, పొడుగు వంకాయలు, గుత్తి వంకాయలు ఇలా అనేక రకాల వంకాయలు మార్కెట్ లో లభిస్తాయి. అయితే చాలామంది వంకాయ కూర అనగానే ఉఫ్ అంటారు. చాలామంది వంకాయ కూర తినడానికి అంత ఎక్కువగా ఇష్టపడరు. అయితే అలాంటోళ్లు కూడా ఇష్గపడే ఓ వంకాయ వంటకం ఉంది. అదే ఆంధ్రా స్పెషల్ గుత్తి వంకాయ ఫ్రై.
వంకాయ పేరు చెప్తే మూత కూడా ఓపెన్ చేసి చూడనోళ్లు కూడా గుత్తి వంకాయ ఫ్రై అంటే పరిగెత్తుకొస్తారు. అంత టేస్టీగా అద్భుతంగా ఉంటుంది మరి గుత్తి వంకాయ వేపుడు. ఈ గుత్తి వంకాయ ఫ్రైని ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవాలి,దీని తయారీకి ఏమేం పదార్థాలు కావాలో ఇప్పుడు చూద్దాం.

-గుత్తి వంకాయలు
-పసుపు
-ఉల్లిపాయ
-ఎండు కొబ్బరి
-కారం
-ఎండు మిరపకాయ
-ఉప్పు
-జీలకర్ర
-పచ్చి శెనగపప్పు
-కరివేపాకు
-జీలకర్ర
-కొత్తిమీర
-వెల్లుల్లి
-గరం మసాలా పొడి
-ధనియాలు
-ఆయిల్
-మినపప్పు
-ఆవాలు
గుత్తి వంకాయ ఫ్రై తయారీ విధానం
-ఓ గిన్నెలో నీళ్లు పోసి అందులోఉపపు వేయండి.
-ఇప్పుడు పావు కిలో నల్లవంకాయలు తీసుకొనిని వంకాయలకు మూడువంతుల వరకు
నాలుగు పక్కలకు గాట్లు పెట్టి వాటిని ఉప్పు వేసి కలిపిన నీళ్లల్లో
వేయండి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు,
అర టీ స్పూన్ జీలకర్ర,3 టేబుల్ స్పూన్ల కట్ చేసిన ఎండు కొబ్బరి
ముక్కలు,5 ఎండు మిరపకాయలు వేసి దోరగా ఫ్రై చేసి వాటిని ఓ గిన్నలోకి
తీసుకొని చల్లారేవరకు పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అందులో వంకాయలను
వేయండి. మధ్య మధ్యలో కలుపుతూ వంకాయలు బాగా మెత్తగా అయ్యేవరకు ఫ్రై
చేయండి.
-ఈలోపు మిక్సీ గిన్నెలో ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులను,ఒక
టీస్పూన్ కారం,అర టస్పూన్ గరం మసాలా పొడి,చికెడు పసుపు, 7-8వెల్లుల్లి
రెబ్బలను వేసి బాగా గ్రైండ్ చేయండి. ఒకరకంగా గ్రైండ్ చేశాక అందులో
కొంచెం ఉప్పు, కొద్దిగా కరివేపాకులు,కొంచెం కొత్తిమీర వేసి మళ్లీ
గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని ఓ బౌల్ లో తీసి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు వంకాయలను చెక్ చేయండి. వంకాయలు మెత్తగా ఫ్రై అయిన తర్వాత
స్టవ్ ఆపేసి వాటిని ఓ ప్లేట్ లోకి తీసుకొని వాటి గాట్లతో మిక్సీలో
వేసి రెడీ చేసుకున్న పొడిని పెట్టండి. మిగిలిన పొడిని ఓ ప్లేట్ లో
పక్కనపెట్టి ఉంచండి.
-ఇప్పడు స్టవ్ మీద ఆయిల్ పోసి అందులో అరటీస్పూన్ చొప్పున పచ్చి
శెనగపప్పు,మినపప్ప,ఆవాలు,జీలకరర వేసి దోరగా ఫ్రై చేయండి.
-ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,కద్దిగా కరివేపాకు
వేసి బాగా ఫ్రై చేయండి.ఉల్లిపాయలు కొంచెం ఎరుపు రంగులోకి వచ్చాక
చిటికెడు పసుపు వేసి బాగా కలిపిన తర్వాత అందులో స్టఫ్ చేసి
పక్కనపెట్టుకున్న వంకాయలను వేయండి. అందులోనే పక్కనపెట్టుకున్న ఎక్స్
ట్రా స్టఫ్ పొడిని కూడా వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు ఫ్రై
చేసుకోండ.
-ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఎంతో
రుచికరైన ఆంధ్రా స్పెషల గుత్తి వంకాయ ఫ్రై రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications