Latest Updates
-
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ!
మహారాష్ట్ర వంటల సీక్రెట్ ఇదే..కూరల రుచిని రెట్టింపు చేసే గోదా మసాలా..ఎలా చేసుకోవాలంటే..
భారతీయ వంటకాల్లో మసాలాలకు ఉన్న ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే. సాధారణంగా మనం కూరల్లో గరం మసాలాను వాడుతుంటాం. కానీ మీకు మహారాష్ట్ర వంటకాల రుచి, ఆ ప్రత్యేకమైన సువాసన కావాలంటే మాత్రం మీ వంటగదిలో తప్పకుండా ఉండాల్సినది గోదా మసాలా.
సాధారణ గరం మసాలా ఘాటుగా ఉంటే, గోదా మసాలా రుచి చాలా భిన్నంగా ఉంటుంది. మరాఠీల ఇళ్లలో ప్రతి రోజూ దీని వినియోగం ఉంటుంది. శాకాహారం నుండి మాంసాహారం వరకు అన్నింటిలోనూ దీనిని వాడతారు. సూప్ లు, పరాఠాలలో కూడా దీనిని వాడితే రుచి అమోఘంగా ఉంటుంది. ప్రముఖ చెఫ్ సరాంశ్ గోయిలా సూచించిన పక్కా కొలతలతో, ఇంట్లోనే ఈ మసాలాను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
గసగసాలు: 2 టీస్పూన్లు
తురిమిన ఎండు కొబ్బరి: 2 టీస్పూన్లు
తెల్ల నువ్వులు: ఒకటిన్నర టీస్పూన్
నూనె: 2 టీస్పూన్లు
బిర్యానీ ఆకులు: 2
దాల్చిన చెక్క: 1 ముక్క
లవంగాలు: 8
ధనియాలు: 4 టీస్పూన్లు
వాము: అర టీస్పూన్
మిరియాలు: 1 టీస్పూన్
జీలకర్ర: 1 టీస్పూన్
కసూరి మేథి: 1 టీస్పూన్
రాతి పువ్వు: 1 చిన్న ముక్క
ఉప్పు: 1 టీస్పూన్
కారం పొడి: 1 టీస్పూన్
పసుపు: అర టీస్పూన్
ఇంగువ: చిటికెడు
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో నూనె వేయకుండా తెల్ల నువ్వులు, గసగసాలను మంచి సువాసన వచ్చే వరకు వేయించండి. చివరగా ఎండు కొబ్బరి తురుము కూడా వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో 2 టీస్పూన్ల నూనె వేడి చేయండి. నూనె కాగాక మిరియాలు, జీలకర్ర, వాము, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు వేసి వేయించండి.
-మసాలా దినుసులన్నీ వేగి మంచి వాసన వస్తున్నప్పుడు అందులో కసూరి మేథి వేసి కొద్దిగా వేయించి స్టవ్ ఆపేయండి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వండి.
-ఇప్పుడు వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు, నువ్వులు కొబ్బరి మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకోండి. వీటితో పాటు రాతి పువ్వు, కారం, పసుపు, ఇంగువ, ఉప్పు జతచేయండి. అన్నింటినీ మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి.
-అంతే ఘుమఘుమలాడే మహారాష్ట్ర స్పెషల్ గోదా మసాలా రెడీ.
-తయారు చేసుకున్న మసాలాను గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరుచుకోండి. ఇలా చేయడం వల్ల మసాలా సువాసన పోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
