Latest Updates
-
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి!
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే?
దక్షిణ భారతదేశ వంటకాల్లో,ముఖ్యంగా కర్ణాటకలో బిసిబేలే బాత్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కమ్మని సువాసనలతో గుమగుమలాడే ఇంట్లో తయారుచేసిన మసాలా పొడి, పోషకాలతో నిండిన కూరగాయలు, కందిపప్పు,జీరగ సాంబ బియ్యంతో చేసిన ఈ ప్రత్యేకమైన వంటకం.. తింటుంటే ప్రాణానికి ఎంతో హాయిగా, తృప్తిగా అనిపిస్తుంది. కన్నడ భాషలో.. బిసి అంటే వేడి, బేలే అంటే పప్పు, బాత్ అంతే మిశ్రమం అని అర్ధం. వర్షం పడుతున్నప్పుడు లేదా హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకునే సమయంలో వేడి వేడిగా ఈ బిసిబేలే బాత్ తింటే ఆ మజాయే వేరు.
బిసిబేలే బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు
బిసిబేలే బాత్ మసాలా పొడి కోసం:
ధనియాలు - 2-3 టేబుల్ స్పూన్లు
శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు
మినపప్పు - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 2 టీస్పూన్లు
మిరియాలు - 1-2 టీస్పూన్లు
గసగసాలు - 1 టీస్పూన్
నువ్వులు - 1 టీస్పూన్
ఇంగువ - 1 టీస్పూన్
దాల్చినచెక్క - చిన్న ముక్క
లవంగాలు - 3-4
బ్యాడ్గి మిర్చి (రంగు కోసం) - 10
సాధారణ ఎండుమిర్చి - 5
పచ్చి కొబ్బరి ముక్కలు - 4 టేబుల్ స్పూన్లు
బిసిబేలే బాత్ వండటానికి కావాల్సినవి:
జీరగ సాంబ బియ్యం - 1 కప్పు
కందిపప్పు - అర కప్పు
పల్లీలు - గుప్పెడు
మిక్స్డ్ కూరగాయల ముక్కలు (క్యారెట్, బీన్స్ తదితరాలు)- 3 కప్పులు
వెల్లుల్లి - 2 రెబ్బలు
పసుపు - అన టీస్పూన్
నీళ్లు - 3-4 కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం..
జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం
తాలింపు, గ్రేవీ కోసం:
వేరుశెనగ నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
మెంతులు - పావు టీస్పూన్
సాంబార్ ఉల్లిపాయలు- 10
టమాటాలు - 2
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - కొద్దిగా రెబ్బలు
ఇంట్లో చేసిన బిసిబేలే బాత్ మసాలా - 2 టేబుల్ స్పూన్లు
చింతపండు రసం - 1 కప్పు
నీళ్లు - తగినన్ని

బిసిబేలే బాత్ తమారీ విధానం
-ముందుగా జీరగ సాంబ బియ్యం శుభ్రంగా కడిగి తర్వాత అందులో నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.
-తర్వాత మసాలా పొడి కోసం..స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో ధనియాలు, శెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, మిరియాలు, గసగసాలు, లవంగాలు, నువ్వులు, ఇంగువ, దాల్చిన చెక్క, బ్యాడ్గీ మిర్చి, సాధారణ ఎండుమిర్చి, కొబ్బరి ముక్కలు వేసి తక్కువ మంటపై కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత, మిక్సీ జార్ లో వేసి కొద్దిగా బరకగా లేదా మెత్తని పొడిలా చేసుకోవాలి.
తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని, అందులో ముందుగా నానబెట్టుకున్న జీరగ సాంబ బియ్యం, కందిపప్పు, పల్లీలు, కూరగాయల ముక్కలు, వెల్లుల్లి, పసుపు వేసి, 3-4 కప్పుల నీళ్లు పోసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఆ మిశ్రమాన్ని గరిటెతో కొద్దిగా మాష్ (మెత్తగా) చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద మరొక కడాయి పెట్టి, అందులో నూనె వేడి చేయాలి.
నూనె వేడెక్కాక ఆవాలు, మెంతులు వేసి చిటపటలాడించాలి. అందులో చిన్న
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కరివేపాకు వేసి బాగా
వేయించుకోవాలి.
ఇవి మగ్గిన తర్వాత, మనం ముందుగా సిద్ధం చేసుకున్న బిసిబేలే బాత్ మసాలా
పొడి కొంచెం వేసి సువాసన వచ్చేదాకా వేయించాలి. తర్వాత అందులో చింతపండు
రసం పోసి, రుచికి సరిపడా ఉప్పు చూసుకుని వేసుకోవాలి. గ్రేవీకి
తగినన్ని నీళ్లు కలుపుకుని రెండు మూడు నిమిషాల పాటు బాగా
మరగనివ్వాలి.
-చివరగా కుక్కర్ లో ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నం, పప్పు, కూరగాయల మిశ్రమాన్ని ఈ మరుగుతున్న గ్రేవీలో వేసి బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం బియ్యానికి పట్టేలా సన్నపు మంట మీద కాసేపు ఉడికించాలి. తర్వాత అందులోగుమగుమలాడే నెయ్యి, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు చల్లి దించుకుంటే చాలు.
-నోరూరించే వేడి వేడి బిసిబేలే బాత్ రెడీ. దీనిపై కరకరలాడే ఖారా బూందీ చల్లుకుని తింటే, ఆ రుచి జీవితంలో మర్చిపోలేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
