Latest Updates
-
చేపల కన్నా 10 రెట్లు ఎక్కువ ఒమేగా-3 ఇచ్చే వెజిటేరియన్ ఫుడ్స్ ఇవే! -
దాబా స్టైల్ భూనా చికెన్ మసాలా..స్పైసీగా, జ్యూసీగా కేక టేస్ట్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, విన్నా చాలు.. గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం.! -
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.! -
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.!
జీర్ణ సమస్యలను చిటికెలో మాయం చేసే పుదీనా రసం.. వేడి అన్నంలోకి అమృతంలా..
మన వంటగదిలో ఎప్పుడూ అందుబాటులో ఉండే సువాసనభరితమైన ఆకుపచ్చని మూలిక పుదీనా. దీని పేరంటేనే మనకు ఒకలాంటి తాజాదనం గుర్తొస్తుంది. పుదీనాలో లెక్కలేనన్ని ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇది కేవలం వంటకాలకు రుచిని, సువాసనను అందించడమే కాకుండా.. మన ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తుంది. కడుపు నొప్పి, తలనొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఇట్టే దూరం చేస్తుంది. నోటి దుర్వాసనను పోగొట్టి దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో దీనికి సాటి మరొకటి లేదు.

పుదీనాలో విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం, ఐరన్, కాల్షియం మెండుగా ఉంటాయి. యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సాధారణంగా మనం పుదీనాను చట్నీలు, పులావ్, బిర్యానీ వంటి వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటాం. కానీ మీరు ఎప్పుడైనా పుదీనా రసం గురించి విన్నారా? అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే ఈ సరికొత్త పుదీనా రసాన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
దాబా స్టైల్ భూనా చికెన్ మసాలా..స్పైసీగా, జ్యూసీగా కేక టేస్ట్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
పుదీనా రసం తయారీకి కావలసిన పదార్థాలు
పప్పు (శనగపప్పు లేదా కందిపప్పు) - పావు కప్పు
చింతపండు - అర నిమ్మకాయంత
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
రసం పొడి - ముప్పావు టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
మిరియాల పొడి - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
తాజా పుదీనా ఆకులు - గుప్పెడు
కరివేపాకు - రెండు రెమ్మలు
కొత్తిమీర - కొద్దిగా
నీరు - రసానికి తగినంత
ఉప్పు -సరిపడా

పుదీనా రసం తయారీ విధానం
-మొదటగా, ఒక గిన్నెలో చింతపండును తీసుకుని, కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.
-ప్రెషర్ కుక్కర్ లో పావుకప్పు పప్పును వేసి, తగినన్ని నీళ్లు పోసి స్టవ్ మీద కుక్కర్ పెట్టి పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. సుమారు 10 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత, కుక్కర్ ప్రెషర్ దానంతట అదే పోయే వరకు పక్కన పెట్టుకుని, ఆ తర్వాత పప్పును మెత్తగా మెదిపి పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె లేదా బాండీ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక అందులో జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి సన్నని మంట మీద చిటపటలాడేలా కొన్ని సెకన్ల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోనే పసుపు, రసం పొడి వేసి మీడియం మంట మీద మరో కొన్ని సెకన్ల పాటు కలుపుతూ వేయించాలి. ఇలా చేయడం వల్ల రసానికి మంచి రంగు వస్తుంది.
-ఇప్పుడు ముందుగా మెత్తగా ఉడికించి పెట్టుకున్న పప్పును, నానబెట్టుకున్న చింతపండు గుజ్జును, తగినన్ని నీళ్లని ఆ తాలింపులో పోయాలి. ఆ వెంటనే అర టీస్పూన్ మిరియాల పొడి కూడా వేసి బాగా కలపాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి రసాన్ని మరగనివ్వాలి. రసాన్ని మరీ ఎక్కువసేపు మరగబెట్టకూడదు. రసం ఉడకడం లేదా పొంగు రావడం ప్రారంభం కాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
-ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో మీ రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర, శుభ్రం చేసుకున్న తాజా పుదీనా ఆకులు వేయాలి. స్టవ్ మీదున్న వేడి వేడి రసాన్ని తీసుకొచ్చి ఈ ఆకులపై పోయాలి. వెంటనే ఆ గిన్నెపై గట్టిగా మూతపెట్టి సుమారు 5 నుండి 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఇలా చేయడం వల్ల పుదీనా ఆకుల్లో ఉండే సుగంధ తైలాలు, పోషకాలు ఆ వేడికి రసంలోకి పూర్తిగా దిగుతాయి.
-కొద్ది సేపటి తర్వాత మూత తీసి చూస్తే.. ఇల్లంతా వ్యాపించే పుదీనా సువాసన మీ మనసును దోచేస్తుంది. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఘుమఘుమలాడే పుదీనా రసం రెడీ. వేడి వేడి అన్నంలో ఈ రసం కలుపుకుని తింటుంటే ఆ రుచి మాటల్లో చెప్పలేం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications