Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
అటుకుల పకోడి ఎప్పుడైనా తిన్నారా? ఇలా చేస్తే బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా..
సాయంత్రం వేళ చల్లని గాలి వీస్తున్నప్పుడు లేదా బయట వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా, కరకరలాడుతూ ఏదైనా స్నాక్ తినాలనిపించడం మనకందరికీ సహజం. ఆ సమయంలో మనకు వెంటనే గుర్తొచ్చేవి టీ, కాఫీలతో పాటు ఉల్లిపాయ పకోడీ లేదా బజ్జీలు. ఎప్పుడూ రొటీన్ గా చేసుకునే శెనగపిండి పకోడీలకు బదులుగా, ఈసారి కాస్త భిన్నంగా, మరింత రుచికరంగా ఉండే అటుకుల పకోడి ప్రయత్నించండి.

తక్కువ సమయంలో, సులభంగా తయారు చేసుకోగలిగే ఆహార పదార్థాల్లో అటుకులు ముందు వరుసలో ఉంటాయి. అటుకులతో చేసే పకోడీలు బయట వైపు కరకరలాడుతూ, లోపల మృదువుగా ఉండి అద్భుతమైన రుచిని ఇస్తాయి. ఇది కేవలం రుచికరమైన స్నాక్ మాత్రమే కాదు, ఇందులో వాడే అటుకుల వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా చేకూరుతాయి
అటుకుల పకోడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-అటుకులు
-శెనగపిండి
-బియ్యం పిండి
-ఉల్లిపాయలు
-పచ్చిమిర్చి
-అల్లం
-కొత్తిమీర
-కరివేపాకు
-జీలకర్ర
-పసుపు
-ఉప్పు
-ధనియాలు
-వంట నూనె
అటుకుల పకోడి తయారీ విధానం
-ముందుగా ఒక కప్పు అటుకులను జల్లెడలోకి లేదా ఏదైనా బెజ్జాల గిన్నెలోకి తీసుకొని ఇందులో అటుకులు మనిగేంతవరకు నీళ్లు పోసి శుభ్రంగా కడిగి నీటిని వంసేసి 10 నిమిషాలు అటుకులను పక్కన పెట్టి నాననివ్వాలి.
-తర్వాత 2 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకోవాలి. 3 పెద్ద ఉల్లిపాయలను పొడవాటి చీలికలుగా కట్ చేసుకోండి.
-ఒక వెడల్పాటి గిన్నెలో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ చీలికలు వేసి ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కొంచెం, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, రుచికి తగినంత ఉప్పు, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాలు నలిపి వేసి ఉల్లిపాయ ముక్కల్లో ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు అందులో 10 నిమిషాలు నానబెట్టుకున్న అటుకులను వేసి కలుపుకొని తర్వాత ఇందులోనే పావు కప్పు పొడి బియ్యం పిండి, పావు కప్పు శెనగపిండి వేసి మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇందులో కొంచెం కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ పిండిని గట్టి ముద్దలా కలుపుకోవాలి. కొంచెం కూడా పల్చగా ఉండకూడదు. పల్చగా ఉంటే ఆయిల్ పీల్చేస్తుంది.
-ఇప్పుడు కలుపుకున్న పిండిని చిన్న చిన్న పకోడీల్లా చేసుకోండి.తర్వాత స్టవ్ మీద బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసి అందులో వాటిని వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుక. అంని ప్లేట్ లోకి తీసుకోండి. అంతే టేస్టీ అటుకుల పకోడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications