Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..10 నిమిషాల్లో ఘుమఘుమలాడే కర్ణాటక స్పెషల్ బిసి బేలా బాత్ రెడీ!
ఇడ్లీ, దోశలు తిని బోర్ కొట్టినప్పుడు లేదా వంట త్వరగా అయిపోవాలనుకున్నప్పుడు, చాలామంది ఎంచుకునే బెస్ట్ ఆప్షన్ రైస్ ఐటమ్స్. పులిహోర, చిత్రన్నం, ఫ్రైడ్ రైస్, వాంగీ బాత్ వంటివి ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ వీటన్నింటిలో రారాజు కన్నడ నాట విశేష ప్రజాదరణ పొందిన వంటకం..బిసిబేలా బాత్.
చాలామంది మార్కెట్లో దొరికే రెడీమేడ్ మసాలా ప్యాకెట్లపై ఆధారపడతారు. కానీ అసలైన రుచి రహస్యం తాజా మసాలా పొడిలోనే దాగి ఉంటుంది. ఈ పొడి ఒక్కటి మీ ఇంట్లో సిద్ధంగా ఉంటే చాలు కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే ఘుమఘుమలాడే బిసి బేలే బాత్ మీ కంచంలోకి వచ్చేస్తుంది. అచ్చం ఉడిపి హోటల్ రుచిని మీ వంటింటికి తెచ్చే ఆ మసాలా పొడి ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
శనగ పప్పు - 2 టేబుల్ స్పూన్లు
మినప పప్పు - 2 టేబుల్ స్పూన్లు
ధనియాలు - 3 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి - 8 నుండి 10
ఎండు కొబ్బరి తురుము - పావు కప్పు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - 4 నుండి 5
యాలకులు - 2
మరాఠీ మొగ్గ - 2
మిరియాలు - అర టీస్పూన్
మెంతులు - పావు టీస్పూన్
గసగసాలు - 1 టీస్పూన్
ఇంగువ - చిటికెడు
కరివేపాకు - 2 రెమ్మలు
నూనె - వేయించడానికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ పెట్టుకోండి. అందులో ఒక స్పూన్ నూనె వేసి వేడెక్కనివ్వాలి. నూనె వేడయ్యాక మంటను సిమ్ లో ఉంచండి.
-ముందుగా ఇంగువ, మెంతులు, మిరియాలు వేసి దోరగా వేయించండి. అవి కాస్త వేగాక శనగపప్పు, మినపప్పు వేసి పప్పులు ఎర్రగా, కమ్మటి వాసన వచ్చే వరకు ఓపికగా వేయించాలి. సుమారు 2 నిమిషాలు వేయించిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి.
-అదే పాన్ లో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ వంటి మసాలా దినుసులు వేసి వేయించండి. చివరగా ధనియాలు, జీలకర్ర వేసి మరో నిమిషం పాటు వేయించి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే బాండీలో ఎండు కొబ్బరి తురుము, గసగసాలు వేసి కేవలం ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయండి. కొబ్బరి మాడిపోకుండా చూసుకోవాలి. చివరగా పాన్ లో మరికొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి, కరివేపాకును కరకరలాడేలా వేయించుకోవాలి.
-వేయించుకున్న పదార్థాలన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి. అన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా రుబ్బుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన, సువాసన వెదజల్లే బిసి బేలే బాత్ మసాలా పౌడర్ రెడీ.
-ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే నెల రోజుల పాటు తాజాగానే ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications