Latest Updates
-
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా..
Tomato Dal: ఆంధ్ర స్టైల్ టమాటో పప్పు.. ఇలా చేసుకొని తింటే, ముద్ద అన్నం కూడా మిగల్చరు!
పప్పు అనేది ఒక ఎమోషన్. మధ్యాహ్నం అన్నంతో పాటు చపాతీలో, పరోటాలో, అలాగే రోటీల్లో దీనిని కాంబినేషన్‌గా వినియోగిస్తుంటారు. ఉదయం అల్పాహారానికి వెళ్లినా లేదా మధ్యాహ్న భోజనానికి వెళ్లినా హోటల్‌లు ఈ రుచికరమైన పప్పును అందిస్తాయి. మరీ ముఖ్యంగా ఆంధ్ర పప్పు అంటే దేశ వ్యాప్తంగా చాలా మంది ఇష్టంగా తింటుంటారు.
అయితే ఈ పప్పును టేస్టీగా, స్పైసీగా ఎలా చేయాలో కొందరి తెలియదు. అన్నం వండినంత సులభంగా ఈ పప్పును చేసుకోవచ్చు. ఈ పప్పులో టమాటో, పులుసును కలుపుకొని కూడా తయారు చేసుకోవచ్చు. ఆంధ్రా స్టైల్‌లో ఈ టమాటో పప్పును ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆంధ్రా స్టైల్ టమాటో పప్పుకు కావలసిన పదార్థాలు
- పప్పు
- పది చిన్న ఉల్లిపాయలు
- అయిదు పచ్చిమిర్చి
- మూడు టమాటోలు
- నూనె
- చింతపండు
- కారంపొడి
- రుచికి తగినంత ఉప్పు
- ఆవాలు
- జీలకర్ర
- వెల్లుల్లి
- కొన్ని ఎండు మిరపకాయలు
- నెయ్యి
- కొత్తిమీర
ఆంధ్రా స్టైల్ టమోటో పప్పు చేయడం ఎలా?
ముందుగా కుక్కర్ తీసుకుని అందులో బాగా కడిగిన పప్పు వేసి నీళ్లు పోయాలి. ఆ పప్పు నిండేంత వరకు నీటిని పోసుకొని మూత పెట్టుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టిన చింపాండును రసం, ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి, రుచికి తగినంత పచ్చిమిర్చి, కొంచెం నూనె వేసుకొని పప్పును మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఆ తరువాత కుక్కర్ మూత పెట్టుకోవాలి.
4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి కదిలించండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఒకవేళ పప్పు ఉడకనట్లు అనిపిస్తే ఇంకో విజిల్ వచ్చేంత వరకు కూడా ఉడకబెట్టుకోవచ్చు. పప్పు సరిగ్గా ఉడికిన తరువాతే కుక్కర్‌ను కిందకు దించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి ఎట్టి, అందులో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడయ్యాక అందులో జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి.
తరువాత కుక్కర్‌లోని పప్పు మిశ్రమంలో మనం చేసుకున్న పోపును వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిలో ఒక చెంచా నెయ్యి, కొంచెం కొత్తిమీర చల్లుకుంటే వేడి వేడిగా ఎంతో రుచికరమైన ఘుమఘుమలాడే ఆంధ్ర స్టైల్ పప్పు సిద్ధమైనట్లే. దీనిని మధ్యాహ్నం భోజనంతో పాటు సాయంత్రం చపాతీలకు, బ్రేక్ ఫాస్ట్ సమయంలో పూరీలు తినడానికి కూడా వినియోగించుకోవచ్చు. పప్పు రుచికరంగా ఉండడం మాత్రమే కాదు. పప్పుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వల్ల తక్షణ శక్తితో పాటు కండరాలకు కావాల్సిన పోషకాలు దొరుకుతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications