Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఆంధ్రా స్టైల్ చింత చిగురు చికెన్ కర్రీ.. ఇలా వండితే ఒక్కో ముద్ద అమృతంలా..
ఆదివారం మాంసాహార ప్రియుల ఇళ్లల్లో కోడి కూర ఘుమఘుమలాడాల్సిందే. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బిర్యానీ.. ఇలా ఎన్నెన్నో రకాలుగా వండుకుని వీకెండ్ ని ఆస్వాదిస్తుంటారు. అయితే రెగ్యులర్ రుచులకు భిన్నంగా, మీ నాలుకకు ఒక కొత్త అద్భుతాన్ని పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే చింత చిగురు చికెన్ కర్రీ ట్రై చేయండి.

చింతచిగురు వంటకానికి అద్భుతమైన పులుపును, సువాసనను మాత్రమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు, జీర్ణ సంబంధిత సమస్యలను దరిచేరనివ్వదు. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది. శరీరంలోని చెడు కొవ్వును కరిగించడంలోనూ ఇది మేటి. ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే చింత చిగురు, చికెన్ లోని ప్రోటీన్ తో కలిస్తే అటు రుచికి రుచి, ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది.
చింత చిగురు చికెన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు
శుభ్రం చేసిన చికెన్ - 1కేజీ
లేత చింత చిగురు - 200 గ్రాములు
ఉల్లిపాయలు-2
పచ్చిమిర్చి-కారానికి తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర టీస్పూన్లు
కారం-సరిపడా
ఉప్పు -సరిపడా
పసుపు - పావు టీస్పూన్
ధనియాలు,జీలకర్ర పొడి- 1 టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
వంట నూనె - తగినంత

చింత చిగురు చికెన్ కర్రీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి, మందపాటి కడాయి పెట్టుకుని తగినంత నూనె వేయాలి. నూనె వేడెక్కాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి దోరగా రంగు మారేదాకా మీడియం మంటపై వేయించుకోవాలి.
-ఉల్లిపాయలు వేగాక పసుపు, తాజాగా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చి వాసన పోయి, కమ్మటి సువాసన వచ్చే వరకు కలుపుతూ వేయించాలి.
-ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను కడాయిలో వేయాలి. చికెన్ లో ఊరే నీరంతా ఇగిరిపోయే వరకు రెండు, మూడు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత రుచికి సరిపడా కారం, ధనియాలు-జీలకర్ర పొడి వేసి ముక్కలకు పట్టేలా కలపాలి.
-ముక్కలు మునిగేలా సుమారు ఒకటిన్నర నుంచి రెండు గ్లాసుల నీళ్లు పోసి, తగినంత ఉప్పు వేసుకోవాలి. హై ఫ్లేమ్ లో కూరను బాగా మరగనివ్వాలి. కూర మరుగుతున్నప్పుడు మూతపెట్టి మంటను తగ్గించి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించాలి. చికెన్ మెత్తబడి, నూనె పైకి తేలే సమయానికి కూర దాదాపు సిద్ధమైనట్లే.
-కూర ఉడికేలోపు చింత చిగురును శుభ్రం చేసుకుని ముదురు కాడలు తీసేయాలి. రెండు చేతులతో ఆకులను సున్నితంగా నలుపుకోవాలి. కూరలో వేసే ముందు మాత్రమే ఆకులను నలపాలి. ముందుగానే నలిపి ఉంచితే కూరకు పసరు వాసన వస్తుంది. కాస్త పులుపు ఇష్టపడేవారు చిగురును కాస్త ఎక్కువ వేసుకోవచ్చు.
-ఉడుకుతున్న కూరలో నలిపి పెట్టుకున్న చింత చిగురును వేసి కలపాలి. మూతపెట్టి మరో 5 నిమిషాలు ఉడికించాలి. అప్పుడే ఆకులోని పులుపు చికెన్ ముక్కలకు పర్ఫెక్ట్ గా పట్టి కూర చిక్కబడుతుంది.
-చివరగా గరం మసాలా చల్లి, ఉప్పు సరిచూసుకుని ఒక్క నిమిషం పాటు ఉంచి దించేసుకుంటే చాలు.. కమ్మటి సువాసనలు వెదజల్లే చింత చిగురు కోడి కూర రెడీ. వేడి వేడి అన్నంలో ఈ చింత చిగురు చికెన్ ఇగురు కలుపుకుని తింటుంటే ఒక్కో ముద్దా అమృతంలా అనిపిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications