Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
రోజూ తినే పప్పు బోర్ కొట్టిందా? అయితే ఈ ధాబా స్టైల్ దాల్ తడ్కా ట్రై చేయండి..గిన్నెలు గిన్నెలు లేపేస్తారు!
ప్రతిరోజూ ఇంట్లో వండే సాధారణ పప్పును చూస్తే చాలా మందికి విసుగు వస్తుంది. కానీ అదే పప్పుకు కాస్త నెయ్యి తగిలించి, కమ్మని తాలింపు (తడ్కా) జోడిస్తే..ప్రతి ఒక్కరూ లొట్టలేసుకుంటూ తింటారు.
ముఖ్యంగా హైవే పక్కన ఉండే ధాబాలలో దొరికే దాల్ తడ్కా రుచిని ఎవరూ మర్చిపోలేరు. ఆ స్మోకీ ఫ్లేవర్, ఆ గుమగుమలు ఎవరికైనా నోరూరిస్తాయి. ధాబా స్టైల్ దాల్ తడ్కాను మన ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

దాల్ తడ్కా తయారీకి కావాల్సిన పదార్థాలు
-1 కప్పు కంది పప్పు
-2 టీస్పూన్ల శనగ పప్పు
-చిటికెడు పసుపు
-రుచికి సరిపడా ఉప్పు
-ఒక టీస్పూన్ నూనె
-2 టేబుల్ స్పూన్ల నెయ్యి
-1 టీస్పూన్ జీలకర్ర
-1 కప్పు ఉల్లిపాయ తరుగు
-1 టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్
-1 కప్పు టమోటాల తరుగు
-2 టేబుల్ స్పూన్ల దేశీ నెయ్యి
-1 టీస్పూన్ వెల్లుల్లి తరుగు
-3 ఎండు మిరపకాయలు
-1 టీస్పూన్ కాశ్మీరీ ఎర్ర కారం
-కొద్దిగా ఇంగువ
-1 టీస్పూన్ కసూరి మెంతి
-కొద్దిగా కొత్తిమీర
దాల్ తడ్కా తయారీ విధానం
-ముందుగా కంది పప్పు, శనగ పప్పును శుభ్రంగా కడిగి 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టండి.
-తర్వాత కుక్కర్ లో నానిన పప్పు, తగినన్ని నీళ్లు, పసుపు, ఉప్పు, ఒక స్పూన్ నూనె వేసి 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా, కాస్త బద్దలుగా ఉండేలా చూసుకోవాలి.
-ఒక కడాయిలో నూనె వేడి చేసి అందులో జీలకర్ర,సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి అవి బంగారు రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్, టమోటాలు, ఉప్పు వేసి బాగా కలపాలి.
-టమోటాలు మెత్తబడి, మసాలా నుండి నూనె పైకి తేలే వరకు మగ్గనివ్వాలి. తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును ఇందులో వేసి కలపాలి. ఇప్పుడు మంటను సిమ్ లో పెట్టి 5 నిమిషాల పాటు పప్పును మరగనివ్వాలి. చివరగా చేతితో నలిపిన కసూరి మెంతి, తాజా కొత్తిమీర చల్లుకోవాలి.
-ఈ పప్పుకు ప్రాణం రెండవ తాలింపే. ఒక చిన్న తడ్కా పాన్ లో 2 టేబుల్ స్పూన్ల దేశీ నెయ్యి వేడి చేయండి. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, ఎండు మిరపకాయలు, చిటికెడు ఇంగువ వేయండి.
-వెల్లుల్లి వేగగానే స్టవ్ ఆఫ్ చేసి.. చివరగా కాశ్మీరీ ఎర్ర కారం వేయాలి. ఈ తాలింపును దాల్ పైన పోసి మూత పెట్టేయండి.
--బాగా కాలుతున్న ఒక చిన్న బొగ్గు ముక్కను ఒక చిన్న స్టీల్ గిన్నెలో ఉంచి ఆ గిన్నెను పప్పు మధ్యలో పెట్టండి. ఆ బొగ్గుపై అర టీస్పూన్ నెయ్యి వేయగానే పొగ రావడం మొదలవుతుంది. వెంటనే పప్పు గిన్నెపై మూత పెట్టి, 5 నిమిషాల పాటు అలాగే ఉంచండి.
-అంతే ఎంతో రుచికరమైన ధాబా స్టైల్ దాల్ తడ్కా రెడీ. దీన్ని వేడి వేడి జీరా రైస్, రోటీ లేదా నాన్ తో తింటే అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications