Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే
వేసవి కాలంలో ఏదైనా చల్లగా, కడుపుకు హాయిగా అనిపించే పానీయం తాగితే బాగుంటుందని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. కూల్ డ్రింక్స్ కంటే మన ఆరోగ్యానికి మేలు చేసే దేశీయ పానీయాలకు ఎండాకాలంలో ఎంతో డిమాండ్ ఉంటుంది. అందులోనూ అందరికీ ఇష్టమైనది, శరీరానికి తక్షణ శక్తిని, చలువను ఇచ్చే పానీయం లస్సీ.
పంజాబీ ధాబాల్లో దొరికే లస్సీ ఎంతో చిక్కగా, కమ్మగా, మీగడతో నోరూరిస్తుంటుంది. కానీ చాలామంది ఇంట్లో లస్సీ చేస్తే ఆ రుచి, ఆ చిక్కదనం రావడం లేదని పెదవి విరుస్తుంటారు. ఇకపై ఆ చింత వదిలేయండి. వేసవి తాపం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ, రోజంతా ఉల్లాసంగా ఉండేలా.. మీ ఇంట్లో పక్కా ధాబా స్టైల్ లస్సీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

ధాబా స్టైల్ లస్సీ తయారీకి కావాల్సిన పదార్థాలు
తియ్యటి, చిక్కటి తాజా పెరుగు - 2 కప్పులు
చక్కెర - 4 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - పావు టీస్పూన్
రోజ్ వాటర్ - 2 చుక్కలు
ఐస్ క్యూబ్స్- 3 లేదా 4
మీగడ (మలై) - పైన అలంకరించడానికి
సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ - బాదం, పిస్తా
కుంకుమపువ్వు - కొద్దిగా
ధాబా స్టైల్ లస్సీ తయారీ విధానం
-అసలైన ధాబా స్టైల్ రుచి రావాలంటే ముందుగా మీరు మిక్సీ వాడటం పక్కన పెట్టేయాలి. దాని బదులు చెక్కతో చేసిన కవ్వాన్ని తీసుకోండి. మిక్సీలో వేస్తే పెరుగు బాగా పలచబడిపోయి నీళ్లలా మారుతుంది. అదే కవ్వంతో చిలికితే పెరుగు క్రీమీగా, ఎంతో మృదువుగా వస్తుంది.
-ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో ముందుగా సిద్ధం చేసుకున్న చల్లటి, చిక్కటి పెరుగును వేయండి. దానికి తగినంత చక్కెర కలపండి. చక్కెర పూర్తిగా కరిగిపోయి, పెరుగు పైన నురగ ఏర్పడేంత వరకు కవ్వంతో ఓపిగ్గా చిలకండి.
-పెరుగు చక్కగా క్రీమ్ లాగా మారిన తర్వాత అందులో సువాసన కోసం పావు టీస్పూన్ యాలకుల పొడి, రెండు మూడు చుక్కల రోజ్ వాటర్ వేయండి. లస్సీ మరీ గట్టిగా ఉంటే కొద్దిగా చల్లటి పాలు లేదా చల్లటి నీళ్లు పోయండి. ధాబా లస్సీ ఎప్పుడూ నీళ్లలా పలచగా ఉండకూడదు, కాబట్టి నీళ్లు చాలా తక్కువగా వాడాలి.
-ఇప్పుడు అందులో ఐస్ క్యూబ్స్ వేసి మరోసారి కవ్వంతో తేలికగా చిలకండి. అంతే, చల్లచల్లని కమ్మటి లస్సీ రెడీ.
-ఈ లస్సీని పొడవైన గాజు గ్లాసుల్లో వడ్డించినా బాగుంటుంది, కానీ అసలైన పంజాబీ ఫీల్ రావాలంటే మట్టి గ్లాసుల్లో పోసి ఇవ్వండి. గ్లాసు నిండా లస్సీ పోశాక, దాని పైన ఒక చెంచా తాజా మీగడను వేయండి. పైన సన్నగా తరిగిన బాదం, పిస్తా పలుకులు, చిటికెడు కుంకుమపువ్వు చల్లండి.
-ఈ మండు వేసవిలో బయట ఎండ నుంచి ఇంటికి రాగానే ఈ ధాబా స్టైల్ చిక్కటి లస్సీని తాగితే.. ఆ క్షణంలో ప్రాణానికి లేచొచ్చినట్లు అనిపిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications