జీర్ణ సమస్యలను చిటికెలో మాయం చేసే పుదీనా రసం.. వేడి అన్నంలోకి అమృతంలా..

Posted By:

మన వంటగదిలో ఎప్పుడూ అందుబాటులో ఉండే సువాసనభరితమైన ఆకుపచ్చని మూలిక పుదీనా. దీని పేరంటేనే మనకు ఒకలాంటి తాజాదనం గుర్తొస్తుంది. పుదీనాలో లెక్కలేనన్ని ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇది కేవలం వంటకాలకు రుచిని, సువాసనను అందించడమే కాకుండా.. మన ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తుంది. కడుపు నొప్పి, తలనొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఇట్టే దూరం చేస్తుంది. నోటి దుర్వాసనను పోగొట్టి దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో దీనికి సాటి మరొకటి లేదు.

Aromatic Delicious Extremely Healthy Pudina Rasam Recipe in Telugu

పుదీనాలో విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం, ఐరన్, కాల్షియం మెండుగా ఉంటాయి. యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సాధారణంగా మనం పుదీనాను చట్నీలు, పులావ్, బిర్యానీ వంటి వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటాం. కానీ మీరు ఎప్పుడైనా పుదీనా రసం గురించి విన్నారా? అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే ఈ సరికొత్త పుదీనా రసాన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

దాబా స్టైల్ భూనా చికెన్ మసాలా..స్పైసీగా, జ్యూసీగా కేక టేస్ట్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

పుదీనా రసం తయారీకి కావలసిన పదార్థాలు

పప్పు (శనగపప్పు లేదా కందిపప్పు) - పావు కప్పు
చింతపండు - అర నిమ్మకాయంత
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
రసం పొడి - ముప్పావు టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
మిరియాల పొడి - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
తాజా పుదీనా ఆకులు - గుప్పెడు
కరివేపాకు - రెండు రెమ్మలు
కొత్తిమీర - కొద్దిగా
నీరు - రసానికి తగినంత
ఉప్పు -సరిపడా

Aromatic Delicious Extremely Healthy Pudina Rasam Recipe in Telugu

పుదీనా రసం తయారీ విధానం

-మొదటగా, ఒక గిన్నెలో చింతపండును తీసుకుని, కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.

-ప్రెషర్ కుక్కర్‌ లో పావుకప్పు పప్పును వేసి, తగినన్ని నీళ్లు పోసి స్టవ్ మీద కుక్కర్ పెట్టి పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. సుమారు 10 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత, కుక్కర్ ప్రెషర్ దానంతట అదే పోయే వరకు పక్కన పెట్టుకుని, ఆ తర్వాత పప్పును మెత్తగా మెదిపి పెట్టుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె లేదా బాండీ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక అందులో జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి సన్నని మంట మీద చిటపటలాడేలా కొన్ని సెకన్ల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోనే పసుపు, రసం పొడి వేసి మీడియం మంట మీద మరో కొన్ని సెకన్ల పాటు కలుపుతూ వేయించాలి. ఇలా చేయడం వల్ల రసానికి మంచి రంగు వస్తుంది.

-ఇప్పుడు ముందుగా మెత్తగా ఉడికించి పెట్టుకున్న పప్పును, నానబెట్టుకున్న చింతపండు గుజ్జును, తగినన్ని నీళ్లని ఆ తాలింపులో పోయాలి. ఆ వెంటనే అర టీస్పూన్ మిరియాల పొడి కూడా వేసి బాగా కలపాలి. మంటను మీడియం ఫ్లేమ్‌ లో ఉంచి రసాన్ని మరగనివ్వాలి. రసాన్ని మరీ ఎక్కువసేపు మరగబెట్టకూడదు. రసం ఉడకడం లేదా పొంగు రావడం ప్రారంభం కాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా

-ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో మీ రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర, శుభ్రం చేసుకున్న తాజా పుదీనా ఆకులు వేయాలి. స్టవ్ మీదున్న వేడి వేడి రసాన్ని తీసుకొచ్చి ఈ ఆకులపై పోయాలి. వెంటనే ఆ గిన్నెపై గట్టిగా మూతపెట్టి సుమారు 5 నుండి 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఇలా చేయడం వల్ల పుదీనా ఆకుల్లో ఉండే సుగంధ తైలాలు, పోషకాలు ఆ వేడికి రసంలోకి పూర్తిగా దిగుతాయి.

-కొద్ది సేపటి తర్వాత మూత తీసి చూస్తే.. ఇల్లంతా వ్యాపించే పుదీనా సువాసన మీ మనసును దోచేస్తుంది. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఘుమఘుమలాడే పుదీనా రసం రెడీ. వేడి వేడి అన్నంలో ఈ రసం కలుపుకుని తింటుంటే ఆ రుచి మాటల్లో చెప్పలేం.

[ of 5 - Users]
Story first published: Saturday, July 18, 2026, 14:56 [IST]
Desktop Bottom Promotion