Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Annavaram prasadam: నోట్లో పెట్టుకుంటే అమృతంలా ఉండే అన్నవరం ప్రసాదం..ఇంట్లోనే సింపుల్ గా ఇలా చేసుకోండి
తిరుపతి లడ్డూ ఎంత ఫేమస్ అనేది ఎలా చెప్పనవసరం లేదో అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం(annavaram satyanarayana swami prasadam) కూడా. తిరుపతి లడ్డూ తరహాలోనే ఈ ప్రసాదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. నెయ్యి, యాలకుల వాసనలతో ఘుమఘుమలాడే అన్నవరం ప్రసాదం తింటే..మళ్లీ మళ్లీ అన్నవరం ఆ ప్రసాదం కోసమే వెళ్లేటోళ్లు చాలామంది ఉంటారు. అంతటి రుచికరమైన ప్రసాదాన్ని ఇంట్లో కూడా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నవరం ప్రసాదం తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
అన్నవరం ప్రసాదం తయారీకి కావాల్సిన పదార్థాలు
-గోధుమరవ్వ
-యాలకల పొడి
-కుంకుమ పువ్వు
-పటిక ముక్క
-జాజికాయ ముక్క
-చక్కెర
-బెల్లం తురుము
-నెయ్యి

అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం తయారీ
విధానం
-ముందుగా స్వమ్మీద ఓ బాండీ పెట్టి అందులో ఒక కప్పు గోధుమ రవ్వ వేసి
తక్కువమంట మీద బాగా కలుపుతూ 10-12 నిమిషాలు వేయించుకోండి.
-రవ్వ బాగా వేగిన తర్వాత దాన్ని ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కనపెట్టండి.
-ఇప్పుడు చిన్న జాజికాయ ముక్క,పావు టీ స్పూన్ అంత పటిక ముక్క,ఒక టీస్పూన్ యాలకల పొడి,2 చిటికెళ్ల కుంకుమ పువ్వు మిక్సీలో లేదా రోట్లో వేసి మెత్తగా దంచుకొని పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద అడుగుమందంగా ఉంటే బాండీ పెట్టి అందులో 3 కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించండి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచండి.
-నీళ్లు బాగా తెర్లకాగినప్పుడు అందులో వేయించిన పెట్టుకున్న గోధుమ రవ్వ వేసి మెత్తగా ఉడకనివ్వాలి.
-గోధుమరవ్వ బాగా ఉడికిన తర్వాత అందులో 1 కప్పు చక్కెర వేసి కలిపి మూతపెట్టండి.
-మధ్య మధ్యలో కలుపుతూ దగ్గరపడేంతవరకు ఉడకనివ్వాలి. 20-25 నిమిషాల తర్వాత అది రంగు మారుతుంది.
-అప్పుడు అందులో 1 కప్పు బెల్లం తరుము వేసి కలపాలి.
-బెల్లం పూర్తిగా కరిగిపోయి నీరు వదులుతుంది. అప్పుడు ఇందులో 1/3 కప్పు నెయ్యి పోసి ఏ మాత్రం కలపకుండా మూత పెట్టండి. మంటను సిమ్ లో పెట్టండి.
-5 నిమిషాల తర్వాత మూత తీసి నిదానంగా కలపండి.ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీలో వేసుకున్న సుగంధ ద్రవ్యాల పొడి వేసి బాగా కలిపి మూత పెట్టేసి 5 నిమిషాలు ఉడికించండి.
-నెయ్యి పైకి తేలిన తర్వాత స్టవ్ ఆపేసి బాండీని దించేయండి. అంతే అన్నవరం ప్రసాదం రెడీ.ఈ ప్రసాదం 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications