మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక

Posted By:

వీకెండ్ వచ్చిందంటే చాలు మాంసాహార ప్రియుల ఇంట్లో మటన్ ఘుమఘుమలు తప్పనిసరిగా ఉండాల్సిందే. అందులోనూ నోరూరించే, కమ్మటి సువాసనలు వెదజల్లే మటన్ సాంబార్ ఉంటే ఆ మజాయే వేరు. వేడి వేడి అన్నం లేదా రాగి సంగటితో ఈ మటన్ సాంబార్ ని కలుపుకుని తింటే ఆ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

బయట రెస్టారెంట్లలో దొరికే వాటికంటే, ఇంట్లో మనం స్వయంగా మన చేతులతో వండుకుంటే వచ్చే తృప్తే వేరు. మీరు ఇంట్లోనే చాలా సులభమైన పద్ధతిలో, పక్కా కొలతలతో ఈ అద్భుతమైన మటన్ సాంబార్ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Authentic Mutton Sambar Recipe How to Make Spicy Mutton Sambar at Home in Telugu

కావాల్సిన పదార్థాలు

మటన్ - 1 కేజీ
ఉల్లిపాయ - 1
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 25
దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - 5
సోంపు - అర చెంచా
ఎండు మిరపకాయలు - 15
పుదీనా ఆకులు - కొద్దిగా
పచ్చి కొబ్బరి - కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా
ధనియాల పొడి - 3 చెంచాలు
నూనె - తగినంత
ఉప్పు - రుచికి సరిపడా

రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ!

తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోవాలి. అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, అర స్పూన్ సోంపు వేసి వేయించాలి. అవి కాస్త వేగాక.. ఉల్లిపాయ ముక్కలు, అల్లం, 25 వెల్లుల్లి రెబ్బలు, 15 ఎండు మిరపకాయలు, అలాగే కొద్దిగా పుదీనా ఆకులు వేసి పచ్చి వాసన పోయేలా దోరగా వేయించుకోవాలి.

-వేగిన మసాలాలను చల్లారనివ్వాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకుని.. దానికి కొద్దిగా కొబ్బరి, కొత్తిమీర, 3 స్పూన్ల ధనియాల పొడి జత చేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద ప్రెజర్ కుక్కర్ పెట్టుకుని సారుకు తగినంత నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత శుభ్రంగా కడిగిన 1 కేజీ మటన్ ముక్కలను వేసి నూనెలో మగ్గనివ్వాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసి కలపాలి. మటన్ కొద్దిగా నీరు వదిలి వేగాక, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ ను ఇందులో వేసి ముక్కలన్నింటికీ మసాలా పర్ఫెక్ట్ గా పట్టేలా బాగా కలుపుకోవాలి.

-మసాలా పచ్చివాసన పోయాక, గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం మీకు తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి, 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. లేత మటన్ అయితే 3 విజిల్స్‌కు వెన్నలా ఉడికిపోతుంది)ః.

-విజిల్స్ వచ్చి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే... కంటికి ఇంపుగా, ముక్కుకు ఘాటుగా తగిలే నోరూరించే మటన్ సాంబార్ రెడీ.

-వేడి వేడి రాగి ముద్ద, మెత్తని చపాతీ లేదా పొగలు గక్కే అన్నంతో కలుపుకుని తింటుంటే వర్ణించలేనంత అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Thursday, October 15, 2026, 22:07 [IST]
Desktop Bottom Promotion