Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
కార్తీకమాసం స్పెషల్..కొత్తిమీర కొబ్బరి అన్నం..ఒక్కో ముద్ద తింటుంటే కమ్మని సువాసనతో భలే రుచిగా
హిందూ సంప్రదాయంలో కార్తీకమాసానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. కార్తీకమాసంలో చాలా మంది ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక పదార్థాలను విడిచిపెట్టి సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తారు. ఇలాంటి పవిత్రమైన మాసంలో దేవునికి నైవేద్యంగా సమర్పించడానికి, అలాగే కుటుంబ సభ్యులకు రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించడానికి ఒక అద్భుతమైన వంటకం కొత్తిమీర కొబ్బరి అన్నం.
కొత్తిమీర తాజాదనం, పచ్చి కొబ్బరి తియ్యదనం, నిమ్మరసం పులుపు, తాలింపు ఘుమఘుమలు అన్నీ కలిసి ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి. ఇది కడుపుకు తేలికగా ఉండి, జీర్ణవ్యవస్థపై భారం వేయదు. ఉపవాసం విరమించే వారికి ఇది ఒక చక్కటి ఎంపిక.
కొత్తిమీర కొబ్బరన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు
కొత్తిమీర-2 కప్పులు
పచ్చి కొబ్బరి ముక్కలు- చిన్న బౌల్ అరకప్పు
పచ్చిమిరపకాయలు-కారానికి తగినన్ని
దాల్చిన చెక్క-2 ఇంచులు
యాలకలు-4
లవంగాలు-3
ఉప్పు-రుచికి తగినంత
పసుపు-పావు టీస్పూన్
ఆయిల్- 2 టీస్పూన్లు
నెయ్యి-అర టేబుల్ స్పూన్
జీలకర్ర-1 టీస్పూన్
జీడిపప్పు-కొన్ని
ఎండుమిర్చి- 2
కరివేపాకు- కొన్ని
ఉడికించిన అన్నం-1 కప్పు
కొత్తిమీర కొబ్బరన్నం తయారీ విధానం
-ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టాలి. తర్వాత అన్నం పొడిపొడిగా వండుకోవాలి. ప్రతి మెతుకు విడివిడిగా ఉండేలా చూసుకోవాలి.
-వండిన అన్నాన్ని ఒక వెడల్పాటి పళ్లెంలో వేసి చల్లారనివ్వాలి. దీనివల్ల అన్నం కలిపేటప్పుడు ముద్ద అవ్వకుండా ఉంటుంది.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో కొత్తిమీర(కాడలతో సహా), పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు,పసుపు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకలు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె,నెయ్యి వేసి వేడయ్యాక ఇందులో జీలకర్ర,ఎండుమిరపకాయల ముక్కలు,కరివేపాకు, జీడిపప్పు వేసి ఇవి వేగాక గ్రైండ్ చేసిన కొత్తిమీర పేస్ట్ వేసి మీడియం మంట మీద వేయించాలి.
-పేస్ట్ నుండి నూనె తేలడం ప్రారంభమైనప్పుడు స్టవ్ మంటను తగ్గించి, చల్లార్చిన అన్నాన్ని కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి. అన్నం మెతుకులు విరగకుండా గరిటతో నెమ్మదిగా, జాగ్రత్తగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా ఇదే సమయంలో వేసి బాగా మిక్స్ చేయాలి.
-చివరగా నిమ్మరసం పిండి, మరోసారి తేలికగా కలపాలి. నిమ్మరసం వంటకానికి ఒక చక్కటి తాజాదనాన్ని, పుల్లటి రుచిని అందించి, మిగతా ఫ్లేవర్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది.
-అంతే ఘుమఘుమలాడే, రుచికరమైన, ఆరోగ్యకరమైన కొత్తిమీర కొబ్బరన్నం రెడీ. ఈ వంటకం కార్తీకమాసానికి ఎందుకు అంత ప్రత్యేకం అంటే.. ఇందులో వాడే పదార్థాలన్నీ ప్రకృతిసిద్ధమైనవి, సాత్విక గుణాలను కలిగి ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







