Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
సింపుల్ మసాలాలతో అద్భుతమైన రుచి..హైదరాబాదీ పాయా సూప్ సీక్రెట్ ఇదే..చలికాలంలో వేడివేడిగా
భారతీయ సంప్రదాయ వంటకాల్లో మాంసాహార ప్రియులు ఎంతగానో ఇష్టపడే వంటకం పాయా లేదా పాయా షోర్బా. పాయా అంటే మేక లేదా గొర్రె కాళ్ళు అని అర్థం. షోర్బా అంటే ఉత్తరాది బాషలో సూప్ అని అర్థం. చలికాలంలో, వర్షాకాలంలో పాయా సూప్ తీసుకోవడం వల్ల శరీరానికి వెచ్చదనంతో పాటు ఎన్నో పోషకాలు అందుతాయి.
హైదరాబాద్ లో పాయా నహారీ (ఉదయం అల్పాహారం) ఎంతో ప్రసిద్ధి. దీనిని నాన్, రోటీ లేదా ఇడ్లీతో కూడా తింటారు. పాయా వండటంలో ముఖ్యమైన విషయం దానిని శుభ్రం చేయడం, నెమ్మదిగా ఉడికించడం. ఎంత ఎక్కువ సేపు ఉడికితే అంత రుచి, పోషకాలు వస్తాయి. మీ ఇంట్లోనే ఈజీగా హైదరాబాదీ స్టైల్ పాయా సూప్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
మేక కాళ్లు
మిరియాలు
బిర్యానీ ఆకు
ఉల్లిపాయ
పచ్చిమిర్చి
ఉప్పు
పసుపు
వెల్లుల్లి
అల్లం
నల్ల యాలకలు
ఆవాల నూనె

తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 3-4 టేబుల్ స్పూన్ల ఆవాల నూనె వేసి వేడి చెయ్యాలి.
-వేడెక్కిన ఆయిల్ లో అరటీస్పూన్ దంచిన మిరియాలు, 2 దంచిన నల్ల యాలకలు, 1 బిర్యానీ ఆకు, 1 మీడియం సైజు ఉల్లిపాయ పొడవాటి చీలికలు వేసి అవి మెత్తబడే వరకు వేపాలి.
-ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే 10-12 వెల్లుల్లి రెబ్బలు, కచ్చాపచ్చాగా దంచిన అంగుళంన్నర అల్లం, 3 పచ్చిమిర్చి చీలికలు, అర కేజీ పాయా బోన్స్, రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ పసుపు వేసి పెద్ద మంట 8-10 నిమిషాలు కలుపుతూ పాయ బోన్స్ ని వేయించాలి.
-తర్వాత మంటను మీడియంలో పెట్టి మరో 4-5 నిమిషాలు వేయించాలి.
-తర్వాత అందులో 1 లీటరు నీళ్లు పోసి కలిపి మూతపెట్టి మీడియం మంట మీద 12-15 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత మూత తీయాలి.
-ఒక్కసారి ముక్కను పట్టుకొని చూడండి. మెత్తగా ఉడికితే సరే..లేదంటే మూతపెట్టి మీడియం మంట మీద మరో 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి.
-స్టీమ్ పోయిన తర్వాత కూడా మళ్లీ 5 నిమిషాలు పెద్ద మంట మీద మరిగించాలి.
-చివరగా అందులో కొంచెం కొత్తిమీర తరుగు చల్లి ఉప్పు రుచి చూసి అడ్జెస్ట్ చేసుకోండి. కారం తక్కువ అనిపిస్తే మిరియాల పొడి వేసుకోండి.
ప్రయోజనాలు
పాయా షోర్బాలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. మేక కాళ్ళలోని ఎముకలను ఎక్కువసేపు ఉడికించడం వల్ల అందులోని సారం సూప్ లోకి దిగుతుంది. ఇది మన ఎముకలను దృఢంగా మార్చడానికి సహాయపడుతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉన్నప్పుడు వేడివేడి పాయా సూప్ తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులకు పాయా ఒక దివ్యౌషధం
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications