Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
పాత కాలం పద్ధతిలో మట్కా చికెన్..ఈ ఆదివారం ఇలా ట్రై చేయండి..టేస్ట్ వేరే లెవల్!
ప్రస్తుత ఆధునిక కాలంలో మనం నాన్ స్టిక్ పాత్రలు, ప్రెజర్ కుక్కర్ లకు అలవాటు పడిపోయాం. కానీ మన పూర్వీకులు అనుసరించిన సంప్రదాయ వంట పద్ధతుల్లో ఉన్న రుచి, ఆరోగ్యం మరే ఇతర పద్ధతుల్లోనూ దొరకవు. అందులో ముఖ్యమైనది మట్కా చికెన్ లేదా కుండ చికెన్.
మట్టి కుండలో నెమ్మదిగా ఉడికించే ఈ చికెన్ కూర రుచి అద్భుతంగా ఉండటమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మట్కా చికెన్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
చికెన్: 1 కిలో
ఉల్లిపాయలు: 4-5
వెల్లుల్లి గడ్డలు: 2-3
ఆవాల నూనె: 1 కప్పు
అల్లంవెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
పెరుగు: అర కప్పు
కొత్తిమీర: ఒక కట్ట
బిర్యానీ ఆకు: 2
ఎండు మిరపకాయలు: 3-4
లవంగాలు: 4-5
యాలకులు: 3
దాల్చిన చెక్క: 2 అంగుళాల ముక్క
మిరియాలు: 1 టీస్పూన్
సాజీరా/జీలకర్ర: 1 టీస్పూన్
కారం: 2 టేబుల్ స్పూన్లు
పసుపు: అర టీస్పూన్
ధనియాల పొడి: 1.5 టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి: 1 టీస్పూన్
గరం మసాలా: 1 టేబుల్ స్పూన్
కశ్మీరీ చిల్లీ పౌడర్: 1 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
మట్టి కుండ
గోధుమ పిండి ముద్ద
తయారీ విధానం
-ముందుగా చికెన్ ముక్కలను ఉప్పు,పసుపు వేసి నీటితో శుభ్రంగా కడగాలి. నీరు పూర్తిగా వారిపోయేలా చూడాలి.
-ఒక పెద్ద గిన్నెలో శుభ్రం చేసిన చికెన్ ముక్కలను తీసుకోండి. ఇప్పుడు అందులో తరిగిన ఉల్లిపాయలు, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి,గరం మసాలా,పెరుగు, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు ఒక చిన్న కడాయిలో నూనెను వేడి చేయాలి. ఆవాల నూనె వాడుతుంటే పొగ వచ్చేంత వరకు వేడి చేసి కాస్త చల్లారనివ్వాలి. ఈ నూనెలో బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి దీనిని చికెన్ మిశ్రమంలో పోసి చేతితో కలిపి దీనిని అరగంట సేపు పక్కన పెట్టండి.
-ఇప్పుడు మట్టి కుండను తీసుకొని, లోపల కొద్దిగా నూనె రాయండి. మ్యారినేట్ చేసిన చికెన్‌ను కుండలో వేయండి. మధ్యలో శుభ్రం చేసిన పూర్తి వెల్లుల్లి గడ్డలను పెట్టండి. చికెన్ వేసాక, పైన కొద్దిగా నీళ్లు చల్లితే సరిపోతుంది.
-ఇప్పుడు కుండపై మూత పెట్టండి. గోధుమ పిండిని పొడవుగా చేసి కుండ అంచులకు, మూతకు మధ్య గాలి చొరబడకుండా సీల్ వేయాలి. దీనిని దమ్ పెట్టడం అంటారు. దీనివల్ల వాసన, రుచి కుండలోనే ఉండిపోతాయి.
-స్టవ్ వెలిగించి చాలా తక్కువ మంటపై కుండను పెట్టండి. సుమారు 45 నిమిషాల నుండి 1 గంట పాటు సన్నని మంటపై ఉడికించాలి. మధ్యమధ్యలో (ప్రతి 10-15 నిమిషాలకు) కుండను గుడ్డతో పట్టుకుని మెల్లగా కుదుపుతూ ఉండాలి.
-సుమారు గంట తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. 10-15 నిమిషాలు అలాగే వదిలేయండి. తర్వాత పిండి సీల్ తొలగించి మూత తీస్తే, ఘమఘమలాడే మట్కా చికెన్ రెడీ.
-వేడి వేడి అన్నం, రోటీ లేదా బగారా రైస్‌తో ఇది చాలా రుచిగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications